Ram Gopal Varma: 'మా'లో అంతా జోకర్లే.. ఆర్జీవీ ట్వీట్‌కు మంచు మనోజ్ స్ట్రాంగ్ రిప్లై
అంతా కలసే ఉన్నామని కొందరు..అంతసీన్ లేదని ఇంకొందరు..ఏదేమైనా 'మా' ఎన్నికల వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఓ వైపు మంటలు ఎగసిపడుతుంటే మధ్యలో ఆర్జీవీ ఎంట్ర ఇచ్చారు...
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ ఫలితాలు వచ్చేవరకూ...కాదు కాదు..ఫలితాలు వచ్చిన తర్వా త కూడా హైడ్రామా కొనసాగతూనే ఉంది. విష్ణు వర్గం - ప్రకాశ్ రాజ్ వర్గం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో హీట్ పెంచారు. ఎనికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికవడం ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగిపోయింది. కానీ వివాదం మాత్రం చల్లారలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులంతా రాజీనామాలు చేసి మొత్తం మీరే ఏలండని చెబుతూనే ప్రశ్నిస్తామంటూ హెచ్చరించారు. అటు మంచు విష్ణు మాత్రం ఇప్పటికీ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు తమకు అందలేదన్నారు. ఇదంతా ఒకెత్తైతే...ఆర్జీవి ఎంట్రీ ఇచ్చారు. వివాదాలపై సెకెన్లలో రియాక్టయ్యే ఆర్జీవీ 'మా ' హడావుడిపై లేటెస్ట్ గా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Cine”MAA” is a CIRCUS full of JOKERS
— Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2021
మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సర్కస్ అని… అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ఈ ఫీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Cine”MAA”people proved to the audience, that they are actually a CIRCUS 😳😳😳😳
— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2021
ప్రేక్షకుల ముందు నటులు తాము నిజమైన సర్కస్ వాళ్లమని నిరూపించుకున్నారని మూడు రోజుల క్రితం వర్మ చేసిన ట్వీట్ పై నెటిజన్లు అవునంటూ కౌంటర్లు ఇస్తున్నారు.అంతర్గతంగా ఉండే విభేదాలు 'మా' ఎన్నికల కారణంగా బయటపడ్డాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ రచ్చంతా చూసిన కొందరు సీనియర్ నటులు మాత్రం ఎన్నికలు లేకుండా పెద్దల నిర్ణయంతో ఏకగ్రీవం చేయడం ద్వారా, ఇలాంటి అనారోగ్యకర పరిస్థితులు ఏర్పడకుండా చూడొచ్చని అభిప్రాయపడుతున్నారు.
And you are the Ring Master sir 🙌🏽 https://t.co/gW8VaFhwdb
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 19, 2021
ఆర్జీవీ ట్వీట్స్ కి సింగిల్ వ్ర్డ్ తో కౌంటర్ ఇచ్చాడు మంచు మనోజ్.
Also Read: 'సిరి ఆట-సన్నీ వేట' విలవిల్లాడిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..ఈ వారం నామినేషన్లో ఉన్నదెవరంటే…
ఇకపోతే ఎన్నికల రోజు సీసీ ఫుటేజ్ ని తమకు ఇవ్వాలని ప్రకాష్ రాజ్ వర్గం కోరగా.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ అందుకు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది కోర్టుల పరిధిలో అంశం. కోర్టు ద్వారా మాత్రమే ఇవ్వగలం అని జూబ్లీ పోలీస్ స్టేషన్ కి పంచాయితీని బదలాయించారు. సీసీ ఫుటేజ్ ఉన్న గదికి తాళం వేసి ప్రస్తుతం అక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని కోర్టు వరకూ తీసుకెళ్లేందుకు ప్రకాష్ రాజ్ వర్గం ప్రయత్నిస్తోందని కథనాలొస్తున్నాయి. తాజా పరిణామాలతో సీసీ ఫుటేజ్ లో ఏం ఉంది? అన్న క్యూరియాసిటీ మొదలైంది. మొత్తానికి 'మా' ఎన్నికలు ముగిసినా రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పడేదెప్పుడో చూడాలి.
Also Read: ఏంది మలైకా…ఇట్టుంటే ఎట్టా…
Also Read: కుర్రాళ్ల గుండెల్లో 'ఉప్పెన' సృష్టిస్తోన్న కృతి శెట్టి
Also Read: ‘అంత దిగజారి మాట్లాడతారా?’.. కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యలపై అనసూయ ఫైర్
Also Read: ఇది లోబడ్జెట్ ‘స్క్విడ్ గేమ్’.. అదరగొట్టేసిన పిల్లలు.. కొరియన్ వెబ్‌సీరిస్ రికార్డుల మోత!
Also Read: టవల్ జారిపోతుంది.. జాగ్రత్తగా చూసుకో.. టాప్ హీరోపై పూజా హెగ్డే కామెంట్ వైరల్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి