అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Andhra Pradesh: తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?

Social Media: సోషల్ మీడియా కేసుల్లో అరెస్టవుతున్న వారు ప్రజాధనంతో జీతాలిచ్చినట్లుగా తెలుస్తోంది. డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించిన విషయాలు సంచలనం అవుతున్నాయి.

Arrested in social media cases are paid with public money:  ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసులు సంచలనం రేపుతున్నాయి. అరెస్టు అవుతున్న వారు గత ఐదేళ్ల కాలంలో పెట్టిన పోస్టులు అత్యంత జుగుప్సాకారంగా ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో వారు ఆ సమయంలో ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారని ఆధారాలు లభించినట్లుగా వర్రా రవీందారెడ్డిని అరెస్టు చేసిన విషయాన్ని ప్రెస్మీట్ పెట్టి చెబుతున్న సమయంలో డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. అంటే  గత ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజధనాన్ని సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలుగా ఇచ్చి  ప ్రతిపక్ష నేతల్ని. వారి కుటుంబీకుల్ని తిట్టించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

అరెస్టు అవుతున్న వారిలో ఎక్కువ మందికి డిజిటల్ కార్పొరేషన్ పే రూల్స్

వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ తో పాటు సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారిలో అత్యధిక మంది గత ఐదేళ్లుగా డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని డీఐజీ ప్రవీణ్ కోయ కూడా చెప్పారు. వారు డిజిటల్ కార్పొరేషన్‌లో ప్రత్యేకంగా చేసిన ఉద్యోగం ఏమీ లేదు. సోషల్ మీడియా పోస్టులు వైసీపీకి అనుకూలంగా పెట్టడమే. పార్టీ పని కోసం ప్రజాధనంతో సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలిచ్చారని తాజాగా ఈ కేసులో బయటపడినట్లయింది. గతంలోనే ఈ అంశంపై పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా జీతాలు తీసుకున్న వారు గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపైనా తప్పుడు పోస్టులు పెట్టారని గుర్తించారు. ఇప్పుడీ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Also Read: ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !

ఏమిటీ డిజిటల్ కార్పొరేషన్ ! 

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఐ డ్రీమ్ అనే యూట్యూబ్ చానళ్ల గ్రూపును నడిపే చిన్న వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని దీనికి చైర్మన్ గా నియమించారు. ఆ డీజిటల్ కార్పొరేషన్ లక్ష్యం ప్రభుత్వ డిజిటల్ ప్రచారాన్ని చూసుకోవడం. అలాగే ప్రజలకు డిజిటల్ సమాచారాలను చేరవేయడం. ఇందు కోసం  పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టారు. అయితే నియామకాల గురించి మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఈ కార్పొరేషన్ కింద జీతాలు చెల్లించినట్లుగా తాజాగా వెలుగులోకి రావడం సంచలనాత్మకం అవుతోంది. 

Also Read: 'అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది' - మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

సమగ్రమైన దర్యాప్తు చేస్తే  కీలక విషయాలు వెలుగులోకి వస్తాయా ?

సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిని ఏ మాత్రం క్షమించకూడదని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అంతా వ్యవస్థీకృతంగా జరిగిన నేరం కాబట్టి సూత్రధారుల్ని కూడా బయటకు లాగాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డిని ఏ వన్ గా పెట్టి కేసు నమోదు చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన వారందరి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ  కేసుపై  పోలీసులు విచారణ ప్రారంభిస్తే ఎంత లోతుగా వెళ్తుందో  చెప్పడం కష్టమని పోలీసు వర్గాలే అంచనా వేస్తున్నాయి. ఇందులో ప్రజాధనాన్ని పార్టీ కార్యకర్తలకు వినియోగించడం.. వారు అసాంఘిక శక్తుల మాదిరిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా చాలా పెద్ద విషయం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకే ముందు ముందు ఈ కేసు వ్యవహరాలు మరింత సంచలనం అయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
Embed widget