X

Balakrishna Talk Show: ఆహా 'టాక్ షో' కోసం బాలయ్యకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్….!

స్టార్ హీరోయిన్ స‌మంత‌తో సామ్ జామ్ షో నిర్వహించిన ఆహా..తొలిసారిగా నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ‌ను రంగంలోకి దింపింది. ఈ షో కోసం బాలయ్యకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తోందో తెలుసా…

FOLLOW US: 

విశ్వవిఖ్యాత నటసార్వ భౌమ ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ దశాబ్దాలుగా  క్రేజ్ కొనసాగిస్తున్నాడు. సినిమా హిట్టు-ఫ్లాపుతో సంబంధం లేకుండా  రెమ్యునరేషన్ ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. అందుకే నిర్మాతల హీరో అనిపించుకున్న బాలయ్యతో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తారు. పైగా సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలకు పెద్దగా నష్టం రాదని ఇండస్ట్రీలో చెబుతారు. ఎందుకంటే బాలయ్య అనవసర ఖర్చులకు దూరంగా...బడ్జెట్ విషయంలో హద్దులు దాటకుండా... ఆడంబరాలకు దూరంగా ఉంటారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అందుకే ఎప్పుడూ బాలయ్య రెమ్యునరేషన్ పై పెద్దగా చర్చ జరగలేదు. వెండితెర సంగతి పక్కనపెడితే బాలయ్య తొలిసారిగా  బిగ్ స్క్రీన్ నుంచి డిజిటల్ ఫ్లాట్ ఫాంపై  తొలి అడుగు వేశారు. ఆహాలో 'అన్ స్టాబబుల్' అంటూ ఓక టాక్ షో  చేయనున్నారు. ఇప్పటి వరకూ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బాలకృష్ణ హీరోగా సినిమాలు తీయలేదు. తీస్తే పారితోషికం ఎలా ఉండేదో కానీ తాజాగా ఆహా కు' టాక్ షో'కి అదిరిపోయే రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్.
Also Read: ఫస్ట్ టైం కార్పొరేట్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరో
ఎపిసోడ్ కి రూ.40 లక్షలు చొప్పున  మొత్తం 12 ఎపిసోడ్స్ గా దీన్ని డిజైన్ చేస్తున్నారు. అంటే దాదాపు రూ.5 కోట్లు  రెమ్యునరేషన్ దక్కుతుందని  లెక్కలేస్తున్నారు. వాస్తవానికి ఓ సినిమా చేయాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది  పడుతుంది. అదే టాక్ షో అయితే మూడు నెలల్లో ముగుస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే బాలయ్యకి మంచి పారితోషికం అన్నట్టే లెక్క. పైగా నందమూరి నటసింహం ఇప్పటివరకూ ఏ సినిమాకు ఐదారుకోట్లకు మించి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ టాక్ షో తో మంచి రెమ్యునరేషన్ రావడంతో ఇక సినిమాలకు సంబంధించి కూడా  బాలకృష్ణ దాదాపు పదికోట్లు దాటి తీసుకుంటారేమో అంటున్నారు. 
Also Read: సత్యదేవ్ కొత్త సినిమా గాడ్సే... లుక్ అదిరిందిగా
న‌వంబ‌ర్ 4 నుంచి ప్ర‌సారం కానున్న తొలి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ ఎవ‌రిని ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నార‌న్నది  ఆస‌క్తిగా ఉంది. ఈ మధ్యే ఈ షో లాంచ్ వేడుక నిర్వహించారు.  ఈ షోలో చిరంజీవి, రామ్ చరణ్ తో కలసి పాల్గొంటారని , ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పార్టిసిపేట్ చేశారని, నాగార్జున కూడా చైతూ, అఖిల్ తో కలసి షో లో పార్టిసి పేట్ చేయనున్నారని అంటున్నారు. ఇలాంటి రేర్ కాంబినేషన్స్ కలయికలో అంటే ఈ టాక్ షో నిజంగానే  ‘బాప్ ఆఫ్‌ ఆల్ టాక్ షోస్’అనిపించుకుంటుందేమో చూద్దాం.
Also Read: సరదాగా సాగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్…ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ గా జైలుకెళ్లిందెవరంటే…
Also Read: పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన బాహుబలి విలన్
Also Read: 'స్వామిరారా' టీమ్ మూడోసారి…
Also Read: వరుడు కావలెను' సినిమా విడుదల ఎప్పుడంటే...
Also Read: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Nandamuri Balakrishna Aha OTT Balakrishna talk show Shocking Remuneration Unstable With Balakrishna

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: 'నాకొద్దు బాబోయ్ నీ హగ్'.. సిరికి దండం పెట్టిన షణ్ముఖ్.. ఈ వారం సన్నీ సేఫ్.. 

Bigg Boss 5 Telugu: 'నాకొద్దు బాబోయ్ నీ హగ్'.. సిరికి దండం పెట్టిన షణ్ముఖ్.. ఈ వారం సన్నీ సేఫ్.. 

Tollywood: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో రాబోయే సినిమాలివే..

Tollywood: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో రాబోయే సినిమాలివే..

Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన ఓంకార్

Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన ఓంకార్

Sirivennela: ఐసీయూలోనే సిరివెన్నెల.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల..

Sirivennela: ఐసీయూలోనే సిరివెన్నెల.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల..

Pushpa Pre Release Event: బన్నీ కోసం ప్రభాస్ వస్తాడా..?

Pushpa Pre Release Event: బన్నీ కోసం ప్రభాస్ వస్తాడా..?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

WTC Points Table 2021-2023: టెస్టు చాంపియన్‌షిప్ రేసు మొదలైంది... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో టీమిండియా.. టాప్ ఎవరంటే?

WTC Points Table 2021-2023: టెస్టు చాంపియన్‌షిప్ రేసు మొదలైంది... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో టీమిండియా.. టాప్ ఎవరంటే?

Cm Kcr: యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు... వర్షకాలం పంటను ఎంతైనా కొంటాం... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...

Cm Kcr: యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు... వర్షకాలం పంటను ఎంతైనా కొంటాం... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...

Omicron Symptoms: ఓ మై క్రాన్.. కొత్త కోవిడ్ సోకితే లక్షణాలు కనిపించవా? దక్షిణాఫ్రికా డాక్టర్ చెప్పిన కీలక విషయాలివే..

Omicron Symptoms: ఓ మై క్రాన్.. కొత్త కోవిడ్ సోకితే లక్షణాలు కనిపించవా? దక్షిణాఫ్రికా డాక్టర్ చెప్పిన కీలక విషయాలివే..

CM Jagan Review: వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలి.. వెంటనే పనులు మొదలు పెట్టాలి

CM Jagan Review: వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలి.. వెంటనే పనులు మొదలు పెట్టాలి