MAA Elections: ప్రమాణ స్వీకారం చేసిన విష్ణు అండ్ కో, కనిపించని మెగా ఫ్యామిలీ
మా ఎన్నికలు ఎంత హోరాహోరీ జరిగాయో తెలిసిందే. అందులో విజయం సాధించిన విష్ణు ప్రమాణస్వీకారోత్సవం శనివారం జరిగింది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలోనే ఆయన, గెలుపొందిన ఆయన ప్యానెల్ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ వేడుక ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. అనేక మంది సినీ నటీ నటులు కూడా హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే మా కార్యాలయంలో విష్ణు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రకాష్ ప్యానెల్ ఎక్కడ?
ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య మాటల తూటాలు పేలాయి. కాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది గెలుపొందారు. అయితే వారంతా ముందే రాజీనామా చేశారు. తమను వ్యక్తిగతంగా బాధపెట్టారని చెబుతూ, తాము విష్ణు ప్యానెల్ తో కలిసి పనిచేయలేమని తమ పదవులకు రాజీనామా చేశారు. అంతేకాదు విష్ణు కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ప్రకాష్ రాజ్ తో సహా, అతని ప్యానెల్ సభ్యులెవరూ హాజరు కాలేదు.
మెగా ఫ్యామిలీని ఆహ్వానించలేదా?
మెగా కుటుంబాన్ని మంచు ఫ్యామిలీ దెబ్బకొట్టిందనే వార్తలు ట్రెండవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రమాణస్వీకారోత్సవానికి విష్ణు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరినీ ఆహ్వానించలేదని టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ, కోట శ్రీనివాసరావు వంటి వారిని మంచు విష్ణు స్వయంగా తానే వెళ్లి ఆహ్వానించారు. కానీ మెగా హీరోలను పిలిచినట్టు ఎక్కడా సమాచారం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసిన మంచు మనోజ్ ఆయన్ను ఆహ్వానించారని అన్నారు, కానీ దానిపై కూడా స్పష్టత లేదు. అయితే డజను మంది హీరోలున్న మెగా ఫ్యామిలీలో ఒక్కరిని పిలవపోవడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. వారిని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టినట్టు అర్థమవుతోంది. అందరినీ కలుపుకుని వెళ్లడం అంటే ఇదేనా అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మెగా ఫ్యామిలీ మద్దతు పలకడమే మంచు విష్ణు కోపానికి కారణం కావచ్చని అంటున్నారు.
Also read: ఇలాంటి ఆహారపదార్థాలు తింటున్నారా... అయితే మతిమరుపు వచ్చే ఛాన్స్
Also read: బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన పద్దతులు చెబుతున్న ఆయుర్వేదం
Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి