అన్వేషించండి

Almonds: బాదం పలుకులను నీటిలో నానబెట్టి తింటేనే ఎక్కువ లాభాలా? పచ్చిగా తినాలా?

రోజుకు నాలుగు బాదం పలుకులు తిన్నా ఎంతో ఆరోగ్యమని చెబుతారు వైద్యులు. కానీ వాటిని ఎలా తింటే ఎక్కువ లాభాలు పొందచ్చు.

సాధారణ బాదం పప్పుతో పోలిస్తే రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదం పలుకులు తినడం వల్ల లాభాలు ఎక్కువ అని చెబుతారు పెద్దలు. అది ఎంత వరకు నిజమో తెలియకపోయినా పాటించే వారూ ఉన్నారు. అయితే ముడి బాదం పలుకులతో పోలిస్తే, నీటిలో నానబెట్టిన బాదంతో లాభాలు ఎక్కువనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎలా లాభమో తగిన కారణాలతో సహా వివరిస్తున్నారు. 

ఎన్ని లాభాలో...
బాదం పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో మన శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, రాగి ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ బరువు తగ్గడానికి, ఎముకల ఆరోగ్యానికి, మానసిక స్థిమిత్వానికి, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటివి రాకుండా నిరోధించేందుకు ఉపయోగపడతాయి. వీటిలోని పోషకాల శక్తి మరింత పెరగాలంటే బాదం పలుకులను నానబెట్టి తినాల్సిందే. 

1. పచ్చి  బాదంతో పోలిస్తే నానబెట్టిన బాదం పలుకులు త్వరగా జీర్ణం అవుతాయి. ఇలా నానబెట్టింది ఏదైనా జీర్ణ వ్యవస్థలో త్వరగా విచ్ఛిన్నం అయ్యి శక్తిగా మారి శోషించబడుతుంది. 

2. నానిన బాదంపలుకులలో పోషకాల లభ్యత కూడా పెరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ప్రయోజనాలు పెరుగుతాయి. నానబెట్టడం వల్ల కొన్ని మలినాలు కూడా తొలగిపోతాయి. 

3. నానబెట్టిన బాదం లిపేస్ వంటి ఎంజైమ్లను విడుదల చేస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. అంతేకాదు బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహార మెనూలో  బాదం పలుకులను కూడా చేర్చుకోండి. 

4. బాదం నానబెట్టినప్పుడు అందులోని ఫైటిక్ ఆమ్లం తొలగిపోతుంది. ఇది శరీరంలో పోషకాల శోషణకు అడ్డుపడే ఆమ్లం. ఇది తొలగిపోతే బాదంలోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. అందుకే  పచ్చిగా తిన్నప్పుడు బాదంలోని ఇనుము, జింకు వంటి పోషకాలు శరీరం శోషించుకునే అవకాశాలు తక్కువ. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: కాఫీ అధికంగా తాగుతున్నారా... ఆల్కహాల్ కంటే ప్రమాదం

Also read: పెరుగుతో పాటూ వీటిని తింటే... ఎంత ఆరోగ్యమో

Also read: పిల్లలకు తీపి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది, లేకుంటే పెద్దయ్యాక కష్టాలే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Desk Job Health Risks : డెస్క్ జాబ్ చేస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త
డెస్క్ జాబ్ చేస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త
Munagaku Roti Pachadi : నోరూరించే మునగాకు రోటి పచ్చడి.. పల్లీలు వేసి చేస్తే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదే ఆంధ్రా స్టైల్ రెసిపీ
నోరూరించే మునగాకు రోటి పచ్చడి.. పల్లీలు వేసి చేస్తే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదే ఆంధ్రా స్టైల్ రెసిపీ
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Morning Skincare Routine : గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి
గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Embed widget