Ennenno Janmalabandham February 7h: అభిమన్యుతో చేతులు కలిపిన విన్నీ- వేద కోసం పార్టీకి వచ్చిన యష్
యష్, వేద మధ్యలోకి విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద అందంగా రెడీ అయి ఉండేసరికి యష్ బిత్తరపోతాడు. ఇదేంటి పార్టీకి మీరు రావాల్సిందే రండి ప్లీజ్ అని బతిమలాడుతుందని అనుకుంటే అసలు నన్ను పట్టించుకోకుండా ఉంది ఏంటని మనసులో అనుకుంటాడు. వేద పట్టించుకొకపోయేసరికి పొద్దున పార్టీకి వెళ్దాం అన్నావ్ అని యష్ అడుగుతాడు. మీరు బిజీ అన్నారు కదా మాటిమాటికీ మిమ్మల్ని బతిమలాడి ఇబ్బంది పెట్టడం బాగోదు కదా అందుకే నేను వెళ్తున్నా నాకు తప్పదు కదా, మీకు రావాలని అనిపిస్తే రండి రహస్యంగా వచ్చి మాత్రం వెళ్లిపోకండి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని అంటుంది. వేద వెళ్లిపోవడంతో ఆవిడ వెనుకాలే తోకలా వెళ్ళాలా వెళ్ళను అని అనుకుంటాడు.
వేదకి విన్నీ వెల్కం చెప్తాడు. యష్ రాలేదా అని అంటాడు. ఇద్దరం కలిసే వచ్చాం బిజినెస్ కాల్ వచ్చి ఆగిపోయాడని వస్తాడని వేద కవర్ చేస్తుంది. తనని వదిలేసి వెళ్లిపోయినందుకు యష్ చిటపటలాడుతూ ఉంటాడు. కాసేపు వేదని తిట్టుకుంటాడు. అక్కడ పార్టీలో వేద తన శ్రీవారి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. బతిమలాడకుండా వచ్చానని అలిగారా ఏంటని అనుకుంటుంది. ఫోన్ ట్రై చేస్తుంది కానీ కలవదు. ‘తన దగ్గర నేను తగ్గితే ఏమవుతుంది, తను పార్టీకి ఒంటరిగా వెళ్ళడం ఏంటి నా భార్య పక్కన నేను లేకపోతే ఏమనుకుంటారు. వెళ్తాను నాకోసం కాదు తన కోసం’ అని యష్ అనుకుని రెడీ అయిపోతాడు. అభిమన్యు మాళవికని వదిలేసి పార్టీకి వెళతాడు. యష్ కోసం వేద టెన్షన్ పడుతూ ఉంటే విన్నీ వచ్చి పలకరిస్తాడు.
Also Read: స్వప్నకి కుజదోషం, కనకం నెత్తిన పిడుగు- మళ్ళీ గొడవపడిన రాజ్, కావ్య
ఎన్ని సార్లు కాల్ చేసిన అటువంటి నుంచి రెస్పాన్స్ రావడం లేదా అని తన ప్రేమ గురించి విన్నీ చెప్తాడు. పార్టీకి నీ వల్లే గ్లామర్ వచ్చిందని అందరూ అనుకుంటున్నారని విన్నీ చెప్పేసరికి వేద ఈ మాటలు ఇక ఆపు అని చెప్తుంది. మళ్ళీ ఏం మాట్లాడిన వేద దగ్గరకే వస్తాడు. ఒకరికోసం ఒకరు పుట్టినట్టు ఉండాలి అదే భార్యాభర్తల బంధమని అంటాడు. యశోధర్ కి తనకి మధ్య ఆ బంధమే ఉందా, మేమిద్దరం ఒకరికోసం ఒకరం అన్నట్టుగా ఉన్నామా అని వేద ఆలోచిస్తూ ఉంటుంది. వేద ఫోటో చూస్తూ మాట్లాడతాడు. నేను వస్తున్నా కానీ అక్కడ ఒక కండిషన్ నన్ను చూసి నవ్వకూడదని ఫోటో చూస్తూ చెప్తాడు. రాను అన్నావ్ కదా ఎందుకు వచ్చావ్అని నిలదీస్తే.. రాకూడదని ఉన్నా వస్తున్నా అంటే నీ దగ్గర తక్కువ కాకూడదని అంటాడు.
Also Read: ఇగో మాస్టర్ వంకర ప్రశ్నలు, పొగరు తిక్క సమాధానాలు- రిషిధారని కలిపేందుకు మహేంద్ర స్కెచ్
విన్నీ పార్టీకి అభిమన్యు వస్తాడు. రాగానే అమ్మాయిలను ఫ్లట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. వేద ఒక్కతే ఉంటే విన్నీ వచ్చి పలకరిస్తాడు. అప్పుడే అభిమన్యుని చూసి ఎందుకు వచ్చాడని అడుగుతుంది. అతను చాలా బ్యాడ్ పర్సన్ అని వేద చెప్తుంది. పర్సనల్ గా అతను ఎలాంటి వాడైనా నాకు అనవసరం, బిజినెస్ మెన్ గా అతనితో తనకి పని అని విన్నీ చెప్తాడు. అతను ఎలాంటి వాడో తెలియదని వేద టెన్షన్ గా అంటే విన్నీ అంటే నీకు బెస్ట్ ఫ్రెండ్ గా మాత్రమే తెలుసు కానీ నాలో బిజినెస్ మెన్ గా ఇంకొక యాంగిల్ ఉంది అది నీకు తెలియదని అంటాడు. ఇలాంటి అభిమన్యులను చాలా మందిని చూశాను ఏం టెన్షన్ పడకని ధైర్యం చెప్తాడు.