అన్వేషించండి
Advertisement
Nani 29: నాని ఊర మాస్ గెటప్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడే..
నాని 29వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. దసరా కానుకగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.
నేచురల్ స్టార్ నాని మరో కొత్త సినిమా మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. నాని 29వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. దసరా కానుకగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. దీనికి 'దసరా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'జమ్మి వెట్టి జెప్తాన్న బద్దల్ బాసిoగాలైతై, సూస్ కుందాం' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీన్ని బట్టి సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడతారని తెలుస్తోంది. టైటిల్ పోస్టర్ లో నాని ఊర మాస్ లుక్ తో అదరగొట్టాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
2019లో విడుదలైన 'జెర్సీ' సినిమా తరువాత నాని ఇప్పటివరకు సరైన సక్సెస్ ను అందుకోలేకపోయారు. ఆయన నటించిన 'గ్యాంగ్ లీడర్', 'వి', 'టక్ జగదీష్' లాంటి సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. 'వి', టక్ జగదీష్' రెండు సినిమాలు కూడా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ కూడా ఈ సినిమా రిజల్ట్ పై పడింది. సినిమాలకు బ్యాడ్ టాక్ వచ్చినా కూడా.. నిర్మాతలు లాభాలకే సినిమాలను ఓటీటీలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు.
ఇటీవల నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. సాయి పల్లవి, కృతిశెట్టి లాంటి హీరోయిన్లు నటించిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు 'అంటే సుందరానికి' అనే మరో సినిమా కూడా లైన్ లో పెట్టారు నాని. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Hi #Nani29 is #DASARA 🔥
— Nani (@NameisNani) October 15, 2021
జమ్మి వెట్టి జెప్తాన్న బద్దల్ బాసిoగాలైతై, సూస్ కుందాం
Here’s the #SirenOfDasara 💥
▶️https://t.co/lrHSBYjfhP
And our proud team @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @sathyaDP @NavinNooli @artkolla @kabilanchelliah @SLVCinemasOffl pic.twitter.com/GRdwhRUZsz
Also Read: రవితేజ డబుల్ ఇంపాక్ట్.. రష్మిక కొత్త లుక్..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion