Gruhalakshmi February 6th: అది 'కేఫ్ కాదు కాకమ్మ హోటల్' అన్న అభి- నందుకి సపోర్ట్ గా మాట్లాడిన తులసి
లాస్య నిజస్వరూపం బయట పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నందు కేఫ్ పెట్టాలనుకున్న ప్రదేశానికి వస్తారు. ఆ స్థలం అంతా మురికిగా ఉండటం చూసి దీన్ని ఎలా శుభ్రం చేస్తాం అని లాస్య కసురుకుంటుంది. ప్రేమ్, తులసి కౌంటర్ వేస్తారు. ప్రతిదీ నెగటివ్ గా మాట్లాడొద్దని నందు తనని తిడతాడు. మనుషుల మధ్య కేఫే ఉండాలి ఇలా ఎవరూ లేని చోట కాదని లాస్య అంటుంది. మార్కెటింగ్ ఎక్కడైనా చేయాలని తులసి అంటుంది. నాలుగు ముక్కలు ఇంగ్లీషు మాట్లాడినంత మాత్రాన మార్కెటింగ్ గురించి మాట్లాడతన్నావా అని లాస్య హేళన చేస్తుంది. తులసి ఇప్పుడు ఒక కంపెనీకి జీఎం మరి నువ్వు ఏంటి అని పరంధామయ్య కౌంటర్ వేస్తాడు. ఈ స్థలం రూపురేఖలు మారుస్తా అంటున్నారు సజేషన్స్ ఏమైనా ఉంటే చెప్పు అంతే కానీ చెడగొట్టకని నందు గడ్డి పెడతాడు. దీంతో అందరూ కలిసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తారు.
Also Read: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం
అంకిత క్లీన్ చెయ్యడానికి రెడీ అవుతుంటే అభి కోపంగా మనం హాస్పిటల్ కి వెళ్లాలి మర్చిపోయావా అని అడుగుతాడు. ఇంట్లో వాళ్ళందరూ కేఫే నిలబెట్టడం ఇక ఉద్యమంలా తీసుకున్నారు తలతిప్పే ప్రసక్తే లేదని అంకిత చెప్తుంది. కానీ అభి మాత్రం సక్సెస్ అవుతుందో లేదో తెలియని కేఫ్ కోసం ఉద్యోగాలు రిస్క్ లో పెట్టాలా అని అభి చిరాకుగా అంటాడు. లాస్య ఆంటీ చెప్పినట్టు ఇక్కడ కేఫ్ పెట్టడం అనవసరం వేరే ఏదైనా చోట పాన్ షాప్ పెట్టుకోవడం నయం, కావాలంటే నేను హెల్ప్ చేస్తానని అవమానించేలా మాట్లాడటంతో నందు మొహం మాడ్చుకుంటాడు. అంకిత తనని తిట్టేసి పంపించేస్తుంది. అందరూ తలా ఒక చెయ్యి వేసి లక్కీ కేఫ్ ని రెడీ చేసేస్తారు. ఒక్క నిమిషం పాటలోనే అందమైన కేఫ్ రెడీ అయిపోతుంది.
అది చూసి పరంధామయ్య ఎమోషనల్ అవుతాడు. అందరూ తన కోసం కష్టపడినందుకు నందు థాంక్స్ చెప్తాడు. నీకోసం హెల్ప్ చేసినందుకు సంతోషంగా ఉందని ప్రేమ్ అంటాడు. దీనికి కారణం తులసి ఆంటీ అని అంకిత అంటుంది. అందరూ నవ్వుతూ ఉంటే లాస్య వాళ్ళ హ్యపీనెస్ చెడగొడుతుంది. కేఫే ఉంటే సరిపోదు అందులోకి మెనూ ఉండాలి కదా అని లాస్య అంటుంది. అనసూయ రెడీ చేశానని చెప్తే లాస్య చిరాకుగా తనని నానమాటలు అంటుంది. ప్రేమ్ మెనూ లో ఉన్న ప్రతిదీ చదివి వినిపిస్తాడు. మెనూ గురించి కాసేపు క్లాస్ తీసుకుంటుంది. కేఫే కి సంబంధించిన లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అభి కోపంగా వస్తాడు. ఆగకుండా వెళ్తుంటే అందరూ తనని ఆపుతారు. డల్ గా ఉండటం చూసి ఏమైందని తులసి అడుగుతుంది.
Also Read: నందు కేఫ్‌కి సామ్రాట్ సాయం- విడాకులిస్తానంటూ అంకితని బెదిరించిన అభి
రేపు ఫంక్షన్ కి రమ్మని మీ అత్తయ్యకి చెప్పావా అని తులసి అభిని అడుగుతుంది. చెప్పలేదు మీరేమైన ఫైవ్ స్టార్ హోటల్ స్టార్ట్ చేస్తున్నారా ఇడ్లీ, వడ, టీ, కాఫీ అమ్ముకునే కాకమ్మ హోటల్ పెడుతున్నారు డానికి ఇంత పనికిమాలిన మీటింగ్ అవసరమా. నాకే ఆ ఫంక్షన్ కి రావడానికి చిన్నతనంగా ఉంది, నేనే రాకూడదని డిసైడ్ అయ్యానని అభి సీరియస్ గా చెప్తాడు. ఏదో చిరాకులో అన్నాడని తులసి కవర్ చేస్తుంది. కానీ అభి మాత్రం స్టేటస్ అంటే ఇంట్లో ఎవరికి తెలియదని అంటాడు. మిమ్మల్ని చూస్తేనే సిగ్గుగా అనిపిస్తుందని నోరు పారేసుకుంటాడు. దీంతో తులసి నందుని వెనకేసుకొచ్చేలా మాట్లాడుతుంది. మీరంతా ఇంత కష్టపడుతుంది ఎవరినో నిలబెట్టడానికి కాదు ఫ్యామిలీ స్టేటస్ దిగజారుస్తున్నారని అభి మనసులో ఉన్న విషం కక్కుతాడు.