అన్వేషించండి

New study: పిల్లల్ని ఆడనివ్వండి... పెద్దయ్యాక డిప్రెషన్ బారిన పడరు

పిల్లలు ఎంతగా ఆటలాడితే పెద్దయ్యాక వారి మానసిక ఆరోగ్యం అంత బాగుంటుందని చెబుతోంది కొత్త అధ్యయనం.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పిల్లలు చాలా నెలల పాటూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆటలకు, స్కూళ్లకు దూరమై ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇలా చిన్న వయసులోని పిల్లలు  శారీరకపరమైన ఆటలకు దూరమైతే ఆ ప్రభావం వారు యుక్తవయసుకు వచ్చాక పడుతుందని ఓ కొత్త అధ్యయనం తేల్చింది. ఎవరైతే చిన్న వయసులో రోజూ పరుగెత్తడం, గెంతడం, ఫుట్ బాల్ ఆడడం, క్రికెట్ ఇలా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ఆటలు ఆడుతారో వారు పెద్దయ్యాక డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యల బారిన తక్కువ పడతారు. ముఖ్యంగా అబ్బాయిల మీదే ఈ పరిశోధనే సాగింది. కెనడాకు చెందిన మాంట్రెయర్ యూనివర్సిటీలో ఈ అధ్యయనాలు జరిగాయి. 

ఈ అధ్యయనం ద్వారా మరో విషయం కూడా బయటపడింది. ఏ పిల్లలైతే పాఠశాల వయసులో తక్కువ మానసిక క్షోభకు గురవుతారో, వారు యుక్త వయసులో చాలా చురుకుగా ఉండడంతో పాటూ, మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ పిల్లలైతే ఇంటా బయటా మానసిక హింసకు గురవుతారో, వారు పెద్దయ్యాక డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు శారీరకంగా కూడా నీరసంగా ఉంటారని ఈ పరిశోధనా సారాంశం. అందుకే పిల్లల్ని ఎల్లప్పుడు చురుకుగా ఉంచేలా శారీరకపరమైన ఆటలు ఆడించాలి. రోజులో కనీసం గంట పాటూ ఆడినా చాలు, వారికి భవిష్యత్తులో మేలు జరుగుతుంది. 

నిజానికి గత ఏడాదిన్నరగా పిల్లలపై కనిపించకుండానే తీవ్రమైన మానసిక ఒత్తిడి కలుగుతున్నట్టు గుర్తించారు పరిశోధకులు. కరోనా కారణంగా వారి జీవన విధానంలో చాలా మార్పులు సంభవించాయి. పాఠశాలకు వెళ్లకపోవడం, ఆటలు లేకపోవడం, స్నేహితులను కలవకపోవడం... ఇంట్లోనే బందీలుగా మారడం ఇవన్నీ వారి చిన్ని మెదడుపై ప్రభావాన్ని చూపించాయని అంటున్నారు అధ్యయనకర్తలు. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: రొమ్ము క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? లక్షణాలేంటి? ఎలా చెక్ చేసుకోవాలి?

Also read: రాత్రి పడుకోబోయే ముందు ఈ టీ తాగితే... ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు

Also read: గర్భిణుల్లో హఠాత్తుగా వచ్చే డయాబెటిస్... జాగ్రత్త పడక తప్పదు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget