అన్వేషించండి

Maharastra Elections : ఫైనల్ స్టేజ్‌కు మహారాష్ట్ర ఎన్నికల వార్ - తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ బలగం !

Andhra Pradesh: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అగ్రనేతలతో పాటు ఇతర రాష్ట్రాల నేతలు కూడా మోహరించి ప్రచారం చేస్తున్నారు.

BJP is working hard in Maharashtra election campaign:  మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇరవయ్యో తేదీన జరగనున్న పోలింగ్ కు సంబందించి ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధం అయ్యాయి. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీ కూటమి.. గెలిచి తీరాలనుకుంటున్న కాంగ్రెస్ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ విస్తృతంగా బహిరంగసభల్లో ప్రసంగిస్తున్నారు. ఇతర అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. 

బీజేపీ ఎలక్షనీరింగ్ భిన్నంగా ఉంటుంది. ప్రచారంతో సమానంగా తెర వెనుక ఎలక్షనీరింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ అనుబంధ సంఘాలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాయి. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన నేతల్ని ఏరియాల వారీగా ఇంచార్జులుగా నియమిస్తారు. స్థానిక నేతలు అయితే సమన్వయం సాధించడం కష్టం అవుతుంది. ఇతర రాష్ట్ర నేతలు అయితే.. నేతల మధ్య చిన్న చిన్న విబేధాలు ఉన్నా..  ఆ ప్రభావం పార్టీపై పడకుండా ఎలక్షనీరింగ్ నిర్వహించే ఏర్పాట్లు చేస్తారు . 

Also Read: బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్ 

తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు నేతల్ని మహారాష్ట్రకు ఇంచార్జులుగా పంపారు. ఏపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి నాందేడ్ ప్రాంతానికి ఇంచార్జిగా వెళ్లారు. అక్కడ అగ్రనేతల పర్యటనలను సమన్వయం చేసుకోవడంతో పాటు బహిరంగసభలు, ప్రచార వ్యూహం.. ఎలక్షనరింగ్ పక్కాగా జరిగేలా అక్కడి పార్టీ నేతల్ని సమన్వయం చేసుకుంటున్నారు. తప్పని సరిగా మహారాష్ట్రాలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, ఫడ్నవీస్ సహా ముఖ్య నేతలంతా రోజూ నాందేడ్ జిల్లాలో పర్యటిస్తున్నారు.  

పద్దెనిమిదో తేదీ వరకూ ప్రచారం ఉంటుంది. ఈ ఐదు రోజుల పాటు జోరుగా ప్రచారం జరగనుది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరికొన్ని సభల్లో ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమి నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. అందుకే ఈ సారి ఎన్నికల ఫలితాలపై ఆసక్తి ఏర్పడింది. సహంజగానే వ్యూహాత్మక ప్రచారం చేసే బీజేపీ .. ప్రచారంలో ముందు ఉందని అనుకోవచ్చు.                                                  

Also Read: తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?

టాప్ హెడ్ లైన్స్

Arshdeep Test Call UP: ఆ పేస‌ర్ ను టెస్టుల్లో ఆడించాల్సిందేనంటూ గావ‌స్క‌ర్ డిమాండ్.. తొలి వ‌న్డే లో స్వింగ్ మాయాజాలం చూసి ఫిదా 
ఆ పేస‌ర్ ను టెస్టుల్లో ఆడించాల్సిందేనంటూ గావ‌స్క‌ర్ డిమాండ్.. తొలి వ‌న్డే లో స్వింగ్ మాయాజాలం చూసి ఫిదా 
PDS Rice Recycling: సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
ABP Desam Top 10, 4 November 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 4 November 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget