అన్వేషించండి

YS Sharmila: 'అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది' - మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Andhra News: మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా అనడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు.

YS Sharmila Sensational Tweet On YS Jagan: తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్న మాజీ సీఎం జగన్‌పై (Jagan) ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తీరు చూస్తుంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందని మండిపడ్డారు. 'అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది.?. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది.?. మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే.. ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం.' అని షర్మిల పేర్కొన్నారు.

'సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదు'

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదని.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని షర్మిల మండిపడ్డారు. 'రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. మహిళలపై దాడులు ఆగడం లేదు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. బెల్టుషాపుల దందాను అరికట్టలేదు. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు. రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం YCPకి ప్రజలు ఇస్తే... ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గుచేటు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదు. మీ లెక్క హోదా కావాలని మారాం చేయలేదు. 

26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు. హోదా లేకున్నా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గార్లు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. నియంత మోదీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారింది. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టీ అసెంబ్లీకి వెళ్లండి. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే YCP శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయండి. అప్పుడు ఇంట్లో కాదు.. ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండి.' అని పేర్కొన్నారు.

కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావొద్దని మాజీ సీఎం జగన్ నిర్ణయించారు. సోమవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వైసీపీ నేతలు నిరసన తెలిపారు. మాక్ అసెంబ్లీ నిర్వహించారు.

Also Read: Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Basara IIIT: బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Andhra Pradesh Budget Sessions : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం- తొలి పద్దు ప్రవేశ పెట్టిన పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం- తొలి పద్దు ప్రవేశ పెట్టిన పయ్యావుల కేశవ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన రౌడీ, ఒక్క వీడియోతో గప్‌చుప్బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Basara IIIT: బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Andhra Pradesh Budget Sessions : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం- తొలి పద్దు ప్రవేశ పెట్టిన పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం- తొలి పద్దు ప్రవేశ పెట్టిన పయ్యావుల కేశవ్
SSMB29 Budget: మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ @ 2000 కోట్లు - తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ @ 2000 కోట్లు - తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
Pragya Jaiswal : బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ మధ్య లవ్ సీన్స్ ఎక్కువ కావాలట.. ప్రగ్యా ఫోటోలకు ఫ్యాన్ క్రేజి కామెంట్
బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ మధ్య లవ్ సీన్స్ ఎక్కువ కావాలట.. ప్రగ్యా ఫోటోలకు ఫ్యాన్ క్రేజి కామెంట్
Deepthi Sunaina : బీచ్​ లుక్​లో దీప్తి సునయన.. రోజు రోజుకి హాట్​గా మారుతున్న బ్యూటీ
బీచ్​ లుక్​లో దీప్తి సునయన.. రోజు రోజుకి హాట్​గా మారుతున్న బ్యూటీ
Devi Sri Prasad: 'కంగువ' హిట్టైతే బన్నీది తప్పు... లేదంటే దేవి శ్రీ ప్రసాద్‌ది తప్పు - ఇండస్ట్రీలో లేటెస్ట్ డిస్కషన్
'కంగువ' హిట్టైతే బన్నీది తప్పు... లేదంటే దేవి శ్రీ ప్రసాద్‌ది తప్పు - ఇండస్ట్రీలో లేటెస్ట్ డిస్కషన్
Embed widget