Ennenno Janmalabandham February 8th:కేఫ్ లో గొడవకు దిగిన లాస్య- తులసి చేసిన బర్గర్ తిని బిత్తరపోయిన కస్టమర్
నందు కేఫ్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసి బాధపడుతూ ఉంటే ప్రేమ్ పాట పాడి నవ్వించడానికి చూస్తాడు. అప్పుడే అభి తన తల్లి దగ్గరకి వచ్చి చెంపలు వేసుకుని గుంజీళ్ళు తీయబోతుంటే తులసి దగ్గరకి తీసుకుని ఎమోషనల్ అవుతుంది. నందు అది చూసి సంతోషిస్తాడు. తర్వాత అందరూ కలిసి మళ్ళీ సాంగ్ వేసుకుని తులసిని నవ్విస్తారు. లాస్య అదంతా చూసి కుళ్ళుకుంటుంది. వీడిది అంతా నాన్న పోలిక నిమిషంలో ఫైర్ అవుతాడు, అరనిమిషంలో కూల్ అవుతాడని లాస్య తిట్టుకుంటుంటే అదే ఉమ్మడి కుటుంబం అంటే అపార్థాలు తాత్కాలికమే బంధాలు, అనుబంధాలు శాశ్వతమని నందు అంటాడు. లక్కీ కేఫ్ ని చక్కగా దేకరేట్ చేసి ఓపెన్ చేయడానికి రెడీ అయిపోతారు.
కేఫ్ ఓపెనింగ్ కి గాయత్రి కూడా వస్తుంది. అనసూయ, పరంధామయ్య కేఫ్ ఓపెనింగ్ చేస్తారు. తులసిని వచ్చి కొబ్బరికాయ కొట్టమని అనసూయ పిలుస్తుంది. కేఫ్ ఓనర్ నందు ఆయన భార్య నేను ఉన్నాను మా తర్వాత బయట వాళ్ళు అని లాస్య అనేసరికి తులసి ఆగిపోతుంది. దీంతో లాస్య, నందు అందరూ కలిసి కొబ్బరికాయ కొట్టి కేఫ్ లోకి అడుగుటపెడతారు. కేఫ్ లో దీపం పెడుతుంది తులసి. అంకితతో కలిసి నా ఇంటికి రావడం గురించి ఏం ఆలోచించావ్ అని గాయత్రి అడుగుతుంది. మొండిగా చేస్తే అంకిత మరింత మొండిగా మాట్లాడుతుందని అభి అనేసరికి అయితే సైకిల్ మీద ఇడ్లీలు పెట్టుకుని నువ్వు కూడా అమ్ముకో అని అవమానించి వెళ్ళిపోతుంది.
Also Read: లాస్య షాక్, మాజీ భార్య గురించి గొప్పగా చెప్పిన నందు- అభి మాటలకు గుండె పగిలేలా ఏడ్చిన తులసి
గాయత్రి లాస్య దగ్గరకి వచ్చి కేఫ్ స్టార్ట్ చేసినందుకు కంగ్రాట్స్ చెప్తూనే వెటకారంగా మాట్లాడుతుంది. నీ అతితెలివితేటలు నా దాగగర కాదు తులసి దగ్గర చూపించమని లాస్య తిడుతుంది. 'గతంలో పెళ్ళైన తులసి ఇంట్లో ఉండేది, నువ్వు నందుతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగావు. కానీ ఇప్పుడు మారింది తులసి స్థానంలో నువ్వు వెళ్ళావ్. నువ్వు ఇంట్లో కూర్చుని ఉంటే తులసి నందు చక్కగా కేఫ్ లో ముద్దు ముచ్చట్లు ఆడుకుంటారు. మాజీ మొగుడు, మాజీ పెళ్ళాం మధ్య మోజు పుట్టడం కష్టమేమి కాదు. నువ్వు కాలు మీద కాలు వేసుకుని ఇంట్లో ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు చేతిలో చెయ్యి వేసుకుని చక్కగా తిరిగేస్తారు’ అని గాయత్రి విషం ఎక్కిస్తుంది. కావాలంటే పక్కకి తిరిగి చూడు అని నందు, తులసి ఎలా ఉన్నారో అని అంటుంది.
Also Read: అభిమన్యుతో చేతులు కలిపిన విన్నీ- వేద కోసం పార్టీకి వచ్చిన యష్
లాస్య వాళ్ళని చూసి షాక్ అవుతుంది. అంకితని చూపించి నీ కూతురు పని చూడు ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉందని లాస్య గాయత్రిని అంటుంది. తర్వాత తులసి దేవుడి ముందు హారతి ఇచ్చి పూజ చేస్తుంటే లాస్య వచ్చి ఆపుతుంది. ఎందుకు అందరి ముందు నా పరువు తీస్తున్నావ్, ఈ కేఫ్ నందుది అంటే నాదే, నా కేఫే కి వచ్చి నువ్వు ఎలా పూజలు చేస్తావ్ అని అడుగుతుంది. నువ్వు గాయత్రితో బాతాకాని వేస్తున్నావ్ మేము నిన్ను పిలిచాము రాలేదు అందుకే తులసిని ఇవ్వమని చెప్పామని అనసూయ అంటుంది. కానీ లాస్య మాత్రం ఒప్పుకోదు. లాస్య గొడవ చేస్తుంటే ఒక కస్టమర్ వచ్చి అది చూసి వెనక్కి వెళ్లబోతుంటే తులసి రమ్మని పిలుస్తుంది. కానీ అతను మాత్రం రాగానే గొడవ చూశాను వద్దులే అని దణ్ణం పెట్టేసి వెళ్ళిపోతాడు.