F3 Movie: ఎఫ్3 టీమ్ దసరా విషెస్... మామూలుగా లేదుగా వీడియో
ఎఫ్ 3 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మధ్యలో ఆ మూవీ టీమ్ అంతా కలిసి ప్రేక్షకులకు విభిన్నంగా దసరా విషెస్ చెప్పారు.
సూపర్ ఫన్ మూవీ ‘ఎఫ్2’కి సీక్వెల్ గా వస్తోంది ఎఫ్3. ఎఫ్ 2తో పోలిస్తే సీక్వెల్ మరింత ఫన్ పంచుతుందని చిత్రయూనిట్ ముందే ప్రకటించింది. ఇందులో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఇతర పాత్రలు కూడా దాదాపు ఎఫ్ 2లో ఉన్నవే కొనసాగుతున్నప్పటికీ సునీల్, రఘుబాబు వంటి వారు అదనంగా చేరారు. కాకపోతే ప్రకాష్ రాజ్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ చిత్రయూనిట్ దసర సందర్భంగా ప్రేక్షకులకు విభిన్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. షూటింగ్ మధ్యలో నటీనటులంతా తమదైన రీతిలో విషెస్ తెలిపారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ వీడియో ట్రెండవుతోంది. దిల్ రాజ్ తన యూట్యూబ్ ఛానెల్ లో దీన్ని పోస్టు చేశారు. అలాగే అనిల్ రావిపూడి తన ఇన్ స్టా ఖాతాలోనూ షేర్ చేశారు.
ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంగీతం అందిస్తున్నది దేవిశీ ప్రసాద్. ముందు మూవీతో పోలిస్తే మరింత కామెడీగా స్క్రిప్ట్ సిద్ధమయిందని టాక్. లాక్ డౌన్ లోనే దీని స్క్రిప్ట్ రెడీ చేశారట అనిల్. ఎఫ్3 చిత్ర మొత్తం డబ్బుల చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఎఫ్ 2 మూవీ రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో ఎఫ్3పై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.
View this post on Instagram
Also read: మహనీయుల్లో కనిపించే లక్షణాలు ఇవన్నీ... నేర్చుకుంటే మీరూ గొప్పవారే
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు
Also read: బాదం పలుకులను నీటిలో నానబెట్టి తింటేనే ఎక్కువ లాభాలా? పచ్చిగా తినాలా?
Also read: పిల్లలకు తీపి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది, లేకుంటే పెద్దయ్యాక కష్టాలే