'Natyam' Movie: అనారోగ్యం వల్ల కొద్దిసేపే చూస్తానన్న ఉప రాష్ట్రపతి ..సినిమా మొత్తం అయ్యేవరకూ కదల్లేదట
ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న 'నాట్యం' సినిమాకి ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. స్టార్ హీరోలంతా ప్రమోట్ చేసిన ఈ మూవీ తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు అందుకుంది.

రొటీన్ కి భిన్నంగా తెరకెక్కిన నాట్యం సినిమాపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. ఎవ్వరికీ పెద్దగా తెలియదు కూడా. కానీ ఎప్పుడైతే స్టార్ హీరోలంతా ప్రమోషన్ మొదలెట్టారో ఈ సినిమా ఆసక్తి అంచనాలు రెండూ పెరిగాయి. నాట్యం ను కె.విశ్వనాథ్ సినిమాతో పోల్చారు మెగాస్టార్. ఈ సినిమా టీజర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్, ట్రైలర్‌ను రామ్‌చరణ్, ఓ సాంగ్ ను బాలకృష్ణ, ఓ సాంగ్ ను వెంకటేశ్ విడుదల చేశారు. రవితేజ సహా ఇంకా పలువురు సెలబ్రెటీలు ప్రమోట్ చేయడంతో ఈ మూవీపై అందరికీ ఆసక్తి పెరిగింది. తాజాగా... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు అందుకుంది నాట్యం.
Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?
నాట్యంపై తనకున్న మక్కువతో పాటు.. విభిన్న కథాంశంతో మూవీని చేయాలన్న ఉద్దేశంతో సంధ్యారాజు నటించి- నిర్మించిన ఈ మూవీపై బజ్ పెరిగింది. అందర్నీ ఆకర్షించిన ఈ సినిమాను చూడమని ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని కోరారు. ఆయనకున్న అనారోగ్య సమస్య కారణంగా ఐదు నిమిషాలకు మించి కూర్చుని చూడలేనని చెప్పారట. కానీ సినిమా మొదలైన తర్వాత అలానే చూస్తుండిపోయారట. సినిమా అయ్యాక తనని సత్కరించారని సంతోషంగా చెప్పారు సంధ్యారాజు. “Inspirational Women Of Telangana Culture” అనే బుక్ ప్రజెంట్ చేశారని చెప్పారు. తనది సినిమా బ్యాగ్రౌండ్ కాకపోయినా ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారామె. 'నాట్యం' సినిమాలో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయని.. గురు శిష్యుల సంబంధాన్ని చూపిస్తామని.. క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దుల్ని చూపిస్తామన్నారు.
Also Read: ఆకట్టుకుంటున్న ‘సమ్మతమే’ ఫస్ట్ గ్లింప్స్
ఇంతకీ సంధ్యారాజు బ్యాగ్రౌండ్ ఏంటంటే రాంకో సిమెంట్ ఇండస్ట్రీస్ యజమాని అయిన పి.ఆర్.వెంకట రామ రాజు పెద్ద కుమార్తె . కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చిన సత్యం గారి శిష్యురాలు. సత్యం రామలింగ రాజు చిన్న కోడలు. పేరున్న కుటుంబం నుంచి వచ్చినా గొప్ప కుటుంబంలో అడుగుపెట్టినా సంధ్యా రాజు కూచిపూడి డాన్సర్‌గానే చాలా మందికి తెలుసు. తన నృత్యం ద్వారానే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కుటుంబంలో అందరు పారిశ్రామిక వేత్తలే అయినప్పటికీ..నాట్యాన్ని నమ్ముకుని కళాకారిణిగా ఆమె ఇంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె భర్త రామరాజు సైతం ఆమెను ప్రోత్సహిస్తూ, ఆమెను చూసి గర్వ పడుతుండడం విశేషం. తాను నటిని అవుతానంటే ఇంట్లో ఎవరూ అడ్డుచెప్పలేదని..ప్రోత్సహించారని చెప్పారు సంధ్యారాజు. సత్యం రామలింగరాజు రెండో కుమారుడు రామరాజును 2007లో పెళ్లిచేసుకున్నారు సంధ్య.
Also Read: తమన్నా ఔట్-అనసూయ ఇన్..హాట్ యాంకర్ అంతకుమించి అనిపిస్తుందా..!
Also Read: 'ఫుల్లీ అండ్ మళ్లీ లోడెడ్', సాయి ధరమ్ తేజ్ పై హరీశ్ శంకర్ ట్వీట్ వైరల్
Also Read: రెచ్చిపోయిన ప్రియ..ఇచ్చి పడేసిన సన్నీ… హౌస్ లోకి లోబో రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
Also Read: సూపర్ స్టార్ మహేశ్ బాబు బిజినెస్ పెంచిన సాయిపల్లవి...
Also Read: వైవా హర్ష పెళ్లిలో సెలబ్రెటీల సందడి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

