Packet Milk: ప్యాకెట్ పాలను మరగబెట్టాల్సిన అవసరం ఉందా? నేరుగా తాగొచ్చా?
ప్రస్తుత కాలంలో ప్యాకెట్ పాల వినియోగం చాలా అధికంగా ఉంది. కానీ వాటి గురించి అవగాహన ఉన్నది చాలా కొద్దిమందికే.
ప్యాకెట్ పాలు కొని తీసుకొచ్చాక బాగా మరగబెట్టాకే వాటిని తాగుతున్నాం. నిజానికి ఆ పాలను మరగబెట్టాల్సిన అవసరం లేదు. మరగబెట్టి, చల్లార్చాకే వాటిని ప్యాకెట్లలో వేసి అమ్ముతారు. కాబట్టి అధిక ఉష్ణోగ్రతల వద్ద మళ్లీ మరిగించాల్సిన అవసరం లేదు. కేవలం తాగడానికి వీలుగా గోరువెచ్చగా చేసుకుంటే చాలు. ఎక్కువ కాచడం వల్ల ప్యాకెట్ పాలల్లోని పోషకాలు ఇంకా తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయో తెలుసుకోవాలంటే ముందు ప్యాకెట్ పాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
ప్యాకెట్ పాలు పచ్చిపాలు కాదు, వాటిలో హానికారక సూక్షజీవులైన కొలై, సాల్మొనెల్లా, లిస్టిరియా మొదలైనవి ఉంటాయి. వాటిని చంపేందుకు అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగిస్తారు. ఆ తరువాత చల్లార్చి ప్యాక్ చేస్తారు. కొంతమంది వీటికి విటమిన్ ఎ, డిలను జోడిస్తారు. కచ్చితంగా వీటిని చేర్చాలన్న నియమం లేదు కానీ, ఎలాంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ కలపకూడదనే కఠిన నియమం అమలులో ఉంది. ఇలా ప్యాక్ చేసిన పాలనే పాశ్చరైజ్డ్ పాలు అంటారు. వీటిని ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకుంటే రెండు రోజుల పాటూ ఎలాంటి మార్పులు లేకుండా తాజాగా ఉంటాయి. ఫ్రిజ్ నుంచి బయటికి తీశాక వాటిని తిరిగి అధికంగా మరగబెట్టాల్సిన అవసరం లేకుండా గోరువెచ్చగా చేసుకుని తాగేసినా సమస్య ఉండదు. కానీ వాటిని ప్యాక్ చేసి మూడు రోజుల దాటిన తరువాత తాగాల్సి వస్తే మాత్రం కాసేపు మరిగించడం ఉత్తమం.
ఏవి మంచివి?
గ్రామాల్లో గేదెలు, ఆవులు పెంచుకునే వారి దగ్గర నుంచి పాలను కొనుక్కునే వాళ్లు ఉన్నారు. నిజానికి పాకెట్ పాలతో పోలిస్తే, అవే మంచివి. కాకపోతే వాటిని నేరుగా తాగకూడదు. మరిగించి తాగాలి. అప్పుడు అందులో ఉండే కొన్ని రకాల హానికర బ్యాక్టిరియాలు మరణిస్తాయి. ఇలాంటి పాలలో పేగుల ఆరోగ్యానికి అవసరమయ్యే ‘ప్రోబయాటిక్’ బ్యాక్టిరియా కూడా ఉంటుంది. ఇది అత్యవసరం. ఇక ప్యాకెట్ పాలలో పాశ్చరైజేషన్ వల్ల హానికర బ్యాక్టిరియాతో పాటూ కొన్ని మేలుచేసే బ్యాక్టిరియాలు, ఎంజైమ్ లు కూడా నాశనం అవుతాయి. ముఖ్యంగా ప్రోబయాటిక్ లు దాదాపు కనుమరుగవుతాయి. వాటిని మళ్లీ మళ్లీ మరగబెట్టడం మిగిలిన పోషకాలు కూడా నశించే అవకాశం ఉంది.
Also read: కూల్ డ్రింక్స్ తాగితే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందా?
Also read: కరివేపాకును తీసిపడేయకండి... షుగర్ కు చెక్ పెట్టే దమ్మున్న ఆకు ఇది
Also read: చాలామందికి భోజనం చేసేటప్పుడు ఇదే సమస్య.. మీకూ ఉందా? తేలికగా తీసుకోకండి