News
News
X

Americans Quitting Jobs: ఉద్యోగం వద్దు బాబోయ్‌! లక్షల్లో రాజీనామాలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు!

'ది గ్రేట్‌ రిసిగ్నిషన్‌' ఉద్యమం అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. లక్షల సంఖ్యలో రాజీనామాలు చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు ఇది చేటుగా మారుతుందని ఆర్థిక వేత్తలు అంటున్నారు.

FOLLOW US: 
 
అగ్రరాజ్యం అమెరికాకు మరో చిక్కు వచ్చిపడింది! 'ది గ్రేట్‌ రిసిగ్నిషన్‌' పేరుతో ఓ ఉద్యమమే నడుస్తోంది. ఉన్నపళంగా మహిళలు, పురుషులు ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. ఫలితంగా లేబర్ మార్కెట్లో ఉద్యోగులకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. వస్తున్న వారికన్నా పోతున్న వారే ఎక్కువగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

Also Read: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? ఈ 5 అంశాలు తెలుసుకోండి

ఆగస్టులో ముదిరింది

గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. ఆగస్టులో దాదాపుగా 3 శాతం మంది ఉద్యోగాలను వదిలేశారు. సంఖ్యా పరంగా చెప్పాలంటే వెళ్లిపోయిన వారి సంఖ్య 43 లక్షలకు చేరుకుంది. ఇక అదే నెలలో కరోనా మహమ్మారి కారణం చెప్పి లేఆఫ్‌లు ప్రకటించారు. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 13 లక్షల వరకూ ఉంది. పురుషుల (4.4%)తో పోలిస్తే మహిళలు (5.5%) ఎక్కువగా రాజీనామా చేశారు. సెప్టెంబర్లో 3 లక్షల మంది స్త్రీలు ఉద్యోగం వదిలేయగా కొత్తగా 1.94 లక్షల మందికే ఉద్యోగాలు వచ్చాయి.

News Reels

ఎందుకిలా?

నాలుగో తరం సేవా కంపెనీలపై గ్రేట్‌ రిసిగ్నిషన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. వినియోగదారులను డీల్‌ చేయడం, ఆస్పత్రుల్లో నర్సులుగా సేవలందించడం, చిన్నారులను చూసుకోవడం, రెస్టారెంట్లు, రిటైల్‌ ఇండస్ట్రీస్‌, పాఠశాలల్లో మహిళల అవసరం ఎంతైనా ఉంది. కరోనా కాలంలో వీరిలో చాలామంది ఇంటి వద్ద పిల్లలను చూసుకున్నారు. అటు పనులు చేశారు. కార్యాలయాల్లో శక్తికి మించి శ్రమించారు. దాదాపు రోజుకు 12 గంటలకు పైగా పనిచేశారు. పైగా వేతనాల్లో కోతలు, లేఆఫ్‌ల వంటివి వారిని వేధించాయి. చాలా వరకు అలసిపోవడం, ఎక్కువ శ్రమించడం వల్లే రాజీనామాలు చేస్తున్నారు. త్వరలో కొవిడ్‌ పరిహారం ఆగిపోతుందని తెలిసినా లక్షల సంఖ్యలో ఉద్యోగాలను వదిలేయడంతో ఆర్థిక వ్యవస్థ నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.

Also Read: మనదేశంలో బీఎండబ్ల్యూ మొదటి స్కూటర్ వచ్చేసింది.. షాకిచ్చే ధర.. ఏకంగా కారే కొనచ్చు!

మహిళలే ఎక్కువ
వ్యాక్సినేషన్‌ పూర్తవుతుండటం, ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకోవడంతో ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతోంది. అలాంటి సమయంలో మహిళలు, పురుషులు ఒక్కసారిగా రాజీనామాలు చేయడంతో కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. 2020 ఫిబ్రవరితో పోలిస్తే ఇప్పటికీ 32 లక్షల మంది కార్మికులు తక్కువగా ఉన్నారు. దాంతో ఇప్పుడు ఉన్న ఉద్యోగులను కాపాడుకొనేందుకు కంపెనీలు అదనపు భత్యాలు, వేతనాలు ఇవ్వడం మొదలు పెట్టాయి. రాజీనామాలు చేసే వారికి ఇంటివద్దే పనిచేయమని చెబుదామన్నా.. ఆస్పత్రులు, రెస్టారెంట్లు, చైల్డ్‌కేర్‌ సెంటర్లలో అలాంటివి కుదరడం లేదు.

ఇదే మంచి తరుణం!
కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదే సరైన తరుణమని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారు ఇప్పుడు ప్రవేశించడం మంచిదని అంటున్నారు. కాగా ఉద్యోగాలు వదిలేస్తున్నవారు కొత్తగా ఎక్కడైనా చేరుతున్నారా అంటే లేదనే తెలుస్తోంది. ప్రభుత్వం వద్దనున్న సమాచారం దానినే సూచిస్తోంది. రాజీనామా చేసిన ప్రతి పది మందిలో నలుగురు రెస్టారెంట్లు, ఆతిథ్యం, రిటైల్‌ లొకేషన్‌ రంగాలకు చెందినవారే. ఏదేమైనా గ్రేట్‌ రిసిగ్నిషన్‌ ఉద్యమంతో ఇప్పుడున్న ఉద్యోగులు, కొత్తవారికి అదనపు వేతనాలు, ఇన్సెంటివ్‌, ఇతర భత్యాలు భారీ స్థాయిలోనే ఇవ్వనున్నారని అంచనా వేస్తున్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Oct 2021 03:09 PM (IST) Tags: women Jobs Americans the Great Resignation

సంబంధిత కథనాలు

Landmark Cars IPO: ల్యాండ్‌మార్క్‌ కార్స్‌ అప్‌డేట్‌ - ఐపీవో తేదీ, ప్రైస్‌బ్యాండ్‌ ఖరారు

Landmark Cars IPO: ల్యాండ్‌మార్క్‌ కార్స్‌ అప్‌డేట్‌ - ఐపీవో తేదీ, ప్రైస్‌బ్యాండ్‌ ఖరారు

Stocks to watch 09 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - షేర్ల బైబ్యాక్‌ ప్రపోజల్‌లో Paytm

Stocks to watch 09 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - షేర్ల బైబ్యాక్‌ ప్రపోజల్‌లో Paytm

Gold-Silver Price 09 December 2022: ₹54 వేల పైకి పసిడి రేటు, వెండి కూడా మాంచి జోరుమీదుంది

Gold-Silver Price 09 December 2022: ₹54 వేల పైకి పసిడి రేటు, వెండి కూడా మాంచి జోరుమీదుంది

Petrol-Diesel Price, 09 December 2022: కర్నూల్లో దిగి వచ్చిన చమురు ధర, మిగిలిన నగరాల్లోనూ మారిన పెట్రోల్‌ రేట్లు

Petrol-Diesel Price, 09 December 2022: కర్నూల్లో దిగి వచ్చిన చమురు ధర, మిగిలిన నగరాల్లోనూ మారిన పెట్రోల్‌ రేట్లు

Car Price Hike In India: కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా?, అయితే కాస్త ఎక్కువ కూడబెట్టండి

Car Price Hike In India: కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా?, అయితే కాస్త ఎక్కువ కూడబెట్టండి

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !