Rana daggubati: పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన బాహుబలి విలన్
బాహుబలితో ప్రభాస్, రానా... ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. త్వరలో రానా మరో పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నాడు.
త్వరలోనే విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రానా దగ్గుబాటి. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా దసరా రోజున రానా నటించబోయే కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఇది దగ్గుబాటి అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో రానా హీరోగా నటించబోతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది మిలింద్ రావ్. ఈయన ఇటీవల నయనతారతో కలిసి ‘నెట్రికణ్’ అనే సినిమాను రూపొందించారు. డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. గతంలో ‘గృహం’అనే సినిమాకు దర్శకత్వం వహించారు మిలింద్.
రానా కొత్త సినిమాకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండవుతున్నాయి. దాన్ని బట్టి ఈ సినిమాను గోపీనాథ్, అర్జున్ దాస్యన్, రాంబాబు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇంకా హీరోయిన్, ఇతర పాత్రల ఎంపిక త్వరలో జరగనుంది. ఈ సినిమాకు ‘ధీరుడు’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం రానా తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లానాయక్ లో కూడా నటిస్తున్నారు.
ఈ ఏడాది విడుదలైన రానా సినిమా ‘అరణ్య’. దసరా కానుకగా దీన్ని జీ5లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించింది. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది.
Our #Bhallaladeva @RanaDaggubati to star in @milindrau story/direction in new movie by SpiritMedia in collaboration with @VISWASANTIPICTS & @VCWOfficial. Pan-India #Film in #Telugu #Tamil & #Hindi. Produced by @GopinathAchant, CH.Rambabu & @arjundasyan. Stay tuned for more... pic.twitter.com/SjTCEFlrIG
— BA Raju's Team (@baraju_SuperHit) October 15, 2021
Also read: మహనీయుల్లో కనిపించే లక్షణాలు ఇవన్నీ... నేర్చుకుంటే మీరూ గొప్పవారే
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు
Also read: బాదం పలుకులను నీటిలో నానబెట్టి తింటేనే ఎక్కువ లాభాలా? పచ్చిగా తినాలా?
Also read: ఈ-సిగరెట్లు సురక్షితమనుకుంటున్నారా? అందులో కూడా కెమికల్స్ ఉన్నాయంటున్న అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి