Prabhas 'Spirit' Movie: పవర్‌ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా డార్లింగ్ …ఖాకీ డ్రెస్ లో ప్రభాస్ కటౌట్ చూస్తే..

పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్...ఇలా యంగ్ హీరోలంతా పోలీస్ డ్రెస్ లో దుమ్ముదులిపేశారు. ఇప్పుడు నా టర్న్ డార్లింగ్ అంటున్నాడు ప్రభాస్…

FOLLOW US: 

వరుస  పాన్ ఇండియన్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్.  ఇప్పటికే ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్'  ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.  రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌.  అటు  కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  'సలార్'  సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో  శ్రుతిహాసన్ హీరోయిన్ . మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇందులో కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా డార్లింగ్ స్పీడ్ చూసి ఆశ్చర్యపోతున్నారంతా. అభిమానులైతే పండుగ చేసుకుంటున్నారు. ఈ మూడు భారీ ప్రాజెక్టులు మాత్రమే కాదు మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా సైన్ చేస్తున్నాడు.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీ అంటున్నారు. మరోవైపు ప్రభాస్ 25వ సినిమాగా ‘స్పిరిట్’ టైటిల్ ఖరారు చేశారు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకడు. ప్రభాస్ ప్రాజెక్ట్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఈ సినిమా పైనే జరుగుతోంది. ఎందుకంటే 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్  పవర్ ఫుల్  పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్.
Also Read: ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ వీడు.. నవ్వులు పూయిస్తోన్న ’మంచి రోజులొచ్చాయి’ ట్రైల‌ర్
ప్రభాస్-సందీప్ వంగా కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాలో ఫ్యాన్స్ ని మెప్పించేలా ప్రభాస్ ఉంటాడని చెబుతున్నారు.  ఇప్పటివరకూ టాలీవుడ్ క్రేజీ హీరోలంతా ఖాకీ చొక్కా వేశారు. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్, టెంపర్ ఎన్టీఆర్, రేసుగుర్రంలో కొద్దిసేపు అల్లు అర్జున్, దూకుడుృ-ఆగడులో మహేశ్ బాబు , అప్పుడు తుఫాన్-ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లోనూ రామ్ చరణ్ ఇలా టాలీవుడ్ హీరోలంతా ఖాకీ చొక్కా వేశారు.  ప్రభాస్  ఓ రెండు సినిమాల్లో  పోలీసులకు సహకరించే పాత్రలు చేశాడుగానీ ఖాకి డ్రెస్ మాత్రం వేయలేదు. అందుకే డార్లింగ్ ని పోలీస్ డ్రెస్ లో చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. పైగా హీరోని ఊరమాస్ గా చూపించే సందీప్ దర్శకత్వంలో అంటే ఇక మామూలుగా ఉండదంటున్నారు. దీంతో పోలీస్ గా ప్రభాస్ అన్న వార్తే ఫుల్  కిక్కిస్తోందంటున్నారు. 
Also Read: 'దండుపాళ్యం' గ్యాంగ్ తో 'తగ్గేదే లే'..వరుస మర్డర్స్, నో ఎవిడెన్స్
ఇక హీరోయిన్స్ విషయానికొస్తే ఇప్పటికే సెట్స్ పై ఉన్న సినిమాల్లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే, శ్రుతిహాసన్,  కృతి సనన్ నటిస్తుండడంతో 'స్పిరిట్', నాగ్ అశ్విన్ సినిమాల కోసం రష్మిక , కీర్తి సురేశ్,  కియారా అద్వానీలలో ఒకరికి ఛాన్స్  దక్కొచ్చంటున్నారు.  'సలార్', 'ఆది పురుష్' తర్వాత నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయట. ఈ సినిమా తర్వాత 'స్పిరిట్' సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు. 
Also Read:హౌస్‌మేట్స్‌కు షాకిచ్చిన బిగ్‌బాస్... ఆ చిన్న తప్పు కారణంగా ఈ వారం హౌస్‌కి కెప్టెన్ లేనట్టేనా?
Alos Read: రజినీకాంత్ కు బయ్యర్ దొరికేశాడు.. 'అన్నాత్తే' తెలుగు రైట్స్ ఎంతో తెలుసా..
Also Read: యానీ మాస్టర్ తో ఫైట్.. పిల్లో అడ్డం పెట్టుకొని ఏడ్చేసిన శ్వేతా..
Also Read: శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఎందుకంత ప్రత్యేకం, దశమి రోజు ఈ శ్లోకం రాసి జమ్మిచెట్టుకి కడితే…
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Oct 2021 01:01 PM (IST) Tags: Radhe Shyam Salaar Adipurush Rebel Star Prabhas Police Officer 'Spirit' Movie Prabhas project

సంబంధిత కథనాలు

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు  అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం