అన్వేషించండి

Sai Dharam Tej: తేజు ఇంటికి చేరాడు.. మేనల్లుడి ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్..

ఈరోజు తేజు పుట్టినరోజు. పైగా దసరా.. ఈ సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేసింది మెగాఫ్యామిలీ.

సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ నుంచి కిందకు పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను నగరంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్మెంట్ అందించారు.
 
ఈరోజు తేజు పుట్టినరోజు. పైగా దసరా.. ఈ సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేసింది మెగాఫ్యామిలీ. తేజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు చిరంజీవి వెల్లడించారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెబుతూ సోషల్ మీడియాలో ఓ లెటర్ ను షేర్ చేశారు. అందులో ఏముందంటే.. 
 
''అనుకోని రీతిలో ప్రమాదం బారిన పడి గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ కోలుకొని ఈరోజు క్షేమంగా ఇంటికి చేరాడు. విజయ దశమి పర్వదినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావడం మా కుటుంబం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు తేజు పుట్టినరోజు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకొని ప్రేక్షకుల అభిమానాలు మరింతగా పొందాలను శక్తిస్వరూపిణిని ప్రార్థిస్తున్నాను. తేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అభిమానులు ఎంతో బాధపడి.. తేజ్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయాల్లో, ప్రార్థన మందిరాల్లో పూజలు చేశారు. వారందరి ప్రార్థనలు ఫలించాయి. ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని తెలియజేశారు.  
 
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తున్నారు. అలానే 'హరిహర వీరమల్లు' సినిమా లైన్లో ఉంది. వీటితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget