Squid Game: ఇది లోబడ్జెట్ ‘స్క్విడ్ గేమ్’.. అదరగొట్టేసిన పిల్లలు.. కొరియన్ వెబ్‌సీరిస్ రికార్డుల మోత!
ప్రపంచంలోనే బెస్ట్ వెబ్ సీరిస్‌గా ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న ‘స్క్విడ్ గేమ్’.. దీన్ని పిల్లలతో మాత్రం చూడకండి.
నిన్నటివరకు స్పానిష్ వెబ్‌సీరిస్ ‘మనీ హీస్ట్’(Money Heist)తో రికార్డులతో బుల్లితెర రంగంలో నెంబర్ వన్ ఓటీటీగా దూసుకుపోతున్న ‘నెట్ ఫ్లిక్స్’ (Netflix) ఇప్పుడు కొరియన్ వెబ్‌సీరిస్ ‘స్క్విడ్ గేమ్’(Squid Game)తో ప్రేక్షకులను మైమరపిస్తోంది. నిరుపేదల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించడమే కాదు.. వారి ప్రాణాలతో సంపన్నులు ఆడే భయానకమైన ఆటను చూస్తే.. కళ్లు చెమర్చడమే కాదు.. కాళ్లు చేతులు వణికిపోతాయి. ఇందులో ఆటలన్నీ చూసేందుకు చిన్న పిల్లల గేమ్స్‌లా ఉంటాయి. కానీ, చిన్న తేడా వచ్చిన ప్రాణాలు పోతాయ్. ఈ సీరిస్ గురించి మాటల్లో చెప్పడం చాలా కష్టం. దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. అసలైన థ్రిల్ కలుగుతుంది.
‘మనీ హీస్ట్’ తరహాలోనే ఈ వెబ్‌సీరిస్‌కు కూడా ఇప్పుడు నెట్టింట బోలెడంత క్రేజ్ లభిస్తోంది. దీనిపై ఇప్పటికే మీమ్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజుల కిందట అబుదాబిలో కొరియా కల్చర్ సెంటర్‌లో ‘స్క్విడ్ గేమ్’ వెబ్‌సీరిస్ గేమ్స్ నిజ జీవితంలో ఆడితే ఎలా ఉంటుందో చూపించారు. హింస లేకుండానే చాలా చక్కగా ఈ ఆట ఆడారు. తాజాగా నైజీరియాలో కొందరు పిల్లలు.. ఒరిజినల్ వెబ్‌సీరిస్‌లోని ఓ సన్నివేశం, ట్రైలర్లకు పేరడీ చేశారు. ఆ వీడియో చూసి నెటిజనులు ఫిదా అవుతున్నారు. పేద దేశమైన నైజీరియా పిల్లలు తమకు అందుబాటులో ఉన్న వస్తువులు, మేకప్‌తో చాలా క్రియేటివ్‌గా ఈ సీరిస్‌లోని సన్నివేశాలను చూపించేందుకు ప్రయత్నించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ikorodu_bois ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ లభించాయి. ఆ వీడియోను ఇక్కడ చూసేయండి.
View this post on Instagram
Squid Game.. సెప్టెంబరు 17 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరిస్ మొదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచంలోనే నెంబర్ వన్ సీరిస్‌గా నిలిచింది. ‘మనీ హీస్ట్’ కంటే అతి పెద్ద రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 28 రోజుల్లోనే ఈ వెబ్‌సీరిస్‌ను సుమారు 11 కోట్ల మందికి పైగా వీక్షించారంటే.. ఈ వెబ్‌సీరిస్ ఏ స్థాయిలో దూసుకెళ్తోందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని హిందీలోకి కూడా అనువాదించడం వల్ల ఇండియాలో కూడా మాంచి క్రేజ్ లభిస్తోంది. ఈ వెబ్‌సీరిస్ వల్ల 900 డాలర్లు లాభం లభించినట్లు సమాచారం. ఈ వెబ్‌సీరిస్ మొత్తం నిడివి 8.12 గంటలు. మొత్తం 9 ఎపిసోడ్స్‌గా దీన్ని ప్రసారం చేస్తున్నారు.
Also Read: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు
Also Read: అందుకే పవన్‌తో మాట్లాడలేదు.. ఎవరుపడితే వాళ్లు ‘మా’లో సభ్యులు కాకూడదు: విష్ణు
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి