By: ABP Desam | Updated at : 21 Oct 2021 08:58 AM (IST)
Edited By: RamaLakshmibai
Sai Dharam Tej
గతనెల్లో రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ దాదాపు నెల రోజుల ట్రీట్మెంట్ తర్వాత క్షేమంగా ఇల్లు చేరుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే ఫొటోలు తప్ప ఇప్పటి వరకూ తేజ్ కి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. బాగున్నాను అంటూ అప్డేట్ ఇస్తూ థమ్సప్ సింబల్ చూపించడంతో మెగా అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. ఆ తర్వాత దసరా రోజు ఆసుపత్రి నుంచి డిశ్శార్జ్ అయి ఇంటికి చేరుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. తేజు ఆరోగ్యం కోసం ఎంతో మంది చేసిన ప్రార్థనలు ఫలించాయన్నారు పవన్ కళ్యాణ్. తేజ్ కోలుకుని ఇంటికి చేరుకోవడం సంతోషం అనిపించినా ఇప్పటి వరకూ ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదనే బాధ మాత్రం ఉంది. ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న తేజ్ ఆరోగ్య పరిస్థితిపై దర్శకుడు హరీశ్ శంకర్ అప్ డేట్ ఇచ్చారు.
Met my brother @IamSaiDharamTej and had a wonderful talk … Happy to say that he is super fit and getting ready to conquer ..
— Harish Shankar .S (@harish2you) October 20, 2021
ఫుల్లీ & మళ్ళీ లోడెడ్ 👍👍👍 pic.twitter.com/rhpBvZ0PHb
తేజ్ ను కలిసినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపిన హరీశ్ శంకర్ ‘నా సోదరుడు సాయిధరమ్ తేజ్‌ను కలిశాను. చాలా సేపు అతనితో మాట్లాడటం జరిగింది. అతను సూపర్ ఫిట్‌గా ఉన్నాడు, మళ్లీ తన నటనతో మెరిపించేందుకు రెడీ అవుతున్నాడని చెప్పడానికి సంతోషిస్తున్నా. ‘ఫుల్లీ అండ్ మళ్ళీ లోడెడ్’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ చేసిన ఫొటోలో కూడా తేజు మొహాన్ని మాత్రం చూపించలేదు. చేతిలో చేయి వేసి మాట్లాడుకున్నట్టు, భరోసా ఇచ్చినట్టు పరోక్షంగా చెప్పాడు. దర్శకుడు హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం హరీశ్ శంకర్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న హరీశ్ శంకర్ సాయి ధరమ్ తేజ్ ని కలిశారు.
Wowww thats a great news sirr jiiii @harish2you 🙏🏻🎶❤️
— DEVI SRI PRASAD (@ThisIsDSP) October 20, 2021
Pls give our love to our dear brother @IamSaiDharamTej ❤️🎶❤️🤗
Wishing him all POWER & LOVE ! https://t.co/Qa7OgJqAW6
గ్రేట్ సర్ అని రీ ట్వీట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్
Also Read: రెచ్చిపోయిన ప్రియ..ఇచ్చి పడేసిన సన్నీ… హౌస్ లోకి లోబో రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్... ఈ మధ్యే 'రిపబ్లిక్ 'మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా విడుదల సమయానికి సాయి ధరమ్ తేజ్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఉండడంతో ప్రచార బాధ్యతలను చిరంజీవి, పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. రిపబ్లిక్ సినిమా టీజర్‌ను చిరంజీవి విడుదల చేయగా.. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక ఈ చిత్రం విడుదలైన తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. సినిమా చివర‌్లో హీరో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
Also Read: చిన్నారి ప్రాణం కాపాడిన సోనుసూద్.. నిజంగా దేవుడే!
Also Read: నాగబాబు గొప్ప నటుడేమీ కాదు.. చిరు, పవన్ లేకపోతే..: కోట శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు
Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?
Also Read: కోర్టుకెక్కిన సమంత.. ఇక వాళ్లకు చుక్కలే!
Also Read: అవినాష్ పెళ్లి.. తప్పు జరిగిపోయిందంటూ రామ్ ప్రసాద్ కామెంట్స్, ఆ వీడియో లీక్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>