(Source: ECI/ABP News/ABP Majha)
Lemon Ginger Tea: రాత్రి పడుకోబోయే ముందు ఈ టీ తాగితే... ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు
కొంతమందికి ఎంత ప్రయత్నించినా నిద్ర సరిగా పట్టదు. అలాంటి వారికి అమృతం ఈ నిమ్మ-అల్లం టీ.
పెద్దవారితో పోలిస్తే చిన్నపిల్లలకు త్వరగానే నిద్రపట్టేస్తుంది. కానీ పెద్దవారిలో దాదాపు 10 శాతం నుంచి 30 శాతం వరకు చాలా మంది నిద్రపోవడానికి చాలా కష్టపడతారు. కొంతమందికి గంటగడిచినా కళ్లు మూతపడవు. కనిపించని ఒత్తిడి, డిప్రెషన్, అజీర్తి లాంటివి దీనికి కారణం కావచ్చు. ఇలాంటి వారు రోజూ పడుకోబోయే ముందు నిమ్మ- అల్లం టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మ, అల్లం రెండింటిలోనూ ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గించి నిద్రపట్టేందుకు సహకరిస్తాయి. దీన్ని తాగిన వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. కానీ తాగడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజులకే మంచి ఫలితం కనిపిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం అల్లం మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. దీనికి విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ జతచేరితే రోగనిరోధక శక్తి కూడా పెరిగి మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అజీర్తి వంటి సమస్యలు కూడా ఉండవు. ఒత్తిడిని తగ్గించి చక్కగా నిద్రపోయేలా చేస్తుంది నిమ్మ-అల్లం టీ.
బరువు తగ్గేందుకు...
బరువు తగ్గాలనుకువారికి మంచి ఎంపిక ఈ టీ. నిమ్మలోని గుణాలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకపోదు. ఇక అల్లం ఆకలిని తగ్గిస్తుంది. దీని వల్ల అతిగా తినే అవకాశం ఉండదు. తద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు.
రోగనిరోధకత...
నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ రోగనిరోధకతను పెంచుతాయి.
నొప్పిని తగ్గిస్తాయి...
శరీరంలో నొప్పి, వాపులను తగ్గించడంలో ఈ టీ ముందుంటుంది. తలనొప్పి, మోకాలి నొప్పులు, కండరాల తిమ్మిర్లు వంటివి ఈ టీ తాగిన వాళ్లలో త్వరగా తగ్గిపోతాయి.
తయారీ ఇలా...
నీరు - ఒక కప్పు
అల్లం ముక్క - చిన్నది
నిమ్మరసం - ఒక స్పూను
తేనె - ఒక స్పూను
1. నీరు మరిగించి అందులో అల్లాన్ని తురిమి వేయండి. రెండు నిమిషాలు మరిగించండి.
2. ఆ అల్లం మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టండి. గోరువెచ్చగా మారాక అందులో నిమ్మరసం, తేనె వేసి కలపండి. అంతే అల్లం టీ సిద్దమైనట్టే. అల్లం నీళ్లు చాలా వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం, తేనె కలిపితే వాటిలో గుణాలు నశిస్తాయి. కాబట్టి వేడి తగ్గాక వాటిని జోడించాలి.
Also read: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి... హార్వర్డ్ ఆరోగ్య నిపుణుల సలహా
Also read: ఆపిల్ కన్నా గుడ్డులోనే అవెక్కువట.. అందుకే తినమంటున్నారు
Also read: రైస్ కుక్కర్ ను పెళ్లాడిన యువకుడు, నాలుగు రోజులకే నిజం తెలిసి...