Brahmamudi February 8th: రాజ్ కి షాకిచ్చిన తల్లి- పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు రానన్న స్వప్న తండ్రి
దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం ప్లాన్స్ వేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య క్యారెక్టర్ ని తన క్యారెక్టర్ గా చెప్పుకుని స్వప్న రాజ్ కుటుంబ సభ్యుల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంది. తన మాటలు విన్న రాజ్ కుటుంబం స్వప్న ఈ ఇంటి కోడలైతే అందర్నీ ప్రేమగా చూసుకుంటుందని అనుకుంటారు. కానీ రాహుల్ మాత్రం స్వప్న రాజ్ ని మాత్రమే కాదు తనని కూడా ఇంప్రెస్ చేసిందని, ఎలాగైనా సొంతం చేసుకోవాలని ట్రై చేస్తాడు. ఇక రాజ్ తల్లి స్వప్నని తన తల్లిదండ్రులను తీసుకొని ఇంటికి రమ్మని చెప్తుంది. రాజ్ నెంబర్ తీసుకోవడం కోసం తన పేరెంట్స్ ఎప్పుడు వస్తారో చెప్పాలంటే ఎవరికి ఫోన్ చేయాలని అంటుంది. రాజ్ ఫోన్ నెంబర్ ఇవ్వబోతుండగా తన బాబాయి వచ్చి గుడి నుంచి పూజారి గారు ఫోన్ చేశారని వెంటనే పూజ చేయడానికి రమ్మని చెప్పాడని అనడంతో రాహుల్ తనని బలవంతంగా అక్కడి నుంచి పంపించేస్తాడు. ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో ఏముందంటే..
Also Read: జానకిని ఇబ్బంది పెట్టేందుకు స్కెచ్ వేసిన మల్లిక- భార్యతో రామ సరసాలు
స్వప్న సంతోషంగా తల్లిని హగ్ చేసుకుని దుగ్గిరాల కుటుంబానికి కోడల్ని కాబోతున్నాను అని సంబర పడుతుంది. రాజ్ వాళ్ళ అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పిందని చెప్తుంది. దీంతో కనకం హడావుడిగా భర్తని కోటీశ్వరుల్లాగా రెడీ అవమని చెప్తుంది. కానీ ఆయన మాత్రం ఒప్పుకోడు. బొమ్మలకి రంగులు వేయగలను ఏమో కానీ మనసుకి రంగు వేసుకోలేనని సంబంధం మాట్లాడుకోవడానికి రానని తెగేసి చెప్పేస్తాడు. వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచిద్దామని రాజ్ తల్లి అంటుంది. అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు నచ్చితే చాలదా వాళ్ళ కుటుంబం నచ్చకపోతే ఈ పెళ్లి జరగదా అని రుద్రాణి అంటుంది. జరగదని రాజ్ తల్లి ఖరాఖండిగా చెప్పేసరికి రాజ్ షాక్ అవుతాడు.
మంగళవారం నాటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే. .
కావ్య గంగాజలం తీసుకోవడానికి గుడికి వస్తుంది అదే గుడికి రాజ్ కూడా దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించడం కోసం వస్తాడు. గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉన్న సమయంలో ఒక పిల్లాడు రాజ్ ని ఢీ కొట్టి వెనుకాలే ఉన్న కావ్యకి కూడా తగులుతాడు. దీంతో రాజ్ కింద పడిపోబోతుండగా కావ్య పట్టుకుంటుంది. మరోవైపు అప్పు, కళ్యాణ్ జంట కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఎందుకు నన్ను పట్టుకున్నావ్ అని రాజ్ కావ్యత్వ గొడవకి దిగుతాడు. ఇద్దరూ నువ్వు ఛీ ఛీ అంటే నువ్వు ఛీ ఛీ అనుకుంటూ టామ్ అండ్ జెర్రీలాగా పోట్లాడుకుంటారు.
Also Read: కేఫ్ లో గొడవకు దిగిన లాస్య- తులసి చేసిన బర్గర్ తిని బిత్తరపోయిన కస్టమర్
View this post on Instagram