News
News
X

Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన ప్రియ..ఇచ్చి పడేసిన సన్నీ… హౌస్ లోకి లోబో రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

44 వ రోజు కూడా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ '"బంగారు కోడిపెట్ట" కొనసాగింది". సన్నీ-ప్రియ మధ్య మినీ యుద్ధమే జరిగింది...

FOLLOW US: 

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ "బంగారు కోడిపెట్ట" లో భాగంగా స్పెషల్ ఎగ్ సంపాదించుకున్న విశ్వకి బిగ్ బాస్ అదనంగా 5 గుడ్లుసంపాదించుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం ఇంటి సభ్యుల్లో ఒకర్ని ఎంపిక చేసుకుని దుస్తులు  వేసకునే పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగే సరికి ఎవరు ఎక్కువ దుస్తులు వేసుకుంటే వారు విజేతగా నిలుస్తారు. ఈ టాస్క్ లో కాజల్ తో పోటీ పడ్డాడు విశ్వ. ఎండ్ బజర్ మోగేసరికి ఎక్కువ దుస్తులు ధరించిన విశ్వ(106) అదనంగా ఐదు ఎగ్స్ దక్కించుకున్నాడు.

మళ్లీ కోడికూత వినిపించడంతో ఇంటి సభ్యులంతా ఎగ్స్ కోసం పోటీపడ్డారు. ఇంతలో ఆనీ మాస్టర్ బుట్టలోంచి ఎగ్ సిరి తీసుకోవడంతో ఇద్దరి మధ్యా కొద్దిసేపు తోపులాట జరిగింది. కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశాన్ని జెస్సీకి ఇచ్చిన బిగ్ బాస్.. ఎవరైనా ముగ్గురు ఇంటి సభ్యుల దగ్గర గుడ్లు లేకుండా నాశనం చేయాలి. రౌండ్ ముగిసేరికి ఆ ముగ్గురి దగ్గరా ఎగ్స్ లేకుండా చూసుకుంటే కెప్టెన్సీ పోటీదారుడు అవొచ్చనే ఆఫర్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యుల్లో ఒకరి సహాయం తీసుకోవచ్చని సూచించారు. సిరి సహాయం తీసుకున్న జస్వంత్ టాస్క్ లో భాగంగా  ప్రియ, ప్రియాంక, షణ్ముక్ దగ్గర ఎగ్స్ లేకుండా చూసుకుంటానని బిగ్ బాస్ కు చెప్పాడు.

45 వ రోజు ''జులాయి''లో పకడో-పకడో సాంగ్ తో మొదలైంది. కోడి కూత వినిపించగానే ఎప్పటిలానే ఇంటి సభ్యులు ఎగ్స్ కోసం పోటీపడ్డారు. ఇంతలో ప్రియ నాకు బుట్ట దొరికిందని పరిగెత్తింది. సన్నీ ఎగ్స్ ని ప్రొటక్ట్ చేసుకునేందుకు ప్రయత్నించగా తనపై ఫిజికల్ అయితే చెంప పగిలిపోతుందంది. సన్నీని టార్గెట్ చేస్తూ   చెంప పగిలిపోద్దని పదే పదే రెచ్చగొట్టడంతో సన్నీ కూడా స్ట్రాంగ్ గా రియాక్టయ్యాడు. ఇంటి సభ్యులు ఎంత వారించినా ప్రియా తగ్గలేదు. ఆ తర్వాత కూడా కాజల్ తో చర్చ పెట్టుకుని చాలా హడావుడి చేసింది. సిరి కూడా సన్నీ గుడ్లు తీసుకునేందుకు పోటీపడింది. ఆ తర్వాత సన్నీ-జస్వంత్ మధ్య గొడవ జరిగింది. మధ్యలో సిరి జోక్యం చేసుకుని నీకెందుకు రా అనడంతో ''రా'' అనే అర్హత కోల్పోయావని మరోసారి పిలవొద్దని సిరికి చెప్పాడు. గట్టిగా అరిచి సన్నీ హీరో అయిపోదాం అనుకుంటున్నాడని జెస్సీ అన్నాడు. మరోవైపు స్టిక్కర్లు పోగొట్టుకున్న సిరితో రవి డీల్ కుదుర్చుకున్నాడు. స్టిక్కర్లు ఎక్కడున్నాయో తెలుసని చెబితే తనకు సగం ఎగ్స్ ఇవ్వాలన్నాడు. సరే అన్న సిరి తన ఫొటో ఉన్న స్టిక్కర్లను వెతికి తీసుకుంది.

స్పెషల్ ఎగ్ దక్కించుకున్న శ్రీరామ్ కి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. రెండు బాతులను ప్లేట్స్ పై పెట్టుకుని ఎవరి బొమ్మని వాళ్లు కాపాడుకుంటూనే మరొకరు గెలవకుండా చూసుకోవాలి. ఈ టాస్క్ లో శ్రీరామ్-ఆనీ మాస్టర్ పోటీ పడగా విజేతగా నిలిచిన ఆనీ మాస్టర్ ఐదు అదనపు ఎగ్స్ దక్కించుకున్నాడు. గురువారం ఎపిసోడ్ లో లోబో హౌస్ లోకి  రీఎంట్రీ ఇచ్చాడు. 
Also Read: నాగబాబు గొప్ప నటుడేమీ కాదు.. చిరు, పవన్ లేకపోతే..: కోట శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు
Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?
Also Read: కోర్టుకెక్కిన సమంత.. ఇక వాళ్లకు చుక్కలే!
Also Read: అవినాష్ పెళ్లి.. తప్పు జరిగిపోయిందంటూ రామ్ ప్రసాద్ కామెంట్స్, ఆ వీడియో లీక్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Oct 2021 08:00 AM (IST) Tags: Kajal priyanka Bigg Boss 5 Telugu Ravi Siri Sunny Viswa Priya Sri Ram Anee Master Jeswanth 7th Week captaincy contestants Task Bangaru Kodi petta

సంబంధిత కథనాలు

Tejaswi Madivada Shocking Comments : అడల్ట్ కంటెంట్ చేయడంలో తప్పేముంది? - తేజస్వి షాకింగ్ కామెంట్స్

Tejaswi Madivada Shocking Comments : అడల్ట్ కంటెంట్ చేయడంలో తప్పేముంది? - తేజస్వి షాకింగ్ కామెంట్స్

Boycott Vikram Vedha : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?

Boycott Vikram Vedha : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Karthikeya 2 Box Office Collection Day 1 : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.

Karthikeya 2 Box Office Collection Day 1 : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.

Nandamuri Balakrishna : సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ?

Nandamuri Balakrishna : సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ?

టాప్ స్టోరీస్

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!