Pawan Kalyan: జూబ్లీహిల్స్ లో బంగ్లా కొన్న పవర్ స్టార్, ఖరీదు ఎంతంటే..
ఏపీ ప్రభుత్వంతో వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన గురించి మరో వార్త వెలుగులోకి వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఓ బంగ్లా కొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దాని ఖరీదు దాదపు 12 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఆయన స్టాంపు డ్యూటీ రూ.66లక్షల రూపాయలు చెల్లించినట్టు సమాచారం. ఆ బంగ్లా జూబ్లీహిల్స్ లో ఎక్కడుందో తెలియలేదు కానీ, దాదాపు 6,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్టు తెలిసింది. ఈ బంగ్లాను పవన్ తన పేరు మీదే సెప్టెంబర్ 23న రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ‘జాప్ కీ’(Zapkey.com) అనే వెబ్ సైట్ ద్వారా తెలిసింది. ఈ జాప్ కీ అనేది రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించి అయిన రిజిస్ట్రేషన్లను పబ్లిక్ కు చూపించే ఓ అగ్రిగేటర్. దీనిలో సమాచారం ప్రకారం పవన్ ఒక బంగ్లా కొన్ని విషయం తెలిపింది. ప్రస్తుతం పవన్ జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న ఇంటికి దగ్గర్లోనే దీన్ని కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆఫీసు కోసమే ఈ బంగ్లాను వినియోగించబోతున్నారట.
జాప్ కీ ప్రకారం... గత అయిదేళ్లలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో రూ.10 కోట్లకు పైగా జరిగిన అమ్మకాలు, కొనుగోళ్ల సంఖ్య 120 దాకా నమోదైంది. 2020లో ఈ ప్రాంతంలో రూ.10 కోట్ల ఖరీదుకు మించి 17 విక్రయ లావాదేవీలు అయినట్టు ఈ వెబ్ సైట్ చెబుతోంది. ఇందులో తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఇటీవల సువెన్ ఫార్మా స్యుటికల్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు జాస్తి ఒక ఇంటిని 34కోట్ల రూపాయలకు అమ్మారు. అలాగే జివికే సంస్థ అధినేత కూడా ఆరువేల చదరపు గజాల ఇంటిని 23 కోట్లకు కొనుగోలు చేశారు. హైదరాబాద్ నగరంలో చాలా ఖరీదైన ప్రాంతాలలో జూబ్లీహిల్స్ కూడా ఒకటి. అందుకే అక్కడ చదరపు గజం లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా ఉంటుందని అంచనా. ఈ ఏరియాలో అపార్ట్ మెంట్ల కన్నా కూడా ఇండిపెండెంట్ విల్లాలు కొనేందుకు ప్రముఖులు ఆసక్తి చూపుతారు.
Also read: ఆపిల్ కన్నా గుడ్డులోనే అవెక్కువట.. అందుకే తినమంటున్నారు
Also read: ఈ మహాత్ముడు మనకే కాదు ఎన్నో దేశాల ప్రజలకు స్పూర్తి
Also read: రాత్రి పడుకోబోయే ముందు ఈ టీ తాగితే... ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు
Also read: మెరిసిపోతున్న తెలుగందం... దూసుకెళ్తున్న టక్ జగదీష్ భామ
Also read: అందాల ‘మేఘం’ మెరిస్తే... నవ్వుల నవరత్నాలు రాలాల్సిందే