News
News
X

BMW First Scooter: మనదేశంలో బీఎండబ్ల్యూ మొదటి స్కూటర్ వచ్చేసింది.. షాకిచ్చే ధర.. ఏకంగా కారే కొనచ్చు!

మనదేశంలో బీఎండబ్ల్యూ తన మొదటి స్కూటీని లాంచ్ చేసింది. అదే బీఎండబ్ల్యూ మ్యాక్సీ స్కూటర్ సీ400జీటీ. దీని ధర రూ.9.95 లక్షలుగా నిర్ణయించారు.

FOLLOW US: 
 
దిగ్గజ ఆటో కంపెనీ బీఎండబ్ల్యూ మనదేశంలో మొదటి స్కూటీని లాంచ్ చేసింది. అదే బీఎండబ్ల్యూ మ్యాక్సీ స్కూటర్ సీ400జీటీ. ఈ స్కూటర్ ధర మనదేశంలో రూ.9.95 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఆన్ రోడ్‌కు రూ.10 లక్షలు కూడా దాటేసే అవకాశం ఉంది.

దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఆల్ఫైన్ వైట్, స్టైల్ ట్రిపుల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

బీఎండబ్ల్యూ మ్యాక్సీ స్కూటర్ సీ400జీటీ బాడీ ప్యానెల్ బలంగా ఉండనుంది. పొడవైన విండ్ స్క్రీన్, పుల్ బ్యాక్ హ్యాండిల్ బార్, పెద్ద సీట్లు, డ్యూయల్ ఫుట్ రెస్ట్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, కీలెస్ ఇగ్నీషన్, హీటెడ్ గ్రిప్స్, హీటెడ్ సీట్లు, యాబ్స్, యాంటీ థెఫ్ట్ అలారం సిస్టం, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉన్నాయి.

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

News Reels

ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 350 సీసీ వాటర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్‌ను అందించారు. సీవీటీ ట్రాన్స్‌మిషన్ కూడా ఇందులో ఉంది. 33.5 బీహెచ్‌పీ పవర్, 35 ఎన్ఎం టార్క్ కూడా ఇందులో ఉన్నాయి. దీని పవర్ ఫుల్ ఇంజిన్ కారణంగా.. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది 9.5 సెకన్లలోనే అందుకోనుంది. దీని టాప్ స్పీడ్ 139 కిలోమీటర్లుగా ఉంది.

ధర విషయంలో బీఎండబ్ల్యూ మ్యాక్సీ స్కూటర్ సీ400జీటీకి ఎటువంటి పోటీ లేకపోయినా.. హోండా ఫోర్జా 350, సుజుకి బుర్గ్‌మన్ స్ట్రీట్ 125, ఏప్రిలా ఎస్ఎక్స్ఆర్ 160లతో ఇది పోటీ పడనుంది. అయితే హోండా తన స్కూటీని మనదేశంలో లాంచ్ చేస్తుందో లేదో తెలియరాలేదు.  

Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!

Also Read: Petrol-Diesel Price, 19 September 2021: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు... తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవాళ్టి ధరలు ఇలా...

Also Read: Ola Electric Scooter: అమ్మకాల్లో ఓలా స్కూటర్ రికార్డు.. మొత్తం టూవీలర్ ఇండస్ట్రీనే మించేలా.. ఎన్ని అమ్ముడుపోయాయంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 13 Oct 2021 07:05 PM (IST) Tags: BMW Maxi Scooter C 400 GT BMW Maxi Scooter C 400 GT Price in India BMW Maxi Scooter C 400 GT Features BMW Maxi Scooter C 400 GT Engine BMW BMW First Scooter in India

సంబంధిత కథనాలు

Car Price Hike In India: కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా?, అయితే కాస్త ఎక్కువ కూడబెట్టండి

Car Price Hike In India: కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా?, అయితే కాస్త ఎక్కువ కూడబెట్టండి

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !