అన్వేషించండి

Chinmayi Sripada: కమల్, రజనీపై చిన్మయి విమర్శలు... లైంగిక వేధింపులు చేసిన వ్యక్తిని ప్రశంసిస్తారా?

Chinmayi Sripada VS Kamal Haasan Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ మీద సింగర్ చిన్మయి శ్రీపాద విరుచుకుపడ్డారు. ఈ వివాదానికి కారణం వైరముత్తుకు వచ్చిన జ్ఞానపీఠ్ అవార్డు.

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan)... తమిళ చలన చిత్రసీమలో ఇద్దరూ ఇద్దరే. లెజెండరీ నటులు, అగ్ర కథానాయకులు. వాళ్ళిద్దరినీ విమర్శించే సాహసం ఎవరూ చేయరు. కానీ, సింగర్ చిన్మయి శ్రీపాద 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కమల్, రజనీపై వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. ఎందుకో తెలుసా?

వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు
ప్రముఖ తమిళ రచయిత, సాహితీవేత్త వైరముత్తు (Vairamuthu Jnanpith)ను సాహితీ పురస్కారాల్లో అత్యున్నతమైన జ్ఞానపీఠ్ వరించింది. ఆయనకు పలు రాష్ట్రీయ, జాతీయ పురస్కారాలు వచ్చాయి. అయితే సాహితీ రంగంలో అత్యున్నత పురస్కారం రావడంతో తమిళనాట పలువురు ఆయనకు శుభాకంక్షాలు చెబుతున్నారు.

Also ReadJason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?

వైరముత్తుకు శుభాకాంక్షలు చెప్పిన తమిళ ప్రముఖుల్లో రజనీ, కమల్ ఉన్నారు. అది చిన్మయికి కోపం తెప్పించింది. వైరముత్తు తనను లైంగికంగా వేధించారని గతంలో ఆవిడ తెలిపారు. చిన్మయితో పాటు మరికొందరు మహిళలు సైతం విమర్శలు చేశారు. ఆ వివాదం ఇంకా కొనసాగుతోంది. సోషల్ మీడియా వేదికగా వైరముత్తుపై తన పోరాటం కొనసాగిస్తున్నారు చిన్మయి. వైరముత్తుకు మద్దతుగా నిలిచిన వ్యక్తులకు చురకలు అంటిస్తున్నారు. అందులో భాగంగా రజనీ, కమల్ మీద విరుచుకుపడ్డారు.

మహిళలకు మగవాళ్ల మద్దతు ఉండదు!
మగవాళ్ళు ఎప్పటికీ తమ వైపు నిలబడరని మహిళలు గుర్తు ఉంచుకోవాలని ఎక్స్ వేదికగా చిన్మయి శ్రీపాద పేర్కొన్నారు. సినిమా రంగంలో శక్తివంతమైన వ్యక్తులు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చెవిటి వాళ్ళుగా మారిపోయారని విమర్శలు చేశారు. తన మామ - గురువు వేధించారని, తమ పార్టీలో మహిళలు సైతం సదరు పోయెట్ మీద విమర్శలు చేసినా కమల్ పట్టించుకోవడం లేదని చిన్మయి ఎద్దేవా చేశారు. మగవాళ్ళు ఎప్పటికీ మగవాళ్లకు మద్దతు ఇస్తారని ఆవిడ పేర్కొన్నారు. 

Also ReadTrisha: ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?

వైరముత్తుకు రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పగా... 'అయ్యయ్యో' అంటూ వ్యంగ్యంగా స్పందించారు చిన్మయి. ఆవిడ వ్యవహారశైలి మీద ఎప్పటిలా సోషల్ మీడియాలో కొంత మంది విరుచుకుపడుతున్నారు.

Also ReadAllu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget