Guppedanta Manasu February 6th: ఇగో మాస్టర్ వంకర ప్రశ్నలు, పొగరు తిక్క సమాధానాలు- రిషిధారని కలిపేందుకు మహేంద్ర స్కెచ్
Guppedantha Manasu February 6th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
వసు మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకోవాలని రిషి అనుకుంటాడు. కాలేజీకి వచ్చి వసుధార వస్తుందా అని అనుకుంటూ ఉంటాడు. వసు ఎవరిని పెళ్లి చేసుకుంది, తన మెడలో తాళి కట్టింది ఎవరని ఆలోచిస్తూ ఉండగా వసు వచ్చి రిషి కూర్చున్న చెట్టుకిందే మరొక వైపు కూర్చుంటుంది. అక్కడ రిషిని చూస్తుంది. కాలేజ్ కి వచ్చావా అని రిషి అప్పుడే మెసేజ్ చేస్తాడు. వసుకి వచ్చిన్ మెసేజ్ సౌండ్ విని వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ వసు మాత్రం మెసేజ్ లోనే సమాధానంఇస్తుంది. ఎదురుగా ఉండి కూడా మాట్లాడుకోకుండా ఇద్దరూ కాసేపు మెసేజ్ చేసుకుంటారు. పెళ్లి గురించి ఎలా తెలుసుకోవాలా అని రిషి ఆలోచిస్తాడు. గతంలో పెళ్లి విషయం చెప్పడానికి రిషి దగ్గరకి వెళ్తే గట్టిగా అరిచిన విషయం వసు గుర్తు చేసుకుంటుంది.
Also Read: చిత్రమీద కన్నేసిన అభిమన్యు, మాళవిక గతి ఇక అథోగతి- విన్నీ పార్టీకి వెళ్తున్న వేద
చెట్టుకి చెరొక వైపు రిషి, వసు ఉండటం చూసి జగతి, మహేంద్ర మురిసిపోతారు. వీళ్ళు ఏం చేస్తున్నారా అని మహేంద్ర వెళ్లబోతుంటే వాళ్ళని చూసి వసు జగతి దగ్గరకి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తుంది. వసుతో జగతి వాళ్ళు నవ్వుతూ మాట్లాడటం చూసి రిషి వచ్చి ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు. వసుధార ఏదైనా ప్రాబ్లంలో ఉందేమోనని మహేంద్ర అంటాడు. జగతి నవ్వుతూ మాట్లాడటం చూసి రిషి మేడమ్ లో ఏదో తేడా కొడుతుందని అనుకుంటాడు. ఇక వసు, రిషిని కలిపేందుకు మహేంద్ర ప్లాన్ వేస్తాడు. ఇద్దరూ కలిసి మంత్రి దగ్గరకి వెళతారు. విలేజ్ లో మిషన్ ఎడ్యుకేషన్ పనులు మొదలు పెట్టమని మంత్రి అంటాడు.
మిషన్ ఎడ్యుకేషన్ లో రిషి, వసు, జగతి కలిసి అద్భుతాలు చేస్తున్నారని మెచ్చుకుంటాడు. ఇక వసు దగ్గర నుంచి విషయం ఎలాగైనా రాబట్టాలని రిషి తెగ తిప్పలు పడతాడు. వసు తన క్యాబిన్ లో కూర్చుని వర్క్ చేసుకుంటుంటే రిషి లోపలికి రావచ్చా అని అడుగుతాడు. వసుధార మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు.
రిషి: మామూలుగా అయితే ఇటువంటి టైమ్ లో అటు ఇటు ప్రయాణాలు చేస్తారు కదా నువ్వేంటి ఎక్కడికి వెళ్లలేదా
వసు: ఎక్కడికి వెళ్ళాలి సర్
రిషి: కొన్నాళ్ళు లీవ్ తీసుకోకుండా ఏంటి ఇలా వచ్చావ్
వసు: చపాతీలు తెచ్చాను మీకు కూడా చపాతీలు చేయడం వచ్చు కదా సర్
Also Read: అది 'కేఫ్ కాదు కాకమ్మ హోటల్' అన్న అభి- నందుకి సపోర్ట్ గా మాట్లాడిన తులసి
రిషి: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి మీటింగ్ ఎప్పుడు ఉంటుంది
వసు: మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అడగటానికి ఇగో అడ్డొస్తుంది అయినా మీరు అడిగినా నేను చెప్పను
రిషి ఇన్ డైరెక్ట్ గా వసు పెళ్లి గురించి మాట్లాడుతుంటే తను మాత్రం ఏదేదో మాట్లాడుతుంది. చెప్పాల్సింది మాత్రం చెప్పవు కదా అని తిట్టుకుంటాడు. ఇద్దరూ కలిసి కూర్చుని తింటూ ఉంటారు. మీతో జీవితాంతం కలిసి తినే అవకాశం ముందు ముందు వస్తుందని వసు మనసులో అనుకుంటుంది. నీతో కలిసి గడిపే ప్రతి క్షణం ఎంతో బాగుంటుందని రిషి అనుకుంటాడు. అటు ఇంట్లో దేవయాని రాజీవ్ పట్టుబట్టాడు, వాడు ఉంటే వసుని ఎలాగో ఇబ్బంది పెట్టేవాడు ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ధరణి నవ్వుతూ వచ్చి స్వీట్ తీసుకొచ్చి ఇస్తుంది.