అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: యానీ మాస్టర్ తో ఫైట్.. పిల్లో అడ్డం పెట్టుకొని ఏడ్చేసిన శ్వేతా..
ఈరోజు ఎపిసోడ్ లో రవి-లోబో-శ్వేతా టీమ్ కి స్పెషల్ పవర్ లభించింది. దాని ప్రకారం.. అవతలి టీమ్ దగ్గర ఉన్న బొమ్మలన్నీ తీసేసుకోవచ్చు. ఆ పవర్ ఎవరిపై చూపించారంటే..?
'బిగ్ బాస్' సీజన్-5 రసవత్తరంగా సాగుతోంది. తాజాగా 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ తన ఇంటి సభ్యుల్ని నాలుగు గ్రూప్‌లుగా విడగొట్టారు. సిరి, కాజల్ లను సంచాలకులుగా నియమించారు. ఈరోజు కూడా ఈ టాస్క్ కంటిన్యూ అయింది.
రవి-లోబో-శ్వేతా టీమ్ కి స్పెషల్ పవర్ లభించింది. దాని ప్రకారం.. అవతలి టీమ్ దగ్గర ఉన్న బొమ్మలన్నీ తీసేసుకోవచ్చు. దీంతో రవి అండ్ కో.. యానీ మాస్టర్-మానస్-సన్నీల టీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. దీంతో యానీమాస్టర్ వెళ్లి శ్వేతా దగ్గర నుంచి బొమ్మలు లాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో శ్వేతాకి కోపం వచ్చింది. 'నేను నిన్ను జబర్దస్తీ చేశానా..?' అని శ్వేతాను ప్రశ్నించింది యానీ. దానికి అవునంటూ సమాధానం చెప్పింది శ్వేతా. దీంతో యానీ మాస్టర్ ఎమోషనల్ అయింది. 'లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్ పోయాడు, ఈ టాస్క్‌లో బిడ్డ పోయింది. ఈ తొక్కలో రిలేషన్‌షిప్ నాకొద్దు' అంటూ శ్రీరామ్-విశ్వలతో చెప్పుకొని బాధపడింది యానీ. రాత్రయ్యేసరికి యానీ మాస్టర్, శ్వేతా మాట్లాడుకొని నార్మల్ అయిపోయారు.
రవి అంత క్రిమినల్ మైండ్ చూడలేదంటూ మానస్ కి చెప్పాడు సన్నీ. ఆ తరువాత యానీతో రవి-లోబో డిస్కషన్ పెట్టారు. లోబోపై యానీ సీరియస్ అయింది. దీంతో మానస్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. మరోపక్క శ్వేతా పిల్లో అడ్డం పెట్టుకొని ఏడ్చేసింది.
ఆ తరువాత మానస్ తో ప్రియాంక మాట్లాడింది. 'నీ దగ్గర నేనెప్పుడైనా బోర్డర్ క్రాస్ చేసినట్లు అనిపించిందా..?' అని ప్రశ్నించింది ప్రియాంక. దానికి మానస్ లేదని చెప్పాడు. 'పదే పదే ఇదే క్వశ్చన్ అడిగి నువ్ ఇబ్బంది పడకు.. నన్ను ఇబ్బంది పెట్టకు' అని మానస్ చెప్పగా.. ప్రియాంక ఎమోషనల్ అయి ఏడ్చేసింది.
తెల్లవారుజామున మళ్లీ గేమ్ మొదలుపెట్టారు. ముందుగా సన్నీ.. 'ఇదేందిరా భాయ్.. తొక్కలో ఆట' అంటూ ఫైర్ అయ్యాడు. 'ఎందుకలా అరుస్తారు సంచాలక్ మీద' అంటూ సిరి కోప్పడింది.
ఆ తరువాత సన్నీ తనను కావాలనే రెచ్చగొడుతున్నాడని సిరి అనగా.. కాజల్ సారీ చెప్పమని సన్నీని అడిగింది. 'నేను చెప్ప.. ఏం చేసుకుంటావో చేస్కో పో..' అంటూ కామెంట్ చేశాడు. అందరి ముందు తనపై అరిచాడని.. 'నాకు అందరి ముందు సారీ కావాలి' అని సన్నీను డిమాండ్ చేసింది సిరి. కానీ సన్నీ మాత్రం సారీ చెప్పలేదు. ఆ తరువాత కాజల్.. 'మేం పెట్టిన రూల్ ని అధిగమించి కాటన్ లాక్కున్నందుకు గ్రీన్ టీమ్ నుంచి ఒకరు, ఎల్లో టీమ్ నుంచి ఒకరు ముందు నుంచుంటారని' చెప్పింది. దానికి ప్రియా.. 'మేం ఒప్పుకోమని' అంది. దానికి సిరి.. 'ఇది సంచాలక్ గా ఫైనల్ డెసిషన్' అనుకుంటూ వెళ్లిపోయింది. 'నిన్న అందరూ లైన్ క్రాస్ చేసి ఆడినప్పుడు సంచాలక్ లు ఏం పీకుతున్నారని' ప్రశ్నించింది ప్రియా. 'మా ఇష్టమొచ్చినట్లు మేం చేసుకుంటాం' అని కాజల్ అనగా.. 'సరే ఇదే మాట మీద ఉండు' అంటూ ప్రియా చెప్పింది.
ఇక సిరి ఎమోషనల్ అవుతుండగా.. షణ్ముఖ్ ఆమెని హత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక సన్నీ కెమెరా ముందుకెళ్లి కెప్టెన్ డ్రెస్ వేసుకుంటా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. 'స్పెషల్ పవర్ ఇవ్వాలి నాకు.. అప్పుడు తిప్పుతా గేమ్' అంటూ ప్రియా డైలాగ్ వేసింది.
Also Read: ‘బిగ్ బాస్’లో తల్లీకూతుళ్ల వార్.. తొక్కలో రిలేషన్‌షిప్ వద్దంటూ ఆనీ కన్నీళ్లు
Also Read: ‘పంచతంత్రం’ టీజర్.. ముసలి తాబేలు చెప్పే మన కథలు.. బ్రహ్మీ ఈజ్ బ్యాక్!
Also Read: ‘పుష్ప’ నుంచి సెకండ్ సింగిల్ శ్రీవల్లి ఫుల్ సాంగ్ ఇదిగో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion