Case On RGV: ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
RGV: రామ్‌గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదు అయింది. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లతో పాటు వారి కుటుంబసభ్యులను కించ పరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు.
Case registered against Ramgopal Verma: ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదు అయింది. చంద్రబాబు కుటుంబాన్ని కించ పరిచారని టీడీపీ కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ వ్యూహం అనే సినిమాను ఆర్జీవీ తీసారు. ఆ సమయంలో లోకేష్, చంద్రబాబు వారి కుటుబంంలోని మహిళలను కించ పరుస్తూ పలు పోస్టులు పెట్టారు. ఇవన్నీ అసభ్యకరంగా ఉండటంతో అప్పట్లోనే టీడీపీ నేతలు వర్మపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు కేసులు పెట్టారు.
వైసీపీ కోసం సోషల్ మీడియాలో ఫుల్ టైం పని చేసిన ఆర్జీవీ
సినీ దర్శకుడిగా ఉన్న రామ్ గోపాల్ వర్మ తర్వాత రాజకీయాల్లో వేలు పెట్టారు. 2014-19 మధ్యలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఓ వివాదాస్పద సినిమాను విడుదల చేశారు. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన తగ్గలేదు . ఎన్నికలకు రెండేళ్ల ముందు సోషల్ మీడియాలో పూర్తి స్థాయి డ్యూటీ చేశారు. చంద్రబాబు,లోకేష్, పవన్ కల్యాణ్‌లపై ఆకారణంగా విరుచుకుపడటంతో పాటు యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో మహిళల్ని కించ పరిచేలా పలు మార్పింగ్‌లు కూడా చేశారు. అవి వైరల్ అయ్యాయి.
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబాలను కించ పరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు
ఇక టీడీపీ నేతల్ని టార్గెట్ చేసుకుని ఆయన కించ పరిచేలా అనేక పోస్టింగులు పెట్టారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం మహిళల్ని కించ పరిచిన వారిపై చర్యలు తీసుకుంటోంది కొన్ని వందల మందిపై కేసులు పెట్టింది. ఈ క్రమంలో ఆర్జీవీపైనా ఓ టీడీపీ నేత ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే పోలీసులు ఇలాంటి కేసుల పట్ల నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్న సమయంలో ఆయనపై కేసు నమోదు కావడంతో వెంటనే చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆయనకు నేరుగా నోటీసులు జారీ చేయడమో లేకపోతే అరెస్టు కోసం ప్రత్యేక బృందాలను పంపడమో చేస్తారని భావిస్తున్నారు.
'అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది' - మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో ఆర్జీవీని అరెస్టు చేస్తారనే ఊహాగానాలు
పవన్ కల్యాణ్‌ను ఆయన మొదటి నుంచి టార్గెట్ చేసేవారు. కించ పరిచేవారు. తేలికగా తీసుకున్నట్లుగా జోకులేసేవారు. ఇదు కోసం ఇతర వైసీపీ నేతలతో కలిసి ఆయన పని చేశారు. ఇప్పుడు ఆర్జీవీని వదిలేస్తే ఆయన మరింత రెచ్చిపోతారని ట్రీట్ మెంట్ ఇవ్వాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు తీసుకోబోయే చర్యలపై ఆసక్తి ఏర్పడింది.