అన్వేషించండి

Mahatma Gandhi: ఈ మహాత్ముడు మనకే కాదు ఎన్నో దేశాల ప్రజలకు స్పూర్తి

భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు వీచేలా చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మ గాంధీ. ఆయన జన్మదినం అక్టోబర్ 2. ఇదే రోజున మనం అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటాం.

‘‘ఇలాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలు గల శరీరంతో ఈ భూ ప్రపంచం మీద నడిచారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు’’
గాంధీజీని ఉద్దేశించి ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అన్న మాటలివి. నిజమే గాంధీజీ జీవితాన్ని మొదట్నించి చివరి పేజీ వరకు చదివి చూస్తే, ఆ మహాత్ముడి సందేశాలను, పద్ధతులను అర్థంచేసుకుంటే ఈ మాటలు సత్యమే అనిపించకమానవు. ఆయన జీవితమే మనకు మార్గనిర్దేశనం.

గాంధీజీ జీవితమంతా పోరాటాలమయం. చిన్నప్పుడు తనను తాను గెలిచేందుకు, తన మనసును అదుపులో పెట్టుకునేందుకు తనతో తానే యుద్ధం చేశారు. తరువాత దక్షిణాఫ్రికాలో అసలైన ప్రజా ఉద్యమాలకు నాయకుడిగా మారారు. అక్కడ్నించి స్వదేశానికి చేరి భారతావనికి స్వాతంత్య్రం వచ్చే వరకు పోరాడారు. సాధారణ కుటుంబంలో జన్మించినా... ఆయన జీవితం మొత్తం పోరాటాలు, ఉద్యమాలు, సంస్కరణల బాటలోనే సాగింది. అందుకే కేవలం మనకే కాదు ప్రపంచంలోని చాలా దేశాల వారికి గాంధీజీ స్పూర్తిదాయకం. 

1. మహాత్మ గాంధీ  నాలుగు ఖండాల్లోని 12 దేశాల్లో రాజుకున్న పౌర హక్కుల ఉద్యమాలకు స్పూర్తిగా నిలిచారు. అందులో ఒక దేశం అమెరికా. మార్టిన్ లూథర్ కింగ్ కు గురుతుల్యుడైన హువార్డ్ థుర్మాన్ 1936లో భారత్ వచ్చి గాంధీజీని కలిశారు. గాంధీ పాటిస్తున్న అహింస అనే ఆయుధం ఉద్యమంలో ఎంతో శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నట్టు అర్థంచేసుకున్నారాయన. అమెరికాలో పౌర హక్కుల ఉద్యమనేతల్లో ఈయన కూడా ఒకరు. గాంధీజీ స్పూర్తితో ఆ దేశంలో అహింసా పద్దతిలో ఉద్యమం నడిపేందుకు చాలా ప్రయత్నించారాయన.

2. స్వదేశానికి స్వేఛ్చను ఇవ్వమంటూ గాంధీజీ అహింసా పద్ధతిలో పోరాడింది బ్రిటన్ ప్రభుత్వంతోనే. అతని ఉద్యమాలను అణగదొక్కడానికి ప్రయత్నించి బ్రిటన్ ఓడిపోయింది. చివరకు గాంధీజీ మరణించిన 21 ఏళ్ల తరువాత తమ దేశంలో ఆయన గౌరవార్థం ఓ స్టాంపును విడుదల చేసింది. బ్రిటన్ లో గాంధీజీకి వీరాభిమానులున్నారు. 

3. 1948, జనవరి 30 గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపారు. మహాత్ముడి మరణాన్ని జవహరల్ లాల్ నెహ్రూ రేడియోలో జాతినుద్దేశించి ప్రకటించారు. గాంధీ అంతిమయాత్రంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. వారంతా 8 కిలోమీటర్ల పొడవునా పరుచుకున్నారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు.

4. మహాత్మ గాంధీ తాను ఉద్యమంలో ఉన్నప్పుడే ప్రపంచంలోని ప్రముఖులతో ఉత్తరాల ద్వారా పరిచయం పెంచుకున్నారు. టాల్ స్టాయ్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్, హిట్లర్, చార్లీ చాప్లిన్ వంటి వారందరికీ తరచూ ఉత్తరాలు రాసేవారు. వారందరికీ గాంధీ అంటే అమితమైన గౌరవం.

5. మనదేశంలో ఎన్నో వీధులకు, ఊళ్లకు,  చిన్న రోడ్లకు  గాంధీ పేరు ఉంది. అవన్నీ కాకుండా దాదాపు 53 ప్రధాన రహదారులకు ఆయన పేరును పెట్టారు. ఇతర దేశాల్లో కూడా 48 రహదారులకు ఆయా దేశాల ప్రభుత్వాలు గాంధీ పేరును పెట్టాయి. 

Also read: ఆపిల్ కన్నా గుడ్డులోనే అవెక్కువట.. అందుకే తినమంటున్నారు

Also read: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి... హార్వర్డ్ ఆరోగ్య నిపుణుల సలహా

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Embed widget