Chiranjeevi: మహాత్ముల జన్మదినం... ట్విట్టర్లో చిరు ప్రత్యేక పోస్టు
మహాత్మగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి... ఈ ఇద్దరు మహాత్ములు జయంతి అక్టోబర్ 2నే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరు ట్విట్టర్ లో స్పందించారు.
స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా పాల్గొని మనకు స్వేచ్ఛా వాయువులను ప్రసాదించిన గొప్ప నేతలు మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి. ఇద్దరి జయంతి అక్టోబర్ 2నే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో గౌరవ నివాళులు అర్పించారు. ఇద్దరు మహనీయులకు వేర్వేరు ట్వీట్ లలో నివాళులు అర్పించారు. గాంధీని ఉద్దేశించి విలువలు, సింపుల్ బతకడం, అహింసా, నిజాన్నే మాట్లాడడం ఇవన్నీ మనకు జాతిపిత మహాత్మ గాంధీ నేర్పారని కొనియాడారు.
లాల్ బహదూర్ శాస్త్రిని ఉద్దేశించి స్వేచ్ఛా భారత వ్యవస్థాపక పితామహులుగా కొనియాడారు చిరు. జ్ఞానం, సమగ్రత, వినయం, నిబద్ధతలో శాస్త్రి గారిని మించిన వారు లేరని, అతని నినాదం జై జవాన్ జై కిసాన్ ఎంతో శక్తివంతమైనది ట్వీట్ చేశారు. వారిద్దరి ఫోటోలను పోస్టు చేసి నివాళులు అర్పించారు చిరు.
One of Free India’s founding fathers & our 2nd Prime Minister Shri Lal Bahadur Shashtri was 2nd to none in wisdom,integrity, humility & commitment.His powerful #JaiJawanJaiKisan is such a powerful, everlasting expression.Respects to the Great Soul!#LalBahadurShastriJayanti pic.twitter.com/G1u6fu7klD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 2, 2021
The values & ideals of Simplicity,Truth & Non-Violence taught by our Father of the Nation,Mahatma Gandhi become a greater necessity with each passing year.Paying respectful tributes on his birth anniversary to the Eternal Visionary & our greatest guiding light! #GandhiJayanthi pic.twitter.com/7G4rDMyHcC
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 2, 2021Also read: ఆపిల్ కన్నా గుడ్డులోనే అవెక్కువట.. అందుకే తినమంటున్నారు
Also read: ఈ మహాత్ముడు మనకే కాదు ఎన్నో దేశాల ప్రజలకు స్పూర్తి
Also read: రాత్రి పడుకోబోయే ముందు ఈ టీ తాగితే... ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు
Also read: అందాల ‘మేఘం’ మెరిస్తే... నవ్వుల నవరత్నాలు రాలాల్సిందే
Also read: జూబ్లీహిల్స్ లో బంగ్లా కొన్న పవర్ స్టార్, ఖరీదు ఎంతంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి