Manchu Mohan Babu: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. 'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారోత్సవంలో మోహన్ బాబు కామెంట్స్ వైరల్
ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో మా కొత్త కార్యవర్గం కొలువుదీరింది.. 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం చేశారు. ఈ వేదికపై మంచు మోహన్ బాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
విష్ణు ప్రమాణ స్వీకారోత్సవంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోహన్ బాబు సహా బాలకృష్ణ, కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ పలువురు సినీ సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఈ విదికపై మంచు మోహన్ బాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజకీయాల కంటే టాలీవుడ్ లోనే పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయని అన్నారు మోహన్ బాబు. మనం కళాకారుల గురించి మాట్లాడాలని రాజకీయాల గురించి కాదని అన్నారు. నువ్వు గొప్ప నేను గొప్ప అనేది ముఖ్యం కాదన్న మోహన్ బాబు
టాలెంట్ ఎవరి సొత్తు కాదని బెదిరింపులకు కళాకారులు ఎవరు భయపడరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు గెలుపునకు నరేష్ ఎంతో కృషి చేశాడని వేదికపై ప్రశంసించారు మోహన్ బాబు. విష్ణు ఎన్నో వాగ్దానాలు చేశాడు అని అవన్నీ ఎలా నెరవేరుస్తాడో అని భయపడుతున్నానన్నారు కలెక్షన్ కింగ్. మేం ఇంతమంది ఉన్నాం, అంతమంది ఉన్నాం అని బెదిరించారు.. కానీ ఓటర్లు ఎవరికీ భయపడకుండా ఓటేసి విష్ణుని గెలిపించారన్న మోహన్ బాబు..తనకు ఎవ్వరిపైనా పగ లేదని..రాగద్వేషాలు లేకుండా అంతా కలసిమెలిసి పనిచేసుకుందాం అన్నారు. ఇకనైనా రెచ్చగొట్టడం ఆపమని హెచ్చరించారు. మంచు కమిటీ మంచి కమిటీ అన్న నరేశ్ మైకుల్లో చెడు మాట్లాడటం మానేసి మంచి మాత్రమే మాట్లాడాలని చెప్పారు. ఓడినా గెలిచినా అంతా 'మా' సభ్యులమే అని స్పష్టం చేశారు.
Also Read: ప్రమాణ స్వీకారం చేసిన విష్ణు అండ్ కో, కనిపించని మెగా ఫ్యామిలీ
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్...మోహన్ బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. తప్పును తప్పుగా చెప్పే గొప్ప వ్యక్తి మోహన్ బాబు అని కితాబిచ్చారు. ముక్కుసూటిగా వ్యవహరించే స్వభావం ఆయనదని అన్నారు. తనది, మోహన్ బాబుది అన్నదమ్ముల అనుబంధమన్న తలసాని....మోహన్ బాబుకు కోపం వల్ల ఆయనకే ఎక్కువ చెడు జరిగిందని, పక్క వాళ్లకు కాదని అన్నారు. మంచి వ్యక్తులను 'మా' కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారని ఈ సందర్భంగా తలసాని అన్నారు. 'మా' అంటే ఒక కుటుంబం మాత్రమే కాదని, ఒక వ్యవస్థ అని చెప్పారు. అందరినీ గౌరవించే వ్యక్తి మంచు విష్ణు అని...'మా'కు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు చెప్పారు తలసాని. హైదరాబాద్ సినీ హబ్ గా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్న తలసాని సింగిల్ విండో ద్వారా సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
Also Read: ఆహా 'టాక్ షో' కోసం బాలయ్యకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్….!
విష్ణు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. అలాగే, పలువురు టాలీవుడ్ ప్రముఖులు అటెండ్ అయ్యారు.. బాలకృష్ణ, కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ తదితరుల ఇంటికెళ్లి మంచు ఫ్యామిలీ స్వయంగా ఆహ్వానించింది. మంచు విష్ణు ప్యానెల్ నుంచి మొత్తం 15 మంది గెలిచారు. అధ్యక్షుడిగా విష్ణు, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, ట్రెజరర్‌గా శివబాలాజీ విక్టరీ కొడితే… ఈసీ మెంబర్స్‌గా గీతాసింగ్, అశోక్ కుమార్, శ్రీలక్ష్మి, సి.మాణిక్, శ్రీనివాసులు, హరనాథ్‌బాబు, శివన్నారాయణ, సంపూర్ణేష్‌బాబు, శశాంక్, బొప్పన విష్ణు విజయం సాధించారు. వీళ్లంతా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు..
Also Read: ఫస్ట్ టైం కార్పొరేట్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరో
Also Read:సరదాగా సాగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్…ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ గా జైలుకెళ్లిందెవరంటే…
Also Read: పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన బాహుబలి విలన్
Also Read: 'స్వామిరారా' టీమ్ మూడోసారి…
Also Read: వరుడు కావలెను' సినిమా విడుదల ఎప్పుడంటే...
Also Read: సత్యదేవ్ కొత్త సినిమా గాడ్సే... లుక్ అదిరిందిగా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి