Manchi Rojulochaie : 'ఏక్ మినీ కథ' తర్వాత ' మంచి రొజులొచ్చాయి' .. సంతోష్ శోభన్ కి కలిసొచ్చేనా..!
'ఏక్ మినీ కథ' లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన సంతోష్ శోభన్ లేటెస్ట్ మూవీ 'మంచి రోజులొచ్చాయి'పై చాలా ఆశలు పెట్టుకున్నాడట...
ఆరంభంలో అదోరకం సినిమాలకు కేరాఫ్ అనిపించుకున్న దర్శకుడు మారుతి 'భలే భలే మగాడివోయ్` సినిమా నుంచి రూటు మార్చారు. ప్రేమకథాచిత్రం, మహానుభావుడు లాంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ బ్రాండ్ ఉందని నిరూపించుకున్నారు. ఇప్పుడు మారుతి లేటెస్ట్ మూవీ 'మంచి రోజులొచ్చాయి'. టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ,మెహరీన్ నటించిన ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించడమే కాదు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది దీంతో ఈ సినిమా కూడా తనకు మంచి సక్సెస్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు సంతోష్ శోభన్.
'తను నేను', 'పేపర్ బాయ్' సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన సంతోష్ శోభన్ ఏక్ మినీ కథతో మెప్పించాడు. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది. అయితే ఏక్ మినీ కథ సినిమా బయటికి రాకముందే ఈ కుర్రాడు వరుస సినిమాలను లైన్లో పెట్టేయడం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో .. వైజయంతీ మూవీస్ బ్యానర్లో .. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సంతోష్ శోభన్ సినిమాలకు సైన్ చేసేశాడు. సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అభిషేక్ మహర్షి అనే నూతన దర్శకుడితో ఓ సినిమా, నందినీ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా ఇలా మరికొన్ని ప్రాజెక్టులు కూడా సంతోష్ లైన్లో పెట్టాడు. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో వస్తోన్న'మంచిరోజులొచ్చాయి' తో మరో హిట్ అందుకుని తదుపరి సినిమాలకు మరింత క్రేజ్ పెంచుకుంటా అంటున్నాడు. 'మై వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్..నా పేరు సంతోష్..ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ వీడు' అనేది నా ట్యాగ్‌లైన్..అంటూ సంతోష్ శోభన్ తనను తాను పరిచయం చేసే సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది. ప్రతీ సిసినిమాలో హీరోలకు ఏదో లోపం ఉందన్నట్లు చూపించే మారుతి ఈసారి హీరోయిన్ తండ్రికి ఏదో వింత వ్యాధి ఉన్నట్లు చూపించారు.
ఎస్‌కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మించిన మూ మూవీని కాలనీ సెటప్ లో కేవలం 30రోజుల్లో తెరకెక్కించారట. ఇటీవల విడుదలైన 'సోసోగా ఉన్నాననీ' లిరికల్ వీడియో ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో తనకు 'మంచిరోజులొచ్చాయి' అని ఫిక్సైపోయాడు సంతోష్ శోభన్. ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది.
Also Read: 'దండుపాళ్యం' గ్యాంగ్ తో 'తగ్గేదే లే'..వరుస మర్డర్స్, నో ఎవిడెన్స్
Also Read:హౌస్‌మేట్స్‌కు షాకిచ్చిన బిగ్‌బాస్... ఆ చిన్న తప్పు కారణంగా ఈ వారం హౌస్‌కి కెప్టెన్ లేనట్టేనా?
Alos Read: రజినీకాంత్ కు బయ్యర్ దొరికేశాడు.. 'అన్నాత్తే' తెలుగు రైట్స్ ఎంతో తెలుసా..
Also Read: యానీ మాస్టర్ తో ఫైట్.. పిల్లో అడ్డం పెట్టుకొని ఏడ్చేసిన శ్వేతా..
Also Read: శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఎందుకంత ప్రత్యేకం, దశమి రోజు ఈ శ్లోకం రాసి జమ్మిచెట్టుకి కడితే…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి