అన్వేషించండి
Advertisement
Annaatthe: రజినీకాంత్ కు బయ్యర్ దొరికేశాడు.. 'అన్నాత్తే' తెలుగు రైట్స్ ఎంతో తెలుసా..
'అన్నాత్తే' సినిమా తెలుగు హక్కులను నారాయణ్ దాస్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్-దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ సినిమా 'అన్నాత్తే'. ఈ సినిమాకి కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమాలో రజినీకాంత్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సాధారణంగా రజినీకాంత్ సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సినిమాకి తెలుగులో బయ్యర్ దొరకడం చాలా కష్టమైంది. ఎందుకంటే రజినీకాంత్ నటించిన 'దర్బార్', 'పేట', 'కాలా' లాంటి సినిమాలు తెలుగులో డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో 'అన్నాత్తే' సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకురాలేదు.
కానీ ఫైనల్ గా ఈ సినిమా తెలుగు హక్కులను నారాయణ్ దాస్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం మొత్తం రూ.12 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతేకాదు.. తెలుగులో ఈ సినిమాకి 'పెద్దన్న' అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. దీపావళి కానుకగా నవంబర్ 4న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది.
ఇప్పటివరకు అయితే తెలుగులో దీపావళికి పెద్ద సినిమాలేవీ లేవు. కాబట్టి ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా అన్నాచెల్లెళ్ల అనుబంధం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. రజినీకాంత్ సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇక రజినీకాంత్ కి జోడీగా నయనతార నటిస్తోంది. మీనా, కుష్బూ లాంటి పేరున్న నటీనటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
Top Distribution house of Tollywood, #NarayandasNarang & @SBDaggubati’s @AsianCinemas_ have bagged the Telugu & Tamil Distribution Rights in both AP & TS of SuperStar @rajinikanth’s Much Awaited film #Annaatthe🔥
— Vamsi Kaka (@vamsikaka) October 13, 2021
MASSive Release Guaranteed on
NOV4th🤟@AsianSuniel @sunpictures pic.twitter.com/Dc7HZxFz4b
Also Read: ‘బిగ్ బాస్’లో తల్లీకూతుళ్ల వార్.. తొక్కలో రిలేషన్షిప్ వద్దంటూ ఆనీ కన్నీళ్లు
Also Read: ‘పంచతంత్రం’ టీజర్.. ముసలి తాబేలు చెప్పే మన కథలు.. బ్రహ్మీ ఈజ్ బ్యాక్!
Also Read: ‘పుష్ప’ నుంచి సెకండ్ సింగిల్ శ్రీవల్లి ఫుల్ సాంగ్ ఇదిగో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion