X

Samantha: కోర్టుకెక్కిన సమంత.. ఇక వాళ్లకు చుక్కలే!

గత కొద్ది రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలపై మౌనంగా ఉన్న సమంత.. ఎట్టకేలకు కోర్టుకెక్కింది. తనపై దుష్ప్రచారం చేసినవారికి చుక్కలు చూపించే పనిలో పడింది.

FOLLOW US: 

మొన్నటి వరకు సమంత-అక్కినేని నాగ చైతన్యల విడాకుల గురించి మీడియా, సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. వారి విడాకులకు కారణం ఇదేనంటూ.. ఎవరికి తోచిన విధంగా వారు కట్టు కథలు చెప్పుకుంటూ ప్రజలను నమ్మించారు. విడాకుల తీసుకున్న బాధలో ఉన్న సమంతను ఆ వార్తలు ఎంతగానో నొప్పించాయి. తనపై తప్పుడు కథనాలు ఆపాలంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించినా కొన్ని టీవీ, యూట్యూబ్ చానళ్లు సమంతపై ప్రతికూల వార్తలు ప్రసారం చేస్తూనే ఉన్నాయి. దీంతో సమంత కీలక నిర్ణయం తీసుకుంది. 

తన పరువుకు భంగం కలిగించేలా కథనాలను ప్రసారం చేశారంటూ సమంత మూడు యూట్యూబ్ చానళ్లు, ఒక అడ్వకేట్ మీద కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా పిటీషన్ దాఖలు చేసింది. తనను కించపరిచే విధంగా కథనాలు, అభ్యంతరకర వీడియోలును ఆయా చానళ్లలో ప్రసారం చేశారని, వాటి వల్ల తన గౌరవానికి భంగం వాటిల్లిందని ఆమె పిటిషన్‌లో తెలిపింది. ఈ కేసును కోర్టు బుధవారమే విచారించనున్నట్లు తెలిసింది. ఆమె తరపున హైకోర్టు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. 

Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా ఎవరి కూతురో తెలుసా? మూవీకి ఈ రేంజ్ ప్రమోషన్ అందుకేనా?

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న రోజు నుంచి పలు ప్రముఖ టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్లు ఆమెపై ఎన్నో తప్పుడు కథనాలను ప్రసారం చేశాయి. ఆమె విడాకులకు కారణాలు ఇవేనంటూ దారుణమైన అంశాలను ప్రస్తావించారు. ఆమె వస్త్రధారణ నచ్చకపోవడం, వేరేవరితోనో అఫైర్ ఉండటం వంటి రకరకాల కారణాలు చెబుతూ సమంతను కించపరిచారు. బాధ్యతగా ఉండాల్సిన పలు టీవీ చానళ్లు కూడా ఈ అంశానికి అధిక ప్రాధాన్యమిస్తూ రచ్చ చేశాయి. అయితే, సమంత ఆ చానళ్లపై కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కథనాలను సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో సమంత టీమ్ ఉన్నట్లు సమాచారం. మరి సమంత దాఖలు చేసిన కేసుపై కోర్టు ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.  

Also Read: సన్నీ-ప్రియ మధ్య మరింత అగ్గి రాజేసిన 'బంగారు కోడిపెట్ట'

Also Read: బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న శ్రీలంక సన్సేషనల్ సింగర్ యొహానీAlso Read: అక్కినేని బ్రదర్స్ పై అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...Also Read:  బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ తేదీ ఖరారు.. మరో వీడియో వదిలిన ‘ఆహా’ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: samantha సమంత Samantha Court Samantha Defamation Suit Kukatpally court Samantha sue on youtube channels

సంబంధిత కథనాలు

Ashu Reddy Pregnent: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్

Ashu Reddy Pregnent: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్

Vicky-Katrina Wedding: సెలబ్రిటీల పెళ్లిళ్లకు వీళ్లే బ్రాండ్ అంబాసిడర్లు.. 

Vicky-Katrina Wedding: సెలబ్రిటీల పెళ్లిళ్లకు వీళ్లే బ్రాండ్ అంబాసిడర్లు.. 

Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ.. 

Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ.. 

Bigg Boss 5 Telugu: సన్నీ, కాజల్ లకు మానస్ వార్నింగ్.. ఏడ్చేసిన కాజల్..

Bigg Boss 5 Telugu: సన్నీ, కాజల్ లకు మానస్ వార్నింగ్.. ఏడ్చేసిన కాజల్..

Vijay Setupathi: ఎయిర్ పోర్ట్ దాడి ఘటన.. విజయ్ ని విడిచిపెట్టేలా లేదు.. 

Vijay Setupathi: ఎయిర్ పోర్ట్ దాడి ఘటన.. విజయ్ ని విడిచిపెట్టేలా లేదు.. 
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Tesla Car in Space: అంతరిక్షంలో వదిలిన ఎలన్ మస్క్ టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? భూమి వైపు దూసుకొస్తుందా?

Tesla Car in Space: అంతరిక్షంలో వదిలిన ఎలన్ మస్క్ టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? భూమి వైపు దూసుకొస్తుందా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Suicide Machine: ‘ఆత్మహత్య’కు అనుమతి.. నొప్పిలేకుండా చంపే యంత్రానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Suicide Machine: ‘ఆత్మహత్య’కు అనుమతి.. నొప్పిలేకుండా చంపే యంత్రానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!