Kota Srinivasa Rao: నాగబాబు గొప్ప నటుడేమీ కాదు.. చిరు, పవన్ లేకపోతే..: కోట శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు
‘మా’ ఎన్నికలు సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలకు కోటా శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. నాగబాబు గొప్ప నటుడేమీ కాదని వ్యాఖ్యనించారు.

‘జబర్దస్త్’ యాంకర్ అనసూయపై కామెంట్లు చేసిన కోటా శ్రీనివాసరావు.. ఈసారి నాగబాబును టార్గెట్ చేసుకున్నారు. ‘మా’ ఎన్నికలు సందర్భం విష్ణు ప్యానల్ చేసిన సన్మాన కార్యక్రమంలో కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్‌తో కలిసి తాను 15 సినిమాలకు పైగా చేశానని.. ఒక్కసారి కూడా ఆయన షూటింగ్‌కు సమయానికి రాలేదని అన్నారు. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఏం చేస్తాడని కోట అన్నారు. దీనిపై నాగబాబు స్పందిస్తూ కోటాపై విమర్శలు చేశారు. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదని, రేపోమాపో పోయే కోట ఇంకా ఎప్పుడు మారతాడని అన్నారు. ఈ సందర్భంగా కోటా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగబాబు వ్యాఖ్యలను విమర్శించారు.
‘‘చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే ఈ నాగబాబు ఎవరు? వారే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి మామూలు నటుడు మాత్రమే. అతనేం ఉత్తమ నటుడు కాదు, గొప్ప నటుడు కూడా కాదు. గతంలో నాగబాబు ప్రకాశ్ రాజ్‌ను తిట్టారని అందరికి తెలుసు. నేను ప్రకాశ్ రాజ్‌ను ఏదో అన్నానని ఇప్పుడు ఆయన నాపై విమర్శలు చేశారు. అపుడు నేను ఆయనను ఏమైనా అన్నానా? నాగబాబు నాపై చేసిన వ్యాఖ్యలపై అప్పుడే నేను స్పందించి ఉంటే టీవీల్లో, చానల్లో చర్చలతో రచ్చ జరిగేది. చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే నాగబాబుకు గుర్తింపులే లేదు’’ అని అన్నారు.
Also Read: ‘అంత దిగజారి మాట్లాడతారా?’.. కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యలపై అనసూయ ఫైర్
ఇటీవల ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు చెందిన యాంకర్ అనసూయ మీద కూడా కోటా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారుు. ‘జబర్దస్త్’ షో గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించారు. ఆ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న అనసూచ మంచి నటి, డ్యాన్సర్, మంచి పర్శనాలిటీ, మంచి ఎక్స్‌ప్రెషన్స్ పలికించగలదు. కానీ, ఆమె ఆ ప్రోగ్రామ్‌లో వేసుకొనే దుస్తులు నాకు నచ్చవు. అలాంటి అందమైన ఆవిడా ఎట్లా వచ్చినా ఎందుకు చూడరండి.. చక్కగా చూస్తారు. రోజా చక్కగా దుస్తులు వేసుకుని వస్తుంటే చూడటం లేదా?’’ అని కోటా అన్నారు. ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనసూయ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అనసూయ ఇటీవల ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసి విజయం సాధించింది. అయితే, కోటా శ్రీనివాసరావు మంచు విష్ణు ప్యానల్‌కు మద్దతు తెలిపారు. అయితే, ఆ ఎన్నికలకు.. వీరి గొడవకు సంబంధం లేకపోయినా.. కొందరు మాత్రం దానికి లింక్ చేస్తున్నారు. మరి, అనసూయ పోస్టుపై కోటా శ్రీనివాసరావు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు
Also Read: అందుకే పవన్‌తో మాట్లాడలేదు.. ఎవరుపడితే వాళ్లు ‘మా’లో సభ్యులు కాకూడదు: విష్ణు
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















