Samantha: అక్కినేని ఫ్యామిలీ ఫ్రెండ్‌తో... సమంత ఆధ్యాత్మిక యాత్ర
ప్రస్తుతం సమంత రిషికేశ్‌లో ఉన్నారు. ఆధ్యాత్మిక యాత్రలో ఆమెకు తోడుగా అక్కినేని ఫ్యామిలీ ఫ్రెండ్ శిల్పారెడ్డి కూడా ఉన్నారు.
అక్కినేని నాగచైతన్యతో సమంత వేరుపడ్డారు. కానీ, అక్కినేని ఫ్యామిలీ స్నేహితులతో కాదు, తెలుగు సినిమా పరిశ్రమ వ్యక్తులతో కాదు. విడాకుల తీసుకున్నాననే విషయం వెల్లడించిన తర్వాత ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమానికి వెళ్లారు. విజయ దశమికి రెండు కొత్త సినిమాలు ప్రకటించారు. ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు. అదీ అక్కినేని ఫ్యామిలీ ఫ్రెండ్ తో!
Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?
ప్రస్తుతం సమంత రిషికేశ్‌లో ఉన్నారు. గంగానదీ తీరంలో పూజలు చేస్తున్నారు. నేచర్‌కి దగ్గరగా, ఓ లగ్జరీ రిసార్ట్‌లో సేద తీరుతున్నారు. సమంతతో పాటు శిల్పారెడ్డి కూడా ఉన్నారు. ఆమె స్టయిలిస్ట్. ‘బిగ్ బాస్’ ఫేమ్ సామ్రాట్‌కి అక్క. ఆమెకు, అక్కినేని ఫ్యామిలీకి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. చాలా క్లోజ్ అని చెప్పలి. గతంలో నాగార్జున ఫ్యామిలీ అంతా కలిసి స్పెయిన్‌కి వెకేషన్‌కి వెళ్లినప్పడు కూడా శిల్పారెడ్డి వారితో ఉన్నారు. ఇప్పుడు సమంతతో కలిసి రిషికేశ్ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు.
అక్కినేని కుటుంబం నుంచి వేరు పడిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ సమంతకు రెడ్ కార్పెట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం కష్టమనే అభిప్రాయాలు వినిపించాయి. మునుపటిలా ఆమెకు అవకాశాలు రావనీ, ఇండస్ట్రీ ప్రముఖులు ఇంపార్టెన్స్ ఇవ్వరని కొందరు కామెంట్లు చేశారు. అయితే... అటువంటిది ఏమీ లేదని సమంతకు వస్తున్న సినిమాలను కానీ, సమంత వెంట ఉంటున్న, సమంతను ఆహ్వానిస్తున్న ప్రముఖులను కూడా చూస్తుంటే అర్థమవుతోంది. సమంత కూడా విడాకుల విషయం మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న సినిమాల విషయానికి వస్తే... గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శాకుంతలం’ చిత్రీకరణ పూర్తి చేశారు. శివలెంక క్రిష్ణప్రసాద్ నిర్మాణంలో ఒకటి, తమిళ నిర్మాతలు ఎస్‌ఆర్ ప్రభు, ఎస్ఆర్ శేఖర్ నిర్మాణంలో మరొక సినిమా అంగీకరించారు. ఈ రెండూ తెలుగు, తమిళ భాషల్లో రూపొందే సినిమాలు. నెక్ట్స్ కూడా తెలుగు, తమిళ్ బైలింగ్వల్ సినిమాలు చేసే ఆలోచనలో సమంత ఉన్నారట.
Also Read: బిగ్ బాస్ హౌస్ లోకి లోబో రీ-ఎంట్రీ ..యదవనయ్యా అన్న షణ్ముక్-కన్నీళ్లు పెట్టుకున్న సిరి…!
Also Read: అనారోగ్యం వల్ల కొద్దిసేపే చూస్తానన్న ఉప రాష్ట్రపతి ..సినిమా మొత్తం అయ్యేవరకూ కదల్లేదట
Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?
Also Read: తమన్నా ఔట్-అనసూయ ఇన్..హాట్ యాంకర్ అంతకుమించి అనిపిస్తుందా..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి