Manmohan Singh: నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోలుకుంటున్నారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్యోగ్యం నిలకడగా ఉన్నట్లు దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి ప్రకటించింది. మన్మోహన్ సింగ్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
జ్వరంతో ఆసుపత్రికి..
తీవ్రమైన జ్వరం, నీరసంతో మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ రణ్ దీప్ గులేరియా, ఎయిమ్స్ నేతృత్వంలో వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందించారు.
మన్మోహన్ సింగ్‌ను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇటీవల ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకుని త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్వయంగా వెళ్లి మన్మోహన్ సింగ్‌ను పరామర్శించారు.
మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19న కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ సమయంలో కూడా ఆయననను ఎయిమ్స్‌లో చేర్చారు. స్వల్పంగా జ్వరం వచ్చిన తర్వాత మన్మోహన్‌కు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. 2009లో మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు.
రెండుసార్లు ప్రధానిగా..
2004లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించారు. 2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలో యూపీఏ అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రధానిగా వ్యవహరించిన సమయంలోనే ఆయనకు ఒకసారి బైపాస్ సర్జరీ కూడా జరిగింది. కొన్ని నెలల విశ్రాంతి తీసుకున్న అనంతరం.. ఆయన తిరిగి విధుల్లో చేరారు. వయసు పెరిగిపోవడంతో ఇటీవలి కాలంలో రాజకీయాల్లో చురుకుగా లేరు.
Also Read: Pay In Bitcoin: క్రిప్టో కరెన్సీ క్రేజ్.. బిట్ కాయిన్ ఉంటే బేఫికర్.. ఈ రెస్టారెంట్లో అదిరే ఆఫర్
Also Read: China on Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై చైనా ఉక్కుపాదం.. నియంతృత్వం పోతుందని భయమేమో!
Also Read: ఉద్యోగం వద్దు బాబోయ్! లక్షల్లో రాజీనామాలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు!
Also Read: అద్భుతమైన సౌండ్‌బార్ కావాలా? బ్రాండెడ్ సౌండ్‌బార్లపై ఇప్పుడు 60 శాతం డిస్కౌంట్