అన్వేషించండి

Pay In Bitcoin: క్రిప్టో కరెన్సీ క్రేజ్.. బిట్ కాయిన్ ఉంటే బేఫికర్.. ఈ రెస్టారెంట్లో అదిరే ఆఫర్

క్రిప్టో కరెన్సీ ప్రజల రోజువారీ జీవితాల్లో ప్రవేశిస్తుంది. ఒక రెస్టారెంట్ లో క్రిప్టో కరెన్సీని అమలు చేయడమే దీనికి ఉదాహరణ. 

బిట్​కాయిన్​.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఎక్కువ మంది చర్చించుకుంటున్న విషయాల్లో ఇదీ ఒకటి. అయితే దీనిని ఓ రెస్టారెంట్ లో ప్రవేశపెట్టారు. అది ఎక్కడో కాదు.. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలోని ఆర్డర్ 2.1 అనే రూఫ్ టాప్ బార్, రెస్టారెంట్లో. గతవారం డిజిటల్ థాలీని.. వివిధ వంటలకు క్రిప్టో పేరుతో ప్రారంభించింది ఈ రెస్టారెంట్. ఇక్కడ కస్టమర్స్ బిట్ కాయిన్ లో చెల్లింపులు ఎంచుకోవచ్చు.

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ఆర్డర్ 2.1 రెస్టారెంట్  గ్లోబల్ డిష్ ప్లేట్‌లో వర్చువల్ కరెన్సీ చెల్లింపుపై 20 శాతం తగ్గింపు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇది డిజిటల్ చెల్లింపుల కాలమని.. వర్చువల్ కరెన్సీపై పెరుగుతున్న వ్యామోహం కారణంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు యజమాని సువీత్ కల్రా చెబుతున్నారు. Bitcoin, Dash, Dogecoin, Lightcoin, Etherium లలో వర్చువల్ కరెన్సీని చెల్లించవచ్చు.

'మేము క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపుపై 20 శాతం తగ్గింపును ఇస్తున్నాం. అయితే వినియోగదారులు ఎలాంటి తగ్గింపు లేకుండా నగదు, కార్డు లేదా పేటీఎం ద్వారా కూడా చెల్లించవచ్చు. క్రిప్టో కరెన్సీ ప్రస్తుతం చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి.. మేం కూడా దానిని వినియోగదారులు చెల్లించేలా ప్రయోగత్మకంగా చేపట్టాం. ఇది ఎలా పని చేస్తుందో చూడాలి.' అని రెస్టారెంట్ యాజమని చెప్పారు. 
వర్చువల్ కరెన్సీ ప్రింటెడ్ కరెన్సీ కాదు, ఇది టోకెన్. ఎలక్ట్రానిక్ రికార్డులు ఉన్నాయి. క్రిప్టోకరెన్సీ వెనక సెంట్రల్ బ్యాంక్ లేదు, ఇది కరెన్సీగా విలువ ఇవ్వబడదు. బెలారస్, ఎస్టోనియా క్రిప్టోకరెన్సీ చెల్లుబాటు అవుతుంది అని సైబర్ న్యాయవాది పవన్ దుగ్గల్ చెబుతున్నారు.

క్రిప్టో కరెన్సీ అంటే..

క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్​ (వర్చువల్) కరెన్సీ. ఇవి ప్రత్యేక సాఫ్ట్​వేర్​ కోడ్​ల ద్వారా పని చేస్తుంటాయి. సాధారణ కరెన్సీలు (రూపాయి, డాలర్​ వంటివి) భౌతికంగా చలామణి అవుతుంటాయి. క్రిప్టో కరెన్సీలు మాత్రం భౌతికంగా కనిపించవు, వాటిని ముట్టుకోలేం. ఇవి పూర్తిగా డిజిటల్​ రూపంలో మాత్రమే ఉంటాయి.పేరుకు తగ్గట్లుగానే.. క్రిప్టోగ్రఫీ, బ్లాక్​ చైన్​ సాంకేతికతలు క్రిప్టోకరెన్సీకి మూలాధారాలు. ప్రస్తుతం బిట్​కాయిన్​, ఇథీరియం, స్టెల్లార్, రిపుల్, డాష్​​ సహా పలు ఇతర క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉన్నాయి. వీటన్నింటిలో బిట్​కాయిన్​ అత్యంత ఆధరణ పొందిన క్రిప్టో కరెన్సీ.

బ్లాక్​ చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి?

క్రిప్టోకరెన్సీ ప్రస్తావన వచ్చినప్పుడు.. మనం చాలా సార్లు క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్, బ్లాక్​ చైన్ సాంకేతికత గురించి వింటూనే ఉన్నాం. బ్లాక్​చైన్​ అనేది డేటా బైస్​ ఆధారంగా పని చేసే ఓ ప్రత్యేక సాంకేతికత. ఇందులో సమాచారం అనేది బ్లాకులుగా విభజన చెంది.. అదంతా ప్రపంచవ్యాప్తంగా వేరువేరు సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. ఇలా ఒక సర్వర్​కు మరో సర్వర్​ అనుసంధానమై ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ చైన్ రూపంలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని ఎంతటి హ్యాకర్లయినా దొంగిలించడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే క్రిప్టోకరెన్సీలను ఎవరూ నియంత్రించడం కూడా జరగదు.

Also read: కరివేపాకును తీసిపడేయకండి... షుగర్ కు చెక్ పెట్టే దమ్మున్న ఆకు ఇది 

Also read:  చాలామందికి భోజనం చేసేటప్పుడు ఇదే సమస్య.. మీకూ ఉందా? తేలికగా తీసుకోకండి

Also read: ప్యాకెట్ పాలను మరగబెట్టాల్సిన అవసరం ఉందా? నేరుగా తాగొచ్చా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
Manchu Manoj : 'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
Manchu Manoj : 'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
Happy New Year 2026 : గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Mental Health : మానసిక ఆరోగ్యంపై 2025లో ఇండియాలో వచ్చిన మార్పులు, సవాళ్లు ఇవే
మానసిక ఆరోగ్యంపై 2025లో ఇండియాలో వచ్చిన మార్పులు, సవాళ్లు ఇవే
Andhra Pradesh Year Ender 2025: ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీలో 2025ది ప్రత్యేక స్థానం - ఇవిగో టాప్ టెన్ మైలురాళ్లు
ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీలో 2025ది ప్రత్యేక స్థానం - ఇవిగో టాప్ టెన్ మైలురాళ్లు
Embed widget