Curry leaf: కరివేపాకును తీసిపడేయకండి... షుగర్ కు చెక్ పెట్టే దమ్మున్న ఆకు ఇది
కరివేపాకంటే ఎంత చిన్న చూపో చాలా మందికి. వాటిని కనీసం ఓ ఆకుకూరగా కూడా గుర్తించరు. కరివేపాకులో ఉన్న సుగుణాలు తెలుసుకుంటే కోరి మరీ తింటారు.
కరివేపాకు దేనికి అని అడిగితే... ‘ఇంకెందుకు కాస్త సువాసన ,రుచి కోసం’ అని చెబుతారు ఎవరైనా. ఇంకొందరైతే సాంబారు, చారు పోపు కోసం చెబుతారు. కరివేపాకు పాత్ర మన ఆహారంలో, మన ఆరోగ్యంలో ఆ మాత్రమేనా. అందుకేనా అన్నం తింటున్నప్పుడు కరివేపాకు కనిపిస్తే ఏరి పక్కన పడేస్తాం? నిజానికి కరివేపాకు చేసే మేలు ఇంతా అంతా కాదు. అవగాహన లేకే దానికి వంటల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదు చాలా మంది. అందుకే కరివేపాకు తినడం కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చెప్పడం కోసమే ఈ ప్రత్యేక కథనం. ఇది చదివాక కరివేపాకును పక్కన పడేయలేరు. కరివేపాకు రైస్, కరివేపాకు పొడి... ఇలా కరివేపాకు వంటలు తినడం మొదలుపెడతారు.
ప్రపంచంలో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య డయాబెటిస్. దీని వల్లే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి. ఈ షుగర్ వ్యాధికి చెక్ పెట్టాలంటే అది కరివేపాకుకే సాధ్యం. ఇందులో కొయినిజన్ అనే రసాయనం ఉంటుంది. ఇది షుగర్ రోగులకు చాలా మేలు చేస్తుంది. డయాబెటిస్ రోగులు రోజూ కరివేపాకు తినడం చాలా అవసరం. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించే హైపో గ్లైసెమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. కరివేపాకు ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆహారం తిన్న వెంటనే కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ విచ్చిన్నం అయ్యే ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. తద్వారా రక్తంలో గ్లూకోజ్ ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేరకుండా నియంత్రిస్తుంది. దీని వల్ల డయాబెటిస్ రోగుల్లోని చక్కెర స్థాయులు నియంత్రణలోనే ఉంటాయి.
అంతేకాదు కొందరికి వారసత్వంగా కూడా షుగర్ వ్యాధి వస్తుంది. మరికొందరికి ఊబకాయం కారణంగా వస్తుంది. ఈ రెండింటి కారణంగా వచ్చే డయాబెటిస్ ను అరికట్టగల సత్తా కరివేపాకుకు ఉంది అని చెబుతోంది ఆయుర్వేదం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్యాక్టిరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. గర్భిణులు తరచూ కరివేపాకు తింటే చాలా మంచిది. వారిలో కలిగే వికారం, వాంతులు వంటి లక్షణాలను ఇది తగ్గిస్తుంది. ఇందుకోసం జీర్ణ ఎంజైమ్ లకు అధికంగా స్రవించేలా చేసి వాంతులు కాకుండా అడ్డుకుంటుంది.
Also read: పిల్లల్ని ఆడనివ్వండి... పెద్దయ్యాక డిప్రెషన్ బారిన పడరు
Also read: కరోనా వల్ల కొత్త సమస్య... సంతానోత్పత్తిపై కూడా ప్రభావం
Also read: ఇలాంటి చేప కనిపిస్తే ముచ్చటేసి పట్టుకోకండి... ప్రాణాలు పోతాయ్