'Varudu Kaavalenu' Release Date: 'వరుడు కావలెను' సినిమా విడుదల ఎప్పుడంటే...
దసరా కానుకగా విడుదల కావాల్సిన వరుడు కావలెను సినిమా వాయిదా పడింది. ఈ మేరకు కొత్త విడుదల తేదీ ప్రకటించారు మేకర్స్...
నాగ శౌర్య - రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ''వరుడు కావలెను'' . ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. కానీ పండుగ రోజు విడుదలయ్యే సినిమాల రష్ ఎక్కువ ఉండడంతో వరుడు కావలెను మూవీ వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు.
#VaruduKaavalenu in theatres from 29th Oct, 2021 💥#VaruduKaavalenuFrom29thOct @riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @ganeshravuri @Vamsi_P1988 @NavinNooli @adityamusic pic.twitter.com/d4f7mr2f4T
— Naga Shaurya (@IamNagashaurya) October 15, 2021
'వరుడు కావలెను' అక్టోబర్ 29న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లకు సంబంధించిన ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని వదిలారు. ఇందులో రీతూ వర్మ చేతులకు మెహందీ పెట్టుకుని ఉండగా.. శౌర్య ఆమె చెవి దగ్గర మొబైల్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాత. విశాల్ చంద్రశేఖర్, థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ ,హర్ష వర్ధన్ ,ప్రవీణ్, అనంత్ , కిరీటి దామరాజు, అర్జున్ కళ్యాణ్ , వైష్ణవి చైతన్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా', 'దిగు దిగు నాగ', 'మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ' పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో వస్తోన్న ‘వరుడు కావలెను‘ నాగశౌర్య, రీతూవర్మకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read: ఎఫ్3 టీమ్ దసరా విషెస్... మామూలుగా లేదుగా వీడియో
Also Read: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!
Also Read: జైలు నుంచి వీడియో కాల్.. ఆర్యన్‌కు రూ.4,500 మనీ ఆర్డర్ పంపిన షారుక్!
Also Read: సమంత బైలింగ్యువల్ సినిమా.. 'జై భీమ్' టీజర్ తో అదరగొట్టిన సూర్య..
Also Read : నాని ఊర మాస్ గెటప్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి