News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

BiggBoss5 : హౌస్‌మేట్స్‌కు షాకిచ్చిన బిగ్‌బాస్... ఆ చిన్న తప్పు కారణంగా ఈ వారం హౌస్‌కి కెప్టెన్ లేనట్టేనా?

బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి గట్టిగానే షాకివ్వబోతున్నట్టు కనిపిస్తున్నాడు బిగ్ బాస్. ఈసారి హౌస్ కి కెప్టెన్ ఉంటారా లేదా అనే సందేహం వస్తోంది ప్రోమో చూస్తుంటే.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ 5 సీజన్ మొదటి వారం నుంచే వాడీ వేడిగా సాగుతోంది. రోజుల గడిచేకొద్దీ ఎసిసోడ్లు రసవత్తరంగా మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం హౌస్ లో ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ పేరుతో కెప్టెనీ టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ విషయంలో గురువారం ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి గట్టి షాకే ఇవ్వబోతున్నట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఈ వారం హౌస్ కి కెప్టెన్ లేకుండా చేయడమో లేక కొంతమందిని అనర్హులుగా ప్రకటించడమో చేయచ్చు అని అర్థమవుతుంది. ప్రోమోలో ఏముందంటే...

సంచాలకులుగా వ్యవహరిస్తున్న సిరి, కాజల్ బొమ్మలు లెక్కపెట్టే పనిలో ఉన్నారు. కాజల్ కొన్ని బొమ్మలు లెక్కలోకి తీసుకోకపోయేసరికి శ్వేత ఇవన్నీ మీరు ముందే ఓకే చేసినవని చెబుతుంది. దానికి కాజల్ ‘మీరు వాటిని కాపాడుకోలేకపోయారు’ అని చెబుతుంది. అయితే కాజల్ నిర్ణయం మరో సంచాలక్ సిరికి కూడా నచ్చకపోవడంతో ప్రశ్నిస్తుంది.  కాజల్ మాత్రం సంచాలక్ గా తన పని తాను చేస్తున్నట్టు గట్టిగా సమాధానమే ఇచ్చింది. మధ్యలో రవి కల్పించుకుని ‘సంచాలకులుగా నీ పవర్ ను నువ్వు మిస్ యూస్ చేస్తున్నావ్’ అని అంటాడు. లోబో కూడా కాజల్ లో వాదనకు దిగుతాడు. ఏమైందో తెలియదు గానీ బిగ్ బాస్  మాత్రం గట్టిషాకే ఇచ్చాడు హౌస్ మేట్స్‌‌కి.   ‘కొంతమంది ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఇంటి అతి ముఖ్యమైన నియమాన్ని ఉల్లంఘించడం జరిగింది... కెప్టెన్సీ పోటీదారులయ్యేందుకు అనర్హులుగా బిగ్ బాస్ ప్రకటిస్తున్నారు’ అని బిగ్ బాస్ చెప్పగానే ఇంటి సభ్యులంతా షాక్ అయ్యారు. వారి  ముఖాలను చూస్తుంటే, సభ్యుల ఆటకు తగ్గట్టు బిగ్ బాస్ గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. ముఖ్యంగా సంచాలకురాలైన సిరి ఎక్కువ ఫీలైంది. 

అయితే కొంతమందిని మాత్రమే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కు అనర్హులుగా ప్రకటించారా లేక ఈ వారం మొత్తం కెప్టెన్ లేకుండా చేశారా అనేది మాత్రం క్లారిటీ లేదు. అందరూ షాక్ లో ఉంటే... బ్లూటీమ్ సభ్యులైన మానస్, సన్నీ, యానీ మాస్టర్ లు మాత్రం  ఆనందంలో చిందులు వేశారు. దీన్ని బట్టి రెడ్ టీమ్, గ్రీన్ టీమ్ సభ్యులకు బిగ్ బాస్ నిర్ణయం వల్ల నష్టం జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. గురువారం ఎపిసోడ్ చూస్తే కథ మొత్తం అర్థమవుతుంది. 

Also read: కాఫీ అధికంగా తాగుతున్నారా... ఆల్కహాల్ కంటే ప్రమాదం

Also read: పెరుగుతో పాటూ వీటిని తింటే... ఎంత ఆరోగ్యమో

Also read: మనీ ప్లాంట్ లేదా కాయిన్ ప్లాంట్... రెండింటిలో ఏది పెంచితే మీ ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Oct 2021 11:12 AM (IST) Tags: Biggboss 5 Promo Telugu Biggboss Biggboss Housemates

ఇవి కూడా చూడండి

Bigg Boss Promo: బ్యాంక్ గా మారిన బిగ్ బాస్ హౌస్- నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ!

Bigg Boss Promo: బ్యాంక్ గా మారిన బిగ్ బాస్ హౌస్- నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ!

Month Of Madhu Trailer : ఇండియన్ భార్యాభర్తల మధ్యలో అమెరికన్ అమ్మాయి - నెలలో ఏమైంది మధు?

Month Of Madhu Trailer : ఇండియన్ భార్యాభర్తల మధ్యలో అమెరికన్ అమ్మాయి - నెలలో ఏమైంది మధు?

Gruhalakshmi September 27th: విక్రమ్ ప్రేమకు దివ్య ఫిదా - తులసిని చంపేస్తానని నందుని బెదిరించిన రత్నప్రభ

Gruhalakshmi September 27th:  విక్రమ్ ప్రేమకు దివ్య ఫిదా -  తులసిని చంపేస్తానని నందుని బెదిరించిన రత్నప్రభ

Krishna Mukunda Murari September 27th: మురారితో తాళి కట్టించుకుంటానన్న ముకుంద - కృష్ణ ఏం చేయబోతోంది!

Krishna Mukunda Murari September 27th:  మురారితో తాళి కట్టించుకుంటానన్న ముకుంద - కృష్ణ ఏం చేయబోతోంది!

Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?

Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?

టాప్ స్టోరీస్

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక

రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక

ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌తో భారత్‌కి సంబంధం లేదు, నిజ్జర్ హత్యపై జైశంకర్ క్లారిటీ

ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌తో భారత్‌కి సంబంధం లేదు, నిజ్జర్ హత్యపై జైశంకర్ క్లారిటీ