News
News
వీడియోలు ఆటలు
X

Virupaksha Sequel: ‘విరూపాక్ష’కు సీక్వెల్‌? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు కార్తిక్ దండు

థియేటర్లో సందడి చేస్తున్న ‘విరూపాక్ష’ మూవీ గురించి ఆసక్తికర అప్‌డేట్ చెప్పారు దర్శకుడు కార్తీక్. అదేంటో చూసేయండి మరి.

FOLLOW US: 
Share:

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ మూవీ పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 21న) రిలీజైంది. ఈ మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. దీంతో ఈ మూవీ సిక్వెల్‌పై కూడా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ దర్శకుడు కార్తీక్ దండు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. 

కార్తీక్ ఓ టీవీ చానెల్ ఇంటర్వూలో ఓ ప్రేక్షకుడు ‘విరూపాక్ష’కు సీక్వెల్ వస్తుందా అని అడిగాడు. దీనిపై కార్తీక్ స్పందిస్తూ.. ‘‘ఇప్పటికైతే అనుకోలేదు. నేను, సుకుమార్ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా సీక్వెల్ ఉంటుంది. కానీ, వెంటనే రాకపోవచ్చు’’ అని తెలిపారు. అయితే, ఈ మూవీలో ఉన్న రెండు పాటల్లో కేవలం ఒక పాట మాత్రమే థియేటర్లో ఉందని, రెండోది లేదని అడగ్గా.. ఓటీటీలో రిలీజ్ చేసేప్పుడు ఆ పాటను చేర్చుతామన్నారు. థియేటర్‌లో థ్రిల్ మిస్సవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆ పాటను తొలగించినట్లు వెల్లడించారు. 

ఊహించని కలెక్షన్స్

‘విరూపాక్ష’ మూవీని ముందుగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆఖరి క్షణంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కేవలం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే రిలీజ్ చేశారు. విడుదల రోజే మూవీకి హిట్ టాక్ రావడం, వీకెండ్‌లో ఈ మూవీకి పోటీగా మరే సినిమాలు లేకపోవడం ‘విరూపాక్ష’కు కలిసొచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా కలెక్షన్లు వస్తున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రూ.10 కోట్ల క్లబ్‌లోకి చేరింది ఈ మూవీ. ఒక్ నిజాంలోనే 4.53 కోట్లు వసూళ్లు చేసింది ఈ మూవీ. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్  'విరూపాక్ష' సినిమాను నిర్మించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీ తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సినిమా చూసేందుకు థియేటర్ల దగ్గర అభిమానులు పోటెత్తారు. 'విరూపాక్ష' హిట్టు బొమ్మ అంటున్నారు నెటిజనులు. సాయి ధరమ్ తేజ్ హిట్ అందుకోవడం పట్ల మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం ‘విరూపాక్ష’ కావడంతో అభిమానులలో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా రెగ్యులర్ కమర్షియల్ కథతో కాకుండా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకోవడం కూడా సాయి ధరమ్ తేజ్‌కు ప్లస్ అయ్యింది. మొత్తంగా సినిమా బావుందని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ దెబ్బతో సాయి కెరీర్ మళ్లీ గాడిన పడటం ఖాయమని అంటున్నారు. 

Also Read తెలుగులో బుజ్జి కన్నా - నిర్మాత తనయుడితో 'లవ్ టుడే' హీరోయిన్

మేనల్లుడికి చిరు, పవన్ అభినందనలు!

మేనల్లుడి తాజా సినిమా సక్సెస్ కావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. చిరంజీవి సతీమణి సురేఖ సాయి ధరమ్ తేజ్ కు కేక్ తినిపించి శుభాకాంక్షలు చెప్పింది. ‘విరూపాక్ష’కు పాజిటివ్ టాక్ రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రంతో ఆయన మళ్లీ హిట్ ట్రాక్ లో వెళ్లడం ఆనందంగా ఉందని తెలిపింది.  “’విరూపాక్ష’ గురించి చక్కటి రిపోర్టులు వస్తున్నాయి. నేను వాటిని చూసి చాలా సంతోషంగా ఉన్నాను. సాయి ధరమ్ తేజ్ మంచి సక్సెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చావు. మీ చిత్రాన్ని అందరూ అభినందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నీ సినిమాని ప్రేక్షకులు మెచ్చుకోవడంతో పాటు వారి ఆశీస్సులు అందించడం హ్యాపీ ఉంది.  మీ మొత్తం టీమ్ కు హృదయ పూర్వక అభినందనలు” అని చిరంజీవి ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ‘విరూపాక్ష’ సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘‘డియర్ సాయి ధరమ్ తేజ్, ‘విరూపాక్ష’ గ్రాండ్ సక్సెస్ పట్ల హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అంటూ అభినందన లేఖ పంపించారు. 

Also Read సల్మాన్ మార్కెట్ పదేళ్ళు వెనక్కి - ఫస్ట్ డే మరీ ఇంత ఘోరమా!?

Published at : 23 Apr 2023 01:48 PM (IST) Tags: Sai Dharam Tej Virupaksha Movie Virupaksha samyukta Virupaksha sequel Virupaksha collections

సంబంధిత కథనాలు

పెళ్లికి వయసుతో సంబంధం లేదు, అదే ముఖ్యం: నటి మాధవీ లత

పెళ్లికి వయసుతో సంబంధం లేదు, అదే ముఖ్యం: నటి మాధవీ లత

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

టాప్ స్టోరీస్

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party :  తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ