By: ABP Desam | Updated at : 20 Oct 2021 08:17 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit/ Star Maa /Hotstar: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్
నామినేషన్లపై చర్చతో 43 వ రోజు మంగళవారం షో ఆరంభమైంది. మానస్ -సన్నీ-కాజల్ ఓ గ్రూప్ గా ...రవి-ప్రియ-జస్వంత్ మరో గ్రూప్ గా డిస్కస్ చేసుకున్నారు. నీ కొచ్చిన పవర్ తో ఫ్రెండ్స్ ని కాపాడుకోవాలని అనుకోవచ్చు కానీ డైరెక్ట్ గా నామినేట్ చేశావని మానస్ సన్నీని ప్రశ్నించాడు. రవి-ప్రియ ఫైట్ చేసుకోవాల్సిన సమయంలో మధ్యలో నువ్వెందుకు బ్యాడ్ కావడం అన్నాడు. వాళ్లాడితే గేమ్..తానాడితే క్రైమా అని సన్నీ బాధపడ్డాడు. ఆ తర్వాత రవితో మాట్లాడిన సన్నీ ప్రియ అంత సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేసినప్పుడు నువ్వెందుకు ఆర్గ్యూ చేయలేదని ప్రశ్నించాడు.
మానస్ కి తాన మనసు అర్థంకాలేదని ప్రియాంక సింగ్ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకన్నా పెద్ద పెద్ద మాటలన్న వాళ్లతో బాగానే ఉంటున్న మానస్ తనని మాత్రం అవాయిడ్ చేస్తున్నాడని ఏడ్చింది. సన్నీని ఇరికించేందుకే ప్రియ ఇదంతా చేసిందని మానస్ చెప్పాడు. అన్నం కలపి తినిపించడంతో ప్రియాంక సింగ్ కూల్ అయింది. నువ్వు సరిగా మాట్లాడితే రోజంతా బావుంటానని చెప్పిన ప్రియాంక.. నా ఫోకస్ ఎప్పుడూ నీపై ఉంటుందని చెప్పింది. మరోవైపు సన్నీ తప్పు చేసి ఒప్పుకోవడం లేదని రవి కామెంట్ చేయడంతో కాజల్ రివర్సైంది. సన్నీ తప్పు చేశాక కూడా ఎందుకు సపోర్ట్ చేశావని ప్రియ మానస్ తో చెప్పింది. 48 వ రోజ బంగారు కోడిపెట్ట సాంగ్ తో ప్రారంభమైంది.
కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ''బంగారు కోడిపెట్ట''
టాస్క్ లో భాగంగా ఏ ఇంటి సభ్యులు ఎక్కువ కోడిగుడ్లు సొంతం చేసుకుంటారో వారికి కెప్టెన్సీ టాస్క్ లో పోటీచేసే అవకాశం లభిస్తుంది. ఎవరి ఎగ్స్ ని వాళ్లు జాగ్రత్త చేసుకోవాలన్నారు బిగ్ బాస్. మొదటి కోడి కూత రాగానే ఎగ్స్ కోసం ఇంటి సభ్యులు పోటీపడ్డారు. తాను అందరి గుడ్లు జోలికి వస్తానని ప్రియ...పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేసి నవ్వించింది. ఈ లోగా బయటి నుంచి ఎగ్స్ ఎగిరిపడడంతో ఇంటి సభ్యులంతా వాటికోసం పోటీపడ్డారు. వ్యక్తిగత టాస్క్ అని చెప్పినప్పటికీ ఇద్దరిద్దరు చొప్పున గ్రూప్స్ గా విడిపోయారు. సన్నీ-ప్రియ మధ్య కాసేపు వాదన జరిగింది.
మొదటి రౌండ్ ముగిసేసరికి ఎవరి దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయంటే
మానస్ -32, శ్రీరామ్-14, ప్రియ-0, ప్రియాంక-0, జస్వంత్-18, కాజల్- 1
షణ్ముక్-12, సన్నీ- 23, ఆనీ మాస్టర్-13, సిరి-10, రవి-12, విశ్వ -18
సిరి స్టిక్కర్ల కోసం తన బెడ్ చెక్ చేసిందని షణ్ముక్-జెస్సీ అనడంతో సిరి ఫీలైంది. ప్రియ-ప్రియాంక ఇద్దరూ కాజల్ తీరు బాగాలేదని మాట్లాడుకున్నారు. నిన్ను ఎవరైనా అంటే నేను బాధపడతా అని మానస్ చెప్పడంతో ఇద్దరూ ఏమోషన్ అయ్యారు. బుధవారం ప్లే కానున్న ఎపిసోడ్ లో ప్రియ-సన్నీ మధ్య పెద్ద రచ్చే జరిగినట్టు కమింగప్ చూస్తే అర్థమవుతోంది. మరి కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో విజేతలెవరో వెయిట్ అండ్ సీ...
Also Read: ‘రొమాంటిక్’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్.. ప్రేమను మోహం అనుకుంటున్నారట!
Also Read: బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న శ్రీలంక సన్సేషనల్ సింగర్ యొహానీ
Also Read: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 'రాథేశ్యామ్' టీజర్?
Also Read: 'మా'లో అంతా జోకర్లే.. ఆర్జీవీ ట్వీట్‌కు మంచు మనోజ్ స్ట్రాంగ్ రిప్లై
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం
Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?
Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి
Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: బౌలింగ్ అద్భుతం - 99 పరుగులకే పరిమితమైన కివీస్!
SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం