Aryan Khan: జైలు నుంచి వీడియో కాల్.. ఆర్యన్‌కు రూ.4,500 మనీ ఆర్డర్ పంపిన షారుక్!
తన తల్లిదండ్రులతో ఆర్యన్ ఖాన్ వీడియో కాల్ మాట్లాడినట్లు జైలు అధికారులు తెలిపారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ తన తండ్రి షారుక్ ఖాన్, తల్లి గౌరిలతో వీడియో కాల్ మాట్లాడాడు. అరెస్ట్ అయిన 12 రోజుల తర్వాత తన తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడేందుకు ఆర్యన్ ఖాన్‌కు జైలు అధికారులు అనుమతించారు. ఈ మేరకు జైలు అధికారులు తెలిపారు.
గత ఏడాది కరోనా వచ్చినప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులు, లాయర్లతో మాట్లాడేందుకు ఖైదీలకు జైలు అధికారులు అవకశామిచ్చారు.
కరోనా నెగిటివ్‌గా తేలిన తర్వాత ఆర్యన్ ఖాన్‌ను అర్థర్ రోడ్ జైలులోని క్వారంటైన్ సెల్‌కు ఆర్యన్ ఖాన్‌ను తరలించారు పోలీసులు. అక్కడ ఎన్956 నంబర్‌ను ఆర్యన్ ఖాన్‌కు ఇచ్చారు.
ఆర్యన్ పూర్తి నిరాశతో ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. అందుకే ఇతర ఖైదీలతో కాకుండా ఆర్యన్‌ను భద్రతా కారణాల వల్ల సింగిల్ సెల్‌లో ఉంచుతున్నారు.
ఇంటి భోజనం వద్దని జైలు ఆహారాన్నే ఆర్యన్ స్వీకరిస్తున్నాడు. జైలు నిబంధనల ప్రకారం ఆర్యన్‌కు రూ.4,500 మనీ ఆర్డర్ తన తల్లిదండ్రుల నుంచి వచ్చింది. జైలు క్యాంటిన్లో చిరుతిండ్లు, జ్యూస్ సహా ఇతర ఆహార పదార్థాలను కొనుక్కునేందుకు ఆర్యన్ వీటిని వినియోగించుకోవచ్చు.
అక్టోబర్ 20న..
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును అక్టోబర్ 20 వరకు రిజర్వ్‌లో ఉంచింది ముంబయి సెషన్స్ కోర్టు. దీంతో అప్పటివరకు ఆర్యన్ ఖాన్ సహా అర్బాజ్ సేత్ మర్చెంట్, మున్‌మున్ ధామేచా జైల్లోనే గడపనున్నారు.
బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ సందర్భంగా ఎన్‌సీబీ తరఫున ఏఎస్‌జీ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ తరుచు తీసుకుంటాడని.. అతని వద్ద డ్రగ్స్ దొరకేలేనంత మాత్రాన ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేయకూడదని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం తన తీర్పును అక్టోబర్ 20 వరకు రిజర్వ్‌లో ఉంచింది.
Also Read: Manmohan Singh: నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం
Also Read: Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 16 మంది మృతి!
Also Read: ఉద్యోగం వద్దు బాబోయ్! లక్షల్లో రాజీనామాలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు!
Also Read: అద్భుతమైన సౌండ్‌బార్ కావాలా? బ్రాండెడ్ సౌండ్‌బార్లపై ఇప్పుడు 60 శాతం డిస్కౌంట్