News
News
వీడియోలు ఆటలు
X

నాన్నపై ఎంతకాలం ఆధారపడతాను?: అఖిల్ అక్కినేని

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

FOLLOW US: 
Share:
అక్కినేని వారసుడు యూత్ కింగ్ అఖిల్ 'ఏజెంట్' గా అలరించడానికి రెడీ అయ్యాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని, సినిమాపై అంచనాలని పెంచేసింది. ఈ నేపథ్యంలో అఖిల్ అక్కినేని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా అఖిల్ చెప్పిన విశేషాలు.. ఆయన మాటల్లోనే...

మమ్ముటి పాత్రతో లవ్‌లో పడిపోయా

'ఏజెంట్' చాలా ప్రత్యేకమైన సినిమా. మమ్ముట్టి లాంటి స్టార్ హీరో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారంటేనే అర్థమవుతుంది ఈ కథ ఆయనకు ఎంతగా నచ్చిందో. ఇది కేవలం ఒక్క హీరో వైపు నుంచే నడిచే సినిమా కాదు. మూడు పాత్రలు మధ్య ఇంటెన్స్ డ్రామా జరిగే సినిమా ఇది. మమ్ముట్టి గారి పాత్రతో నేను లవ్ లో పడిపోయాను. అంత అద్భుతంగా వచ్చింది. కథ ఓ కొత్త ప్రపంచంలో జరుగుంటుంది. కంప్లీట్ గా న్యూ సెటప్. ఖచ్చితంగా 'ఏజెంట్' ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది.

మాస్ ఆడియన్స్‌కు నచ్చేలా చేశాం

ఇందులో నా పాత్ర పేరు రిక్కీ. చాలా వైల్డ్ గా వుంటుంది. ఎవరూ ఊహించని విధంగా డీల్ చేస్తాడు. ఏజెంట్.. వెరీ వైల్డ్. స్పై జోనర్ కాబట్టి కొంచెం సీరియస్ గా వెళిపోతుంది. అయితే మాస్ ఆడియన్స్ కి నచ్చేలా ఎంగేజింగ్ ఎంటర్టైనింగా ఉండటానికి స్క్రిప్ట్ దశలోనే చాలా వర్క్ చేశాం. స్పై అంటే నీడలో ఉంటూ అందరితో బ్లెండ్ అయిపోయి వుండాలి. కానీ ఏజెంట్ కంప్లీట్ రివర్స్. అన్ ప్రెడిక్ట్ వైల్డ్ మంకీలా ఉంటాడు. సెపరేట్ కామెడీ స్పై రన్ ని డిస్ట్రబ్ చేస్తుంది. అందుకే హ్యూమర్ ని హీరో పాత్రలోనే ఉండేట్లు చూసుకున్నాం. అది చాలా ఆసక్తికరంగా వుంటుంది. క్యారెక్టర్ వైల్డ్ నెస్ వలన అది వర్క్ అవుట్ అయ్యింది. సూరి గారి సినిమాలో హీరో పాత్రలు మాములుగా క్రాక్ గా వుంటాయి. అందుకే సినిమా ఎక్సయిటింగ్ గా ఉంటుంది. ఆయన ఏజెంట్ ని చాలా ప్రేమించి చేశారు. డైరక్టర్ ఎలాంటి లుక్ ని కోరుకుంటున్నారనే దానిపై ఫోకస్ పెట్టాను. 4 నెలల్లో నేను కోరుకుంటున్న బాడీ తీసుకురాగలని అనుకున్నాను కానీ 10 నెలలు పట్టింది. 

కొత్త తరహా యాక్షన్ చేయాలనే ‘ఏజెంట్’ ఎంచుకున్నా

ఫస్ట్ లాక్ డౌన్ లో మొదలైంది. నాకు చిన్నప్పటి నుంచీ లార్జర్ దేన్ లైఫ్, యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే రాజమౌళి సినిమాలంటే చాలా పిచ్చి. యాక్షన్ చిత్రాలపై ఆ ఇష్టం ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఆ జోనర్లో కొత్తగా ఏదో చేయాలనిపిస్తుంటుంది. నిజం చెప్పాలంటే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేస్తున్నప్పుడే ఇంకా ఏదో చేయాలనిపించేది. ఆ సినిమాని తక్కువ చేయడం లేదు. అది మంచి విజయం సాధించింది. పర్సనల్ గా నాకు ఇష్టమైన జోనర్ యాక్షన్. లాక్ డౌన్ ట్లో ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు.. సురేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అప్పటికి స్టోరీ ఇంకా తెలీదు. కానీ ఏదైనా కొత్తగా ఫ్రెష్ గా చేయాలని మాత్రం నిశ్చయించుకున్నాను. ఒక కొత్త తరహా యాక్షన్ సినిమా చేసి ఫ్రెష్ కంటెంట్ ని ఇవ్వాలనే ప్రయత్నంతో స్పై జోనర్ ని ఎంపిక చేసుకున్నాను.

నా పాత్ర కోతిలా బిహేవ్ చేస్తుంది

ఏజెంట్ జోనర్ నాకు బాగా నచ్చేసింది. లిమిటేషన్స్ విషయానికి వస్తే.. ఇంత క్రేజీగా చేయగలుగుతానా లేదా అనేది డౌట్. ఎందుకంటే ఇంతకుముందు అలాంటింది చేయలేదు. ఇప్పటి వరకూ నేను సబ్టిల్ రోల్స్ చేశాను. ఈ పాత్ర కోతిలానే బిహేవ్ చేస్తుంది. ప్రతి క్షణం ఒక హైలో మాట్లాడాలి. అది నాకు చాలా కష్టం అనిపించింది. అయితే కొంత జర్నీ తర్వాత ఆ పాత్ర అలవాటైపోయింది.

ఆయన మూడు నెలలు నడవలేయపోయారు

నిజానికి ఏజెంట్ సినిమాని చాలా త్వరగా అనౌన్స్ చేసేశాం. స్క్రిప్ట్ చేయడానికి మాకు ఏడాది పట్టింది. తర్వాత డైరక్టర్ సురేందర్ రెడ్డి గారికి అనారోగ్యం చేసింది. దాదాపు మూడు నెలలు నడవలేకపోయారు. ఈ సినిమాకి 120 రోజులు వర్క్ చేశాం. ఇలాంటి భారీ స్కేల్ సినిమాకి 15 నెలలు టైం పట్టడం సహజమే. అయితే ముందుగానే అనౌన్స్ చేసేయడం వల్లే మూడేళ్ళు పట్టిందని అనిపించడానికి కారణం.

నాన్నపై ఎంతకాలం ఆధారపడతాను?

నిజం చెప్పాలంటే నాన్నతో ‘ఏజెంట్’ స్క్రిప్ట్ గురించి చెప్పలేదు. కొంచం మాత్రమే చెప్పాను. నా సక్సెస్ ఫెయిల్యూర్స్ కి నేను తీసుకునే నిర్ణయాలే కారణం కావాలనుకుంటాను. ఎంత కాలం నాన్నపై ఆధారపడతాను?. నాకు నేను సొంతంగా నిర్ణయాలు తీసుకుంటేనే కదా ఎదిగేది. ఆయన నాకు ఎన్సైక్లోపీడియా కాబట్టి నేను ఇప్పటికీ సలహాలను తీసుకుంటాను. చాలా ప్రశ్నలు అడుగుతాను. కానీ ఈ కథ చేయాలా వద్దా అనేది మాత్రం నా నిర్ణయమే.
 
Published at : 24 Apr 2023 08:00 AM (IST) Tags: Akhil Akkineni Nagarjuna Agent Surender Reddy Agent on April28

సంబంధిత కథనాలు

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?

Adipurush: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?

Korean Thrillers: ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఒక్కసారి చూస్తే చాలు, జీవితంలో మరిచిపోలేరు - ఓ లుక్ వేసేయండి

Korean Thrillers: ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఒక్కసారి చూస్తే చాలు, జీవితంలో మరిచిపోలేరు - ఓ లుక్ వేసేయండి

Nawazuddin Siddiqui: లీడ్ యాక్టర్స్‌తో కలిసి తింటుంటే, కాలర్ పట్టుకొని బయటకు లాక్కెళ్లారు - నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ

Nawazuddin Siddiqui: లీడ్ యాక్టర్స్‌తో కలిసి తింటుంటే, కాలర్ పట్టుకొని బయటకు లాక్కెళ్లారు - నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?