Anasuya: ‘అంత దిగజారి మాట్లాడతారా?’.. కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యలపై అనసూయ ఫైర్
సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుపై ‘జబర్దస్త్’ యాంకర్, నటి అనసూయ మండిపడింది. అనసూయ వస్త్రధారణపై కోటా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె సోమవారం సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుపై ‘జబర్దస్త్’ యాంకర్, నటి అనసూయ మండిపడింది. అనసూయ వస్త్రధారణపై కోటా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె సోమవారం సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఆయన పేరు ప్రస్తావించకుండానే ఓ సీనియర్ నటుడు అంటూ అనసూయ తన బాధను వ్యక్తం చేసింది. సీనియర్ నటుడై ఉండి మరీ అంత నీచంగా మాట్లాడతారా అని ట్వీట్ చేసింది.
‘‘ఓ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు గురించి ఇప్పుడే తెలిసింది. ఎంతో అనుభవం కలిగిన ఆ వ్యక్తి చాలా దిగజారి మాట్లాడటం చాలా బాధ కలిగించింది. వస్త్రాధారణ అనేది వ్యక్తిగత విషయం. అది వృత్తిపరమైన ఛాయిస్ కూడా. కానీ, నేటి సోషల్ మీడియా అలాంటి వార్తలకు ప్రాధాన్యమిస్తోంది. మరి, సీనియర్ నటుడు మందు తాగుతూ.. అధ్వాన్నంగా దుస్తులు ధరించి.. వెండితెరపై స్త్రీలను కించపరిచే సన్నివేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి, వాటిని సోషల్ మీడియా ఎందుకు పట్టించుకోలేదనేది ఆశ్చర్యకరంగా ఉంది. మరి, అలాంటి తారలను ఎందుకు ప్రశ్నించరు? పెళ్లి చేసుకుని.. పిల్లలు ఉండి.. సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ.. షర్టులు వేసుకోకుండా తన బాడీని చూపించే తారలను ఎందుకు ప్రశ్నించరు? నేనొక పెళ్లయిన మహిళను. ఇద్దరు పిల్లల తల్లిని. నా వృత్తిలో సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నాను. మీరు మీ అభిప్రాయాలను ప్రజలకు చెప్పడానికి బదులు.. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నించాలి’’ అని అనసూయ ట్వీట్‌లో పేర్కొంది.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021
ఇటీవల కోటా శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘జబర్దస్త్’ షో గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించారు. ఆ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న అనసూచ మంచి నటి, డ్యాన్సర్, మంచి పర్శనాలిటీ, మంచి ఎక్స్‌ప్రెషన్స్ పలికించగలదు. కానీ, ఆమె ఆ ప్రోగ్రామ్‌లో వేసుకొనే దుస్తులు నాకు నచ్చవు. అలాంటి అందమైన ఆవిడా ఎట్లా వచ్చినా ఎందుకు చూడరండి.. చక్కగా చూస్తారు. రోజా చక్కగా దుస్తులు వేసుకుని వస్తుంటే చూడటం లేదా?’’ అని కోటా అన్నారు. ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనసూయ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అనసూయ ఇటీవల ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసి విజయం సాధించింది. అయితే, కోటా శ్రీనివాసరావు మంచు విష్ణు ప్యానల్‌కు మద్దతు తెలిపారు. అయితే, ఆ ఎన్నికలకు.. వీరి గొడవకు సంబంధం లేకపోయినా.. కొందరు మాత్రం దానికి లింక్ చేస్తున్నారు. మరి, అనసూయ పోస్టుపై కోటా శ్రీనివాసరావు ఎలా స్పందిస్తారో చూడాలి.
అయితే.. అనసూయ అంతటితో ఆగలేదు. ఈ పోస్ట్‌పై ట్రోల్ చేస్తున్న నెటిజనులను కూడా అనసూయ తిట్టిపోస్తూ మరికొన్ని ట్వీట్లు చేసింది.
Ante pedda vaallu chinna vaallu evvaru padite vaallu edi padite adi nannu anochu.. nenu okamate tirigu jaeabu iste maatram “papam musalayana.. papam peddayana.. papam chinnavadu.. papam edo telika.. scene cheyakandi” lanti reactions aa andi na pai?? enta anyayam andi idi?! 😒
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021
Ante oka trash laaga padali kani aa trash mee pai padakudadu.. antena?? Wow 👏🏻👏🏻🙄
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021
Peddarikam chinnarikam anevi vayasu to kadandi.. anubhavam to .. conduct cheskune vidhanamlo untundi.. aayanante oka actor ga chala respect naku 🙏🏻 vibhinnamaina paatralu chala adbhutanga abhinayincharu.. kani as a person aayna comments are just very low and unnecessary..
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021
So let me just clear the mist for you guys..all those who’ve been talking about what women should wear in the past or now..are only so weak & polluted in their heads that rather than teaching themselves to guide/control their sexual feelings or (1/2)..
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021
..(2/2) not fuelling their male chauvinism.. they imposed/impose these mindless dress codes on women.. they slut shame women to cover their himbo thoughts.. I want to believe today’s men are much more logical and brave and sensible and righteous .. please prove me right 🙏🏻
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021
Also Read: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు
Also Read: అందుకే పవన్‌తో మాట్లాడలేదు.. ఎవరుపడితే వాళ్లు ‘మా’లో సభ్యులు కాకూడదు: విష్ణు
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి