Tollywood Updates: సమంత బైలింగ్యువల్ సినిమా.. 'జై భీమ్' టీజర్ తో అదరగొట్టిన సూర్య..
తన భర్త నాగచైతన్యతో విడిపోతున్నట్లు అనౌన్స్ చేసిన సమంత వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. తాజాగా ఈ బ్యూటీ బైలింగ్యువల్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సమంత బైలింగ్యువల్ సినిమా..
ఈ మధ్యనే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. రీసెంట్ గా ఓ బాలీవుడ్ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ బైలింగ్యువల్ సినిమాలో కనిపించడానికి సిద్ధమైపోయింది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. సమంత ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు శాంతరూబేన్ జ్ఞానశేఖరన్ బైలింగ్యువల్ సినిమాను రూపొందించబోతున్నాడు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించబోతున్నారు. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
The committed Producers of #Khaidi & Upcoming film #OkeOkaJeevitham, @DreamWarriorpic’s Production No.30, a bilingual project with @Samanthaprabhu2 & To be directed by debutant @shantharuban87 #HappyDussehra
— BA Raju's Team (@baraju_SuperHit) October 15, 2021
More details soon! @prabhu_sr pic.twitter.com/uzMwweZ3Ln
Also Read: నాని ఊర మాస్ గెటప్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడే..
'జై భీమ్' టీజర్ తో అదరగొట్టిన సూర్య..
వరుస సినిమాలతో అదరగొడుతున్న సూర్య ప్రస్తుతం 'జై భీమ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ బయటకొచ్చింది. తక్కువ జాతి, అణగారిన కుటుంబాల కోసం పాటుపడే లాయర్ గా సూర్య టీజర్ లో కనిపించారు. ఒక్క టీజర్ తోనే ఇంపాక్ట్ చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టీజర్ లో వినిపించిన కొన్ని డైలాగ్స్, సూర్య సీరియస్ లుక్ హైలైట్స్ గా నిలిచాయి. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. తమిళంలో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
Here’s the Powerful #JaiBhim Teaser!
— Ramesh Bala (@rameshlaus) October 15, 2021
Tamil - https://t.co/JvMtvXTBHR
Telugu - https://t.co/SHezArHQDj
Watch #JaiBhimOnPrime Nov 2 @PrimeVideoIN@Suriya_offl #Jyotika @tjgnan @prakashraaj @RSeanRoldan @srkathiir @rajisha_vijayan @jose_lijomol @rajsekarpandian @2D_ENTPVTLTD pic.twitter.com/5Fbnq7LvEX
Also Read: సిరిపై మండిపడ్డ యానీ మాస్టర్.. వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో..?
Also Read: రవితేజ డబుల్ ఇంపాక్ట్.. రష్మిక కొత్త లుక్..