X

Chandini Chowdary: చాందిని... మందు, సిగరెట్ ఆరోగ్యానికి హానికరం

‘సమ్మతమే’‌లో హీరోయిన్ చాందినీ చౌదరి క్యారెక్టర్ కోసం మందు కొట్టారు. సిగరెట్ కాల్చారు. ఆడియన్స్‌‌ ఆ సంగతి గమనించడంతో పాటు ఆమెకు మధ్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని జాగ్రత్తలు చెబుతున్నారు.

FOLLOW US: 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికలుగా ఉన్న తెలుగమ్మాయిలు చాలా తక్కువ. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వారిలో చాందినీ చౌదరి ఒకరు. ఇప్పటికే చాలా చిత్రాల్లో నటించారు. గత ఏడాది ‘కలర్ ఫొటో’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడామె చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అందులో ‘సమ్మతమే’ ఒకటి. ఈ సినిమా టీజర్‌‌ను గురువారం విడుదల చేశారు. అందులో చాందినీ చౌదరి సిగరెట్ తాగుతూ కనిపించారు. మందు కొడుతూ కనిపించారు.

Also Read: అక్కినేని ఫ్యామిలీ ఫ్రెండ్‌తో... సమంత ఆధ్యాత్మిక యాత్ర

సిల్వర్ స్క్రీన్స్ మీద సిగరెట్ తాగుతూ, మందు కొడుతూ కనిపించిన వాళ్లందరూ రియల్ లైఫ్‌లో అదే విధంగా చేస్తారని కాదు. మోడ్రన్ అమ్మాయిలు చాలామంది మందు, దమ్ము కొడుతున్నారు. క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు లేదా అటువంటి క్యారెక్టర్లు వచ్చినప్పుడు కొంతమంది హీరోయిన్లు మందు, సిగరెట్ పట్టుకుంటున్నారు. ‘సమ్మతమే’ కోసం చాందినీ చౌదరి కూడా అదే పని చేశారు. అయితే, ఆడియన్స్ ఆ సంగతి గమనించారు. ‘చాందిని... మధ్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని సరదాగా జాగ్రత్తలు చెప్పారు. వాటిని చూసి ఆమె కూడా సరదాగా స్పందించారు.

‘సమ్మతమే’ టీజర్‌‌లో హీరో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగుల్లా కనిపించారు. ఇద్దరి మధ్య సన్నివేశాలు బావున్నాయి. పాటను పాటగా కాకుండా మాటగా మాట్లాడాలని గేమ్ పెట్టుకోవడం, సందర్భాలకు అనుగుణంగా చక్కటి పాటలను ఎంచుకోవడం బావుంది. అలాగే, శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతమూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘జగమంత సగమైనా... క్షణమే ఓ యుగమైనా... ఈ వలపు మలుపుల్లో సతమతము సమ్మతమే’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌‌లో కొన్ని లైన్లను టీజర్‌‌లో వినిపించారు. టీజర్‌‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘కలర్ ఫొటో’తో చాందినీ చౌదరి... ‘ఎస్‌‌ఆర్ కళ్యాణ మండపం’తో కిరణ్ అబ్బవరం... ఇద్దరూ సక్సెస్‌‌లలో ఉన్నారు. ఈ సినిమాతోనూ సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం.Also Read: 'భీమ్లా నాయక్' కొత్త స్టిల్.. పవన్, రానా పోజు చూశారా..?

Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?

Also Read: బిగ్ బాస్ హౌస్ లోకి లోబో రీ-ఎంట్రీ ..యదవనయ్యా అన్న షణ్ముక్-కన్నీళ్లు పెట్టుకున్న సిరి…!

Also Read: అనారోగ్యం వల్ల కొద్దిసేపే చూస్తానన్న ఉప రాష్ట్రపతి ..సినిమా మొత్తం అయ్యేవరకూ కదల్లేదట

Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?

Also Read: తమన్నా ఔట్-అనసూయ ఇన్..హాట్ యాంకర్ అంతకుమించి అనిపిస్తుందా..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Kiran Abbavaram Chandini Chowdary sammathame teaser sammathame movie

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: సన్నీ కాదు.. సిరి కాదు.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే..?

Bigg Boss 5 Telugu: సన్నీ కాదు.. సిరి కాదు.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే..?

Akhanda: 'బాలయ్య బాలయ్య.. ఇరగతీసావయ్యా..' బాబాయ్ పై ప్రేమ కురిపించిన కళ్యాణ్ రామ్.. 

Akhanda: 'బాలయ్య బాలయ్య.. ఇరగతీసావయ్యా..' బాబాయ్ పై ప్రేమ కురిపించిన కళ్యాణ్ రామ్.. 

Bigg Boss 5 Telugu: టాప్ 5 లో ఆ ముగ్గురూ కన్ఫర్మ్.. సిరి గెలిస్తే ఈక్వేషన్ మారుతుందా..?

Bigg Boss 5 Telugu: టాప్ 5 లో ఆ ముగ్గురూ కన్ఫర్మ్.. సిరి గెలిస్తే ఈక్వేషన్ మారుతుందా..?

Kangana Ranaut Update: 'నా వాహనంపై రైతులు దాడి చేశారు.. చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు'

Kangana Ranaut Update: 'నా వాహనంపై రైతులు దాడి చేశారు.. చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు'

Balakrishna & Mahesh : బాలకృష్ణ... మహేష్... షూటింగ్‌కు రెడీ! ఎప్పుడు? ఎక్కడ? అంటే...

Balakrishna & Mahesh : బాలకృష్ణ... మహేష్... షూటింగ్‌కు రెడీ! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Cyclone Report: జవాద్ తుపాను పూరీ వద్ద తీరం దాటే అవకాశం.. ఉత్తరాంధ్రకు వర్షాల ముప్పు

Cyclone Report: జవాద్ తుపాను పూరీ వద్ద తీరం దాటే అవకాశం.. ఉత్తరాంధ్రకు వర్షాల ముప్పు

Solar Eclipse: నేడే సంపూర్ణ సూర్య గ్రహణం... మనకి కనిపించదు, అయినా సరే గ్రహణ సమయంలో ఈ పనులు చేయకూడదంటారు

Solar Eclipse: నేడే సంపూర్ణ సూర్య గ్రహణం... మనకి కనిపించదు, అయినా సరే గ్రహణ సమయంలో ఈ పనులు చేయకూడదంటారు

Konijeti Rosaiah Death: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

Konijeti Rosaiah Death: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

KGBV Teachers: కేజీబీవీల్లో పోస్టుల భర్తీ మార్గదర్శకాలు జారీ... అర్హులు ఎవరంటే ?

KGBV Teachers: కేజీబీవీల్లో పోస్టుల భర్తీ మార్గదర్శకాలు జారీ... అర్హులు ఎవరంటే ?